నితీష్ కుమార్ ‘మోడీ’కరణ! -కార్టూన్


The Hindu

The Hindu

కేశవ్ నుండి మరో అద్భుతమైన, నిశితమైన, శక్తివంతమైన కార్టూన్!

మోడి నియంతృత్వ పోకడలు ఇతర పార్టీలే కాకుండా బి.జె.పి నాయకులు కూడా అనేకమంది విమర్శిస్తారు. తన ప్రధాని కలకు అడ్డువచ్చిందుకు ఎల్.కె.అద్వానీ మోడి సహిత బి.జె.పి పైన చేసిన విషయం ఇంకా పత్రికల్లో నానుతోంది. గోధ్రా అనంతర అల్లర్లను ఆపకుండా రాజధర్మ నిర్వహణలో విఫలమైనందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సైతం మోడీని విమర్శించారు. పరమత విద్వేష పూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన ప్రవీణ్ తొగాడియా (విశ్వ హిందూ పరిషత్ నాయకుడు) కూడా మోడీ నియంతృత్వాన్ని తెగనాడినవారే. గుజరాత్ బి.జె.పి నాయకుడు కేశూభాయ్ పటేల్ తో పాటు ఇంకా అనేకమంది మోడి నియంతృత్వం వల్ల గాయపడి పక్కకు వెళ్ళిపోయారు.

ఈ దారిలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పయనిస్తున్నారా అన్న అనుమానం ఈ కార్టూన్ వ్యక్తం చేస్తోంది. మోడికి మీసం తీసేస్తే నితీష్ ప్రత్యక్షం అవుతారన్న సూచన ఈ కార్టూన్ వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ గేలానికి ఇరుక్కున్న చేపను (ఎమ్మెల్యేలను) మింగిన నితీష్ తన బలాన్ని నిరూపించుకోగలిగారు. ఒక పక్క కాంగ్రెస్ మద్దతు తీసుకుంటూనే ఆ పార్టీకీ తమకూ ఒప్పందం ఏదీ జరగలేదని నితీష్ చెప్పుకొచ్చారు. బీహార్ ప్రజల తీర్పును నితీష్ తిరస్కరించి వారిని మోసం చేసినందుకు నిరసనగా అని చెబుతూ బి.జె.పి జరిపిన బంద్ హింసాత్మకంగా మారడంలో జె.డి(యు) కార్యకర్తలు యధాశక్తి పాలుపంచుకున్నారు. ఏకులా వచ్చిన మోడి, బి.జె.పిలో మేకైన చందంగా మారినట్లు కాంగ్రెస్ చలవతో గట్టెక్కిన నితీష్ రేపు యు.పి.ఏ లో నిర్ణయాత్మక శక్తి కానున్నారా?

One thought on “నితీష్ కుమార్ ‘మోడీ’కరణ! -కార్టూన్

  1. ఇవాళ ఉదయం ఈ కార్టూన్ ను చూసినపుడు నాకు అర్ధం కాలేదు. మోడీ మీసం తీసేస్తే నితీశ్ అవుతారన్న మాట. నిజమేనండి.
    తెలుగు పత్రికల్లో ( చాలా ) కార్టూన్లు కాసేపు నవ్వుకోవడానికి పనికొస్తాయి. హిందూ కార్టూన్లు మాత్రం మెదడుకు చాలా పని పెడతాయి.

వ్యాఖ్యానించండి