మోడి నోరు తెరవరేమి? -కార్టూన్


The Hindu

The Hindu

“కొద్దిగా మార్పులు చేసి వాటిని మీరు ఉపయోగించొచ్చు కదా!”

ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో దాదాపు అందరూ ఏదో ఒక మాట అనేశారు. భావి ప్రధాని కావాలని ఆశిస్తున్న మోడి మాత్రం ఎందుకో ఇంకా నోరు తెరవలేదు!

మోడి అటెన్షన్ కోరడానికి కారణం ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యుడు కావడమే. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యులే. అవడానికి క్రికెట్ ఆట బోర్డే అయినా దాని నిండా రాజకీయ నాయకులే ఉండడం విశేషం.

మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్న అరుణ్ జైట్లీ బి.సి.సి.ఐ కి ఉపాధ్యక్షుడు. శ్రీనివాసన్ పదవీ కాలం ముగిశాక ఆ స్ధానం ఆక్రమించాలని అరుణ్ జైట్లీ ఆడపడుతున్నారని పత్రికలు ఘోషిస్తున్నాయి. ఈ కారణం వల్లనే మాట్లాడవలసినవారు మాట్లాడడం లేదని బి.జె.పి నాయకుడే అయిన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఆరోపించారు. ఆయన టార్గెట్ అరుణ్ జైట్లీయే అని ఒకటి రెండు పత్రికలు ఊహించాయి.

శ్రీనివాసన్ చేతిలో 10 నుండి 15 వరకు ఓట్లు ఉన్నాయనట. తదుపరి అధ్యక్ష పదవి కోరుకుంటున్నవారికి ఈ ఓట్లు కావాలి. శ్రీనివాసన్ రాజీనామాను కోరితే ఈ ఓట్లు దక్కవాని భయపడుతున్నారని అందుకే గాంధీగారి మూడు కోతుల్లా బోర్డు పెద్దలు వ్యవహరిస్తున్నారని కీర్తి ఆజాద్ ఆరోపణ.

బహుశా ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అరుణ్ జైట్లీకి బి.సి.సి.ఐ అధ్యక్ష పదవిని కానుకగా మోడి ఇవ్వదలిచారా? అందుకే మౌనమా?

కాంగ్రెస్ నాయకులు చిన్న తప్పు చేసినా ‘దిగిపో, వెళ్లిపో, పో’ అని బి.జె.పి నాయకులు యాగీ చేస్తారు. బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహించి మన్మోహన్ రాజీనామా చేయాలని బి.జె.పి నాయకులు శతధా పోరుతున్నారు. బి.జె.పి నాయకులు బి.సి.సి.ఐ అవినీతి విషయంలో ఎందుకు నోరు తెరవడం లేదని కార్టూనిస్టు ప్రశ్నిస్తున్నట్లుంది.

ఇంతకీ ఆ మోడి పక్కన కూర్చున్నది ఎవరు చెప్మా?

2 thoughts on “మోడి నోరు తెరవరేమి? -కార్టూన్

వ్యాఖ్యానించండి