గాంధీల ఆత్మను మోసి అలసిన మన్మోహన్ దేహం -కార్టూన్


The Hindu

The Hindu

కార్టూనిస్టులు ఎంత సున్నితంగా -కానీ శక్తివంతంగా- ఆలోచించగలరో ఈ కేశవ్ సురేంద్ర కార్టూన్ మరొక ఉదాహరణ.

“రాహుల్ గాంధీ నా చెప్పుల్లో తన కాళ్ళు దూర్చవచ్చు” (Rahul Gandhi can step into my shoes) అని మన్మోహన్ గాంధీ, క్షమించాలి, మన్మోహన్ సింగ్ నిన్న (మంగళవారం) చేసిన ప్రకటనను వాస్తవాలకు అన్వయించిన విధానం అద్వితీయం!

రాహుల్ గాంధీని మన్మోహన్ ఆహ్వానించడం ఇదే మొదటిసారి కాదు. బహుశా చివరిసారీ కాదేమో. ఈయన ఆహ్వానం పలకడం ఆయన సున్నితంగా తిరస్కరించడం ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకులు కీర్తించడం… జనానికి ఇదొక వినోదం, తలవంపులు కాకపోతే!

కాకపోతే ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు ఎంతటి ఆత్మ విశ్వాసం లేదా కనీసం నమ్మకం ఇవ్వాలి? అటు అమెరికా అధ్యక్షుడి నుండి ఇటు రాహుల్ గాంధీ వరకూ మన ప్రధానికి బాసులే అని అర్ధం అయితే ప్రజలకు నమ్మకం సంగతి అలా ఉంచితే, కనీసం గౌరవం కలుగుతుందా?

మన్మోహన్ సింగ్ తొమ్మిదేళ్లు తనవి కాని ఆత్మలను మోసి మోసి అలసిపోయారు. మూడోసారి కూడా యు.పి.ఏ అధికారంలోకి వస్తుందంటున్న ప్రధాని ఆ భారం ఇక మోయలేనని భావించే రాహుల్ గాంధీని మరొకసారి ఏకంగా తన చెప్పుల్నే తీసుకోవచ్చని వేడుకుంటున్నారని ఈ కార్టూన్  సూచిస్తోంది. మన్మోహన్ తొడిగిన చెప్పుల జాడలు కాకుండా మరెవరివో అడుగుల జాడలు పడడాన్ని బట్టి ఆయన తనది కానీ ఆత్మని మోస్తున్నారని కూడా కార్టూన్ సూచిస్తోంది.

మన్మోహన్ తనకి తాను భారం అయ్యాక దేశ ప్రజలకి మాత్రం భారం కారా?!

One thought on “గాంధీల ఆత్మను మోసి అలసిన మన్మోహన్ దేహం -కార్టూన్

వ్యాఖ్యానించండి