అద్వానీ కష్టే మోడి ఫలి! -కార్టూన్


‘కష్టే ఫలి’ అంటారు అద్వానీ లాంటి పెద్దలు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని కూడా చెబుతారు. భాజపా సీనియర్ నాయకుడు, భీష్మ పితామహుడుగా కొనియాడబడే లాల్ కృష్ణ అద్వానీ ‘ప్రధాని పదవి’ అనే ఫలితం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూశారు. దానికోసం తీవ్రంగా శ్రమించారు. శిలాన్యాస్ కోసం ప్రతి ఊరి నుండి ఇటుక తెచ్చినట్లుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు.

రధ యాత్రలు చేశారు, మత కల్లోలలాను సృష్టించారు. 2 నుంది 80 సీట్లకు పార్టీ బలాన్ని పెంచారు. ‘ఔర్ ఏక్ ఢక్కా మారో’ అని కరసేవకులను దగ్గరుండి ప్రోత్సహించారు. 180 సీట్లకు బలం పెంచి పార్టీకి అధికారాన్ని అందించారు. లిబర్ హాన్ కమిషన్ ముందు అసలు నేను మసీదు దగ్గరే లేను అని అబద్ధం కూడా ఆడారు.

మోడరేటర్ ఇమేజి కోసం లాహోర్ వెళ్ళి జిన్నాను సెక్యులరిస్టుగా పొగిడి ఆర్.ఎస్.ఎస్ చేత చీవాట్లు తిన్నారు. మాట అడ్డం విసిరి మోడీని పదవీ గండం నుండి కాపాడారు. జన సంఘ్ నుండి భాజపా వరకూ పునాది రాళ్ళు వేశారు. దశాబ్దాల తరబడి పార్లమెంటులో ఉపన్యాసాలు దంచారు.

ఇంత చేసిన అద్వానీ చివరికి తన కలల పదవిని అందుకోలేకపోతున్నారు. తన కష్టాన్ని మోడి తన్నుకుపోబోతుంటే అలిగి కాగితం రాసిపారేసినా, ఆర్.ఎస్.ఎస్ హుకుంతో వెనక్కి తగ్గక తప్పలేదు. రెండు రోజుల అలక పాన్పు కూడా ఆయనకి ఏమీ సాధించిపెట్టలేదు. నూతన పరిస్ధితులకు తల ఒగ్గాలి అని మోహన్ భగవత్ ఫోన్లో చెప్పగానే సైనికుడిలాగానే తల వంచారు. కానీ ఆ తల వొంపుకు ఫలితం లేకపోగా ప్రధాని పదవికి అభ్యర్ధిగా మోడి పేరు ఖాయం అయిన పరిస్ధితే కనిపిస్తోంది.

ఇప్పుడు అద్వానీ లాంటి పెద్దలు అనేమాట ‘స్వ కష్టే పర ఫలే’ అని కావచ్చు!

ఫేస్ బుక్ నుండి

ఫేస్ బుక్ నుండి

One thought on “అద్వానీ కష్టే మోడి ఫలి! -కార్టూన్

వ్యాఖ్యానించండి