–
–
“అబ్బే తేడాలేమీ లేవు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం!”
“మళ్ళీ మీ పనిలోకి దిగిపోయారా? రాజకీయాలను క్రీడలతో కలపొద్దు చెబుతున్నా!”
కాంగ్రెస్ అధ్యక్షురాలు, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల మధ్య విభేదాలు తలెత్తాయని మళ్ళీ పత్రికలు గుస గుసలు మొదలు పెట్టాయి. అవినీతి ఆరోపణలతో పవన్ కుమార్ బన్సాల్, బొగ్గు కుంభకోణంలో విచారణ చేస్తున్న సి.బి.ఐ విధుల్లో జోక్యం చేసుకున్నందుకు సుప్రీం కోర్టు చేత అభిశంసనకు గురయినందుకు అశ్వనీ కుమార్ ల చేత రాజీనామా చేయించిన దగ్గర్నుండి ఈ గుస గుసలు గొంతు పెంచాయి. ఎంతగా గొంతు పెంచాయంటే, జపాన్, ధాయిలాండ్ ల పర్యటనను ముగించుకుని ఇండియాకి తిరుగుముఖం పట్టిన ప్రధాని విమానంలోనే ‘మా మధ్య విభేదాలు లేవు’ అని వివరణ ఇచ్చేంతగా.
తమ మధ్య విభేదాలేవీ లేవనీ, వాస్తవానికి ప్రతి పనీ సోనియాకి చెప్పే చేస్తున్నానని ప్రకటించిన ప్రధాని అసలు గుట్టు కాస్తా విప్పేశారు. దేశంలో అత్యున్నత పదవిలో కూర్చొని సోనియాకి చెప్పి చేయడం ఏమిటన్న అనుమానం జనానికి, పత్రికలకు వస్తుందన్న తెలివిడి లేకుండానే ఇలాంటి వివరణ ఆయన ఇస్తారా? ఒక పక్క స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం, మరొక పక్క బి.సి.సి.ఐ బోర్డు నిండా కొలువు తీరిన రాజకీయ ప్రముఖులు, ఇంకో పక్క క్రికెట్ నుండి రాజకీయాలను తొలగించాలంటూ ఒకరో ఇద్దరో ఇస్తున్న బలహీన పిలుపులు అన్నీ కలిపి కొద్ది పాటి గీతల్లో కార్టూనిస్టు తెచ్చిన ప్రస్తావన అమోఘం!

ayana vibedhalu levu ante ikkada evaru nammaru aina oka aardhikavetta ki politician ga cheyyabadda vyakti ki undedi vibhedhaale …………..