రెండు నివేదికలు -కార్టూన్


కార్టూనిస్టు శ్రీధర్ ని తెలియనివారు తెలుగు దేశంలో ఎవరైనా ఉంటారా అన్నది అనుమానమే. నాకైతే ఈనాడు పత్రిక తెలిసినప్పటి నుండీ ఆయన తెలుసు. సాదాసీదా మాటల్లో రాష్ట్ర, జాతీయ నాయకులకు చురకలు అంటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కార్టూన్ లలో ఇది ఒకటి.

నివేదికలు ఇచ్చే హక్కు, పరిజ్ఞానం ఒక్క ప్రభుత్వాలకు మాత్రమే సొంతమైన హక్కు కాదు. అది ప్రజలు కూడా చేయగలరు. కాకపోతే ప్రజల తరపున ఒక ఆర్.కె.లక్ష్మణ్, ఒక శ్రీధర్… ఇలాంటివారు నివేదికలు తయారు చేస్తారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఉత్పత్తి చేసిన మేధావి గారి నివేదిక అయితేనేం, సామాన్యుడి అనుభవంతో ఇచ్చే నివేదిక ముందు దిగదుడుపే. ఈ కార్టూన్ చెబుతోంది అదే.

ఈనాడు నుండి

ఈనాడు నుండి

వ్యాఖ్యానించండి