కాంగ్రెస్, బి.జె.పి ల తేడా? -ఇలస్ట్రేషన్


From Facebook

From Facebook

భారత దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య తేడా క్రమంగా కనుమరుగవుతున్న సంగతి అంతకంతకూ ప్రస్ఫుటం అవుతోంది. జె.డి(యు) కేంద్రంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు అందుకు ఒక సాక్ష్యం మాత్రమే. కాంగ్రెస్, బి.జె.పిల మధ్య వారు చెప్పుకునే సైద్ధాంతీక విభేదాలే ఉన్నట్లయితే జె.డి(యు) ఆ రెండు పార్టీలకూ ఉమ్మడి మిత్రుడు ఎలా కాగలుగుతుంది? నిన్న, ఈరోజు అన్న ఒక్క తేడాయే తప్ప జె.డి(యు)-బి.జె.పి, జె.డి(యు)-కాంగ్రెస్ సంబంధాల్లో ఉన్నదంతా పోలికే.

దేశంలోని పార్లమెంటరీ పార్టీలన్నీ ఒక తానులోని ముక్కలే. వారంతా ధనిక వర్గాలకు ప్రతినిధులు తప్ప శ్రామిక ప్రజలకు కాదు. వాటాల పంపకంలో వారిలో వారికి తగాదా వస్తేనే వారికి ప్రజలు గుర్తుకొస్తారు. అప్పుడు కూడా ప్రజల ఓట్లు కావాలి కాబట్టే గుర్తుకొస్తారు తప్ప వారి సమస్యలు తీరుద్దామని మాత్రం కాదు. 66 సంవత్సరాల భారతీయ దొరల పాలన చెబుతున్నది అదే.

8 thoughts on “కాంగ్రెస్, బి.జె.పి ల తేడా? -ఇలస్ట్రేషన్

  1. మూల గారు….ఇందులో వెగట ( వెగటు ) ఎక్కడుందో నాకర్ధం కాలేదు. పోనీ వెగట లేకుండా మీరు చెప్పండి చూద్దాం. నిజాలెప్పుడూ నిష్కర్షగానే ఉంటాయి.

  2. మాట కన్న రాత రాత కన్న గీత(చిత్రాలు) ప్రభావవంతమైనవని నా అభిప్రాయం.దేశకాలమాన పరిస్థితుల ద్రుష్ట్యా మధ్యవేలుతో చూపించిన చిత్రం మనకు అనవసరమని నా ఉద్ధేశ్యం!

  3. మూల గారు,

    “దేశకాలమాన పరిస్థితుల ద్రుష్ట్యా ”

    దీనిని వివరించే ప్రయత్నం చేయగలరా? మీ దృష్టి కోణం తెలుసుకోవాలన్న ఆసక్తితో అడుగుతున్నాను.

  4. ఓ మూల గారు….మీరు ఆ బొమ్మ గురించి అంటున్నారా. నేనేమో….విషయంలో వెగుటు ఎక్కడ ఉందా అని అనుకున్నాను. ఓకే. మీ ఉద్దేశం నాకర్థమైంది.

  5. నిజానికి ఆ ‘వెగటు’ అర్ధం ఏమిటో నాకే తెలియలేదు. ఎన్నికల ముందు అభయ హస్తం చూపే కాంగ్రెస్ ఎన్నికల తర్వాత మొండి చెయ్యి చూపుతుంది అన్న అర్ధం నేను చూశాను. చూడబోతే చందుతులసి గారికి కూడా వెగటు ఏమిటో తెలిసినట్లుంది. ఇంతకీ మధ్య వేలు చూపించడంలో వెగటు ఏమిటి? ఈ సంజ్ఞ నేను కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో చూశాను. సందర్భాన్ని బట్టి ఏదో నిరసన సంకేతం అయుంటుంది అని ఊహించా.

  6. “దేశకాలమాన పరిస్థితుల ద్రుష్ట్యా” అంటే న ఉద్దేశ్యం అయాప్రాంతాలకు,సమాజాలకు చెందిన అంశాలని. ఉదా:యం.ఫం.హుస్సైన్ గారు గొప్ప చిత్రకారుడు కానీ,హిందు దేవతల,భరత మాత నగ్నచిత్రాలు గీసి విమర్శల పాలవ్వలేదా!

వ్యాఖ్యానించండి