గాలి బుడగ జీవితం, ఓటి పడవ జాతకం


“జీవితం బుద్భుద ప్రాయం” అని చెప్పనివారిదే పాపం అన్నట్లుగా ఎందరో చెప్పి పోయారు. కానీ అవేవీ పొట్ట తిప్పలని అరికట్టలేక పోయాయి. పైగా యుద్ధ బీభత్సాలు, సంక్షుభిత ఆర్ధిక వ్యవస్ధల పుణ్యాన ‘కూటి కోసం కోటి కోట్ల… తిప్పలు’ అన్నట్లుగా మారింది పరిస్ధితి. మనిషి కష్టాలు మరింత పెరుగుతున్నాయే గాని తరుగుతున్న పరిస్ధితి లేదు. డెయిలీ లైఫ్ శీర్షికన వివిధ దేశాల నుండి సేకరించి ‘బోస్టన్ గ్లోబ్’ అందించిన ఫొటోలివి. అలవి మాలిన మనిషి కష్టాలతో పాటు చిన్న చిన్న ఆనందాలను, చిన్నా, పెద్దా సంబరాలను కూడా ఈ ఫోటోలు పట్టిస్తున్నాయి.

వ్యాఖ్యానించండి