రెండో భాగం తరువాయి…………..
సాగరికా ఘోష్: మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి మీరు ఇష్టపడతారా? ఎందుకంటే కబీర్ సుమన్ తో పాటు మీ పేరు కూడా వారు (మావోయిస్టులు) మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదించారు. అయితే మీరు తిరస్కరించారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు కదా?
అరుంధతీ రాయ్: నేను నాకే భయపడుతున్నాను. అలాంటి నిపుణుతలు నాకు లేవు. నాపైన నాకు నమ్మకం లేదు. మీరు బాస్కెట్ బాల్ ఆటగాళ్లయితే మీరు ఈతగాళ్ళు కాలేరు (అనలేము) కదా? ఆ విషయంలో బాగా పని చేసేవారు కొందరు ఉంటారు, కానీ వారిలో నేను ఒకరినని నేను అనుకోవడం లేదు. కానీ మనం ఒక ప్రశ్న అడగాలని నేను భావిస్తున్నాను. అదేమిటంటే, మనం మావోయిస్టు అని అంటున్నపుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నాము? ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ ఎవరిని లక్ష్యంగా చేయాలనుకుంటోంది? ఎందుకంటే, ఇదిగో… ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు, అదిగో… అక్కడ గిరిజనులు ఉన్నారు, అనే ప్రత్యేకమైన విభజన చేస్తున్నారు. మరో పక్క చూస్తే మావోయిస్టులు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని కొందరు చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏదీ నిజం కాదు. నిజం ఏమిటంటే 99 శాతం మంది మావోయిస్టులు గిరిజనులే. కానీ గిరిజనులంతా మావోయిస్టులు కాదు. అయినప్పటికీ వారి సంఖ్య పదుల వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా తమను తాము అధికారికంగానే మావోయిస్టులం అని చెబుతారు. వారిలో 90,000 మంది మహిళా సంఘాలకు చెందినవారు. ఒక 10,000 మంది వరకూ సాంస్కృతిక సంఘాలకు చెందినవారు. కాబట్టి వారందరినీ తుడిచిపెట్టేస్తారా?
ఎస్.జి: హోమ్ మంత్రి పి.చిదంబరం (ఇప్పుడు మాజీ) కు మీరు ఏమని సందేశం ఇస్తారు? ఏ తరహా సందేశాన్ని మీరు ఆయనకు ఇవ్వదలుచుకున్నారు? ఆయన తన అహం కోసం ఈ యుద్ధం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా?
ఎ.ఆర్: ఆయన తాను సేవ చేయదలుచుకున్న కార్పొరేట్ కంపెనీల కోసం -ఎన్రాన్ నుండి వేదాంత వరకు తాను ప్రాతినిధ్యం వహించిన అన్ని కంపెనీలు- ఒక ఊహా చిత్రాన్ని (ఏర్పాటు చేసుకుని) దానికోసం యుద్ధం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆయన తప్పనిసరిగా అవినీతిపరుడే అయ్యుంటాడని నేను ఆరోపించడం లేదు. కానీ ఈ దేశాన్ని అత్యంత తీవ్ర పరిస్ధితిలోకి నెడుతున్న ఒక ఊహా ప్రపంచాన్ని ఆయన కలిగి ఉన్నాడని నేను ఆరోపిస్తున్నాను. అది మనందరిని విపత్కర పరిస్ధితిలోకి తీసుకెళ్తోంది.
ఎస్.జి: మీపైన మోపబడిని కేసు గురించి మీరు చింతిస్తున్నారా? ఛత్తీస్ ఘర్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద మీపైన ఒక ఫిర్యాదు నమోదయింది. మీ ఆర్టికల్ తర్వాత మీరు మావోయిస్టులకు మద్దతు ఇస్తున్న విషయం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజ్యం ప్రాసిక్యూషన్ పట్ల చింతిస్తున్నారా?
ఎ.ఆర్: ఖచ్చితంగా. చింత లేనట్లు చెబితే నేను వాగాడంబరిని అవుతాను. కాను వారు వెంటపడినవారిలో నేను మొదటి వ్యక్తిని కాను. జనానికి ఒక హెచ్చరిక పంపాలని వారు ప్రయత్నిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారీ యుద్ధాన్ని తీవ్రం చేయాలనుకుంటున్నారని నా భావన. ఈ దేశపు అత్యంత పేద ప్రజలపైనా డ్రోన్ దాడులను మనం చూడబోతున్నాం. అంతేకాకుండా యుద్ధ క్షేత్రాన్ని అష్టదిగ్బంధనం చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరైనా కలిగి ఉన్నట్లయితే వాటిని వ్యక్తం చేయొద్దని హెచ్చరించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
ఎస్.జి: మీ రచనలు వివాదాస్పదం. అలా ఎందుకయ్యాయని మీరు భావిస్తున్నారు? అరుంధతీ రాయ్ ని ద్వేషించడానికి ఇండియా ఎందుకు ఇష్టపడుతోంది? మిమ్మల్ని లక్ష్యం చేసుకుని అంత విద్వేషపూరితమైన మెయిల్ ఎందుకు వస్తున్నట్లు? ప్రజలు అంగీకరించిన విషయాలను మీరు చెబుతారని జనం ఎందుకు అనుకుంటున్నారు? ఇండియా ద్వేషించడానికి ఇష్టపడే రచయితగా ఎందుకున్నారు?
ఎ.ఆర్: ఇండియాకు మీరు మాత్రమే ప్రతినిధులని మిమ్మల్ని మీరు భావించుకోవడం అతి అహంకారం అని నా భావన. సరిగ్గా దానికి విరుద్ధంగా ఉందని చెబుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆనందగా దగ్గరికి తీసుకునేవారే, అది ఒరిస్సా కానివ్వండి, నర్మదా కానివ్వండి. కానీ నేను ఏ ఘోరాల గురించయితే రాస్తున్నానో వాటిల్లో భాగస్వామ్యం ఉన్నవాళ్ళే నన్ను ద్వేషిస్తున్నారు. వారి భాగం దక్కదని వారు బెదురుతున్నారు. కానీ దేశం మొత్తం నన్ను ద్వేషిస్తోందని నేను అనుకునేపనయితే నేనేదో భయంకరమైన తప్పు చేస్తున్నట్లే అర్ధం. ఒక రాజకీయ రచయితగా అలాంటిది చేయడానికి నేను పిచ్చిదాన్ని అయుండాలి. కానీ నిజం ఏమిటంటే, అత్యంత గాఢంగా నేను ప్రేమించబడుతున్నానని నేను భావిస్తున్నాను. అసలు విషయం అదే.
ఎస్.జి: కానీ సమస్య ఒకటి ఉందని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం, మీడియా, మేధావులను టార్గెట్ చేసుకుంటున్న ఆధిపత్య సంస్కృతి… ఇవన్నీ మానవహక్కుల కార్యకర్తల లాంటివారిని టార్గెట్ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? ఇది ప్రమాదకరమా?
ఎ.ఆర్: మరి ప్రమాదం కాకేముంది? కోబాడ్ గాంధీ పైన నేరారోపణ చేయడంలో దంతెవాడ ఢిల్లీకి వచ్చినట్లయిందని నేనొక ఆర్టికల్ చదివాను. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్… సంస్ధలన్నీ (మావోయిస్టులకు) ఫ్రంట్ ఆర్గనైజేషన్లని చెబుతున్నారు.
భిన్నమైన అభిప్రాయం ఎవరు వ్యక్తం చేసినా వారు మావోయిస్టులే అనే ఉన్మత్త ఆరోపణల తరహా అవరోధాలను నిర్మిస్తున్నారు. ఎవరో కూడా తెలియని వందలాది మందిని తెచ్చి జైళ్ళలో కుక్కుతున్నారు. కార్పొరేట్ దాడికి గురికాని ఉద్యమం అంటూ ఏదీ లేదిక్కడ. అడవుల బైట కొనసాగుతున్న అహింసా ఉద్యమాల దగ్గర్నుండి అడవులలోపల జరుగుతున్న సాయుధ పోరాటం వరకూ అన్నీ వాస్తవంలో కార్పొరేట్ దాడులకు గురవుతున్నవే. ప్రపంచంలో మరే ఇతర చోటా ఇలాంటిది జరగలేదని నేను చెప్పగలను.
ఎస్.జి: ఒక ప్రేక్షకుడు రాసిన ప్రశ్నను మిమ్మల్ని అడుగుతాను. “ఒక 16 యేళ్ళ వ్యక్తి తుపాకితో కనపడితే దానిని చూసి నేను చాలా ఆందోళనతో దుఃఖిస్తాను. 16 యేళ్ళ వ్యక్తి చేతిలో తుపాకిని చూసి అరుంధతీ రాయ్ ఎందుకని సంబరం చేసుకుంటుంది? ఆమె చాలా అందంగా ఉందని, ఆమెకు సమ్మోహనమైన నవ్వు ఉందని అరుంధతీ రాయ్ ఎలా చెబుతుంది?”
ఎ.ఆర్: ఎందుకంటే, ఒక 16 యేళ్ళ వ్యక్తి సి.ఆర్.పి.ఎఫ్ మనిషి చేతిలో అత్యాచారానికి గురయితే, తన గ్రామం మొత్తం తగలబడడాన్ని ఆమె చూసినట్లయితే, తన తల్లిదండ్రులు చంపబడుతున్నా చూస్తూ లొంగి ఉన్నట్లయితే నేను ఆమెను చూసి చాలా దుఃఖిస్తాను. ఎవరైనా ఒకరు లేచి నిలబడి ‘నేను దీనిపై పోరాడతాను’ అని నడుం బిగిస్తే నేను భయ విహ్వలనవుతాను. అలాంటి పరిస్ధితి రావడం నిజంగా భయంకరమైన సంగతి. కానీ తాను నిర్మూలించబడడాన్ని అంగీకరించడం కంటే అదే (తుపాకి పట్టడమే) మంచిది.
ఎస్.జి: మీ సహచర ఆలోచనాపరులు, కార్యకర్తలపై ఎక్కుపెట్టబడిన కొన్ని విమర్శలను మీకు చదివి వినిపిస్తాను. “అధికారం కోసం జరుపుతున్న వారి మొండి వెతుకులాటను అడవుల్లో నివసించేవారి న్యాయబద్ధమైన డిమాండ్లు, హక్కులు, ఆందోళనలతో ఆమె సమానం చేస్తుంది. జార్జి డబ్ల్యూ. బుష్ ని ఆమెయే అపహాస్యం చేసిన ద్వంద్వ తర్కానికి (binary logic) ఆమె నూతన అర్ధాన్ని ఇస్తుంది. ఇప్పటి క్షణంలో ఆమె స్టాక్ హోమ్ సిండ్రోమ్ బాధితురాలు. మరో వాడుక ఏమిటంటే ఆమెను (మావోయిస్టులలో) ఒదగబడిన జర్నలిస్టు (embedded journalist) అని చెప్పవచ్చు.” ఈ విమర్శకు మీరు ఎలా స్పందిస్తారు?
ఎ.ఆర్: ఒదిగిపోవడం అనేది దానికదే చెడ్డ విషయం ఏమీ కాదని నా భావన. మీరు ఎవరితో ఒదగబడ్డారు అనే విషయంపైన ఆధారపడి ఉంటుంది. మీరు మీడియాతో ఒదగబడ్డారా లేక కార్పొరేట్ లతోనా? లేక దీనిని ప్రతిఘటిస్తున్నామని తమను తాము భావించుకుంటున్న పక్షంలో ఒదగబడ్డారా? ఇక్కడ నేను మావోయిస్టుల గురించి ప్రస్తావించడం లేదు. మావోయిస్టులు ఎవరు? మావోయిస్టు సిద్ధాంతవేత్తలు – వారి పోరాట శక్తిగా ఉన్న జనానికి భారత రాజ్యం అంటేనే ఏమిటో తెలియని పరిస్ధితుల్లో, వాళ్ళ లక్ష్యం భారత రాజ్యాన్ని కూలద్రోయడమని మనం చెబుతున్నాం. కానీ ఖచ్చితంగా వారి లక్ష్యాలు, ఉద్యమాలకు ఒక యాదృచ్చికత ఉన్నది; వారు ఒకరినొకరు ఉపయోగపెట్టుకుంటున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, భారత రాజ్యాన్ని కూలదోయాలని అనుకుంటున్నది మావోయిస్టులు ఒక్కరే కాదు; హిందూత్వ ప్రాజెక్టు చేత, కార్పొరేట్ ప్రాజెక్టు చేత భారత రాజ్యం ఇప్పటికే కూలదోయబడింది.
ఎస్.జి: కాబట్టి రాజ్యంగం ఉనికిలో లేకుండా పోయిందని మీరు నమ్ముతున్నారు?
ఎ.ఆర్: అది లోతుగా బలహీనం చేయబడిందని నేను నమ్ముతున్నాను.
సాగరికా ఘోష్: ఇండియా వదిలిపెట్టి ఇంకెక్కడికయినా వెళ్ళి నివసించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
అరుంధతి రాయ్: ఖచ్చితంగా లేదు. నావరకు అది ఒక సవాలు, ఒక సౌందర్యం, అదొక అద్భుతం, ఎందుకంటే ప్రపంచంలోకెల్లా అత్యంత కష్టభూయిష్టమైన భారతదేశ పోరాటాన్ని ఈ దేశ ప్రజలు నిర్వహిస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది చూస్తే నాకు నిజంగా వారికి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. నేను ఇక్కడికి చెందినదానిని. సి.ఎస్.పి.ఎ (ఛత్తీస్ ఘర్ స్పెషల్ పవర్స్ యాక్ట్) నన్ను జైల్లో పెట్టాలని కోరుకున్నా సరే, నేనేమీ స్విట్జర్లాండ్ లో నివసించబోవడం లేదు.
…. అయిపోయింది.
ఈ ఆర్టికల్ మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రెండో భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రపంచంలోకెల్లా అత్యంత కష్టభూయిష్టమైన భారతదేశ పోరాటాన్ని ఈ దేశ ప్రజలు నిర్వహిస్తున్నారు. evri meda poradutunnaru evari meda poraadamantunnaru?????????
arundati roy rachana shaili chala adbuthangaaa vuntundhi ….