ట్వింకిల్… ట్వింకిల్… విని (చూసి) తీరాలి!


ట్వింకిల్… ట్వింకిల్… లిటిల్ స్టార్… ఈ పాటని తమ పిల్లల నోట విని సంతోషించని వారు ఎవరూ ఉండరు. పాట పల్లవి వినడమే తప్ప పూర్తిగా విన్నది ఎప్పుడూ లేదు. ఈ బుజ్జి పాప నోట, తన బుగ్గలు, కళ్లల్లో నుండి అనంత కోటి ట్వింకిల్స్ ప్రవహిస్తుండగా విని, చూసి మెచ్చని వారు ఉండరు. మీకు ఖచ్చితంగా బోర్ కొట్టదు. నాదీ హామి.

10 thoughts on “ట్వింకిల్… ట్వింకిల్… విని (చూసి) తీరాలి!

  1. ఎక్కడ దొరికిందండీ, మీకీ పాట? భలే ఉంది. పాట పాడుతున్న పాపాయి ఆ పాటకు తన హావభావాలతో కొత్తందాలు జోడించింది!

    ఈ పాటకు చరణాలు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది!

  2. వేణు గారు, యూ ట్యూబ్ లో యాదృచ్ఛికంగా చూశానీ పాటని. చరణాలున్నాయని తెలియంది నాకే అనుకున్నాను. ఇంకా ఉన్నారన్నమాట!

  3. రాజకీయ అంశాల చర్చతో సీరియస్ గా ఉండే మీ బ్లాగ్ లో ఆటవిడుపుగా వచ్చిన….ఈ ట్వింకిల్ ట్వింకిల్ చాలా అద్భుతంగా ఉంది శేఖర్ గారు.
    ఈ రైమ్ గతంలో చాలా సార్లు విని ఉన్నా….ఆ పాప పాడే విధానం ఇంకేదో కొత్త దనాన్నిచ్చింది.

    అన్నట్లు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ ఎక్కడో ఆకాశంలో లేవు….ఆ పాప కళ్లల్లో నాకు కనిపించాయంటే మీరు నమ్ముతారా….?

    ఇక ఇప్పటిదాకా నేను మీ బ్లాగు అభిమానిని… ఈ పోస్ట్ తర్వాత మా బాబు కూడా మీ బ్లాగు అభిమానిగా మారాడండీ. నిన్న ఈ రైమ్ తో పాటూ…. తర్వాత లింక్ గా వచ్చిన ఏబీసీ రైమ్ లు అనేకం చూపించక తప్పలేదు. ఇవాళ పొద్దున లేస్తూనే మా చెగువేరా ( మా బాబు పేరు) మళ్లీ ఈ రైమ్స్ కోసం ఒకటే గోల.

    మంచి రైమ్స్ అందించినందుకు మా చిన్నారి చే తరపున మీకు ధన్యవాదాలు.

  4. చందుతులసి గారూ, మీ బాబు వయసెంతో చెప్పారు కాదు! బహుశా ఏ కె.జి యో అయ్యుంటుంది.

    తెలుగువార్తల బ్లాగ్ కి కె.జి పిల్లల అభిమానులు ఉన్నందుకు సంతోషం.

    ఔను, ఆ పాపే రైమ్ కి సగం అందాన్ని, వినసొంపునీ తెచ్చింది.

వ్యాఖ్యానించండి