ఐ.పి.ఎల్ కుంభకోణం గురించి పత్రికల్లో కార్టూన్ల వరద పారుతోంది. జెంటిల్మెన్ గేమ్ గా గొప్పలు చెప్పుకున్న గేమ్ కాస్తా రెంటల్మెన్ గేమ్ గా మారిపోయిందని కార్టూనిస్టు నవరే శ్రేయాస్ వినూత్న రీతిలో స్పష్టం చేస్తున్నారు.
ఐ.పి.ఎల్ లో పాత్రధారులైన వివిధ సెక్షన్లకు కుంభకోణం దరిమిలా అది ఒక్కో కంటికి ఎలా కనిపిస్తోందో కార్టూనిస్టు విశ్లేషించారు. ఒక్కోక్కరికి ఒక్కో విధంగా కళ్ళు మూసుకుపోయాయని కూడా ఈ కార్టూన్ కి అర్ధం తీసుకోవచ్చు.
ఆటగాళ్లకు డబ్బు తప్ప ఆట కనిపించడం లేదు. ఫ్రాంచైజీ ఓనర్లకైతే డబ్బు రాశులే. బి.సి.సి.ఐకి డబ్బు భక్తి పారవశ్యంతో నిద్ర పట్టేసింది. ఢిల్లీ పోలీసులకి చుక్కలు కనిపిస్తున్నాయి. మీడియాకి టి.ఆర్.పి రేటింగులు పైపైకి దూసుకుపోతున్నాయి. బుకీస్ ల సంగతి చెప్పపన్లేదు. ఇక క్రికెట్ అభిమానులకి కంటి నిండా ప్రశ్నలు, అనుమానాలే. ఏం జరుగుతోందో అర్ధం కాని అయోమయంలో అభిమాన జనం, పాపం ఆటను ఆస్వాదించలేకపోతున్నారు.
ఈ కార్టూన్ లో నైతే బి.సి.సి.ఐ, డబ్బు కట్టలనే ఈకలుగా ధరించి ఉష్ట్రపక్షిలా మారిపోయింది. ఉష్ట్రపక్షి ఇసుకలో తలదూర్చి తనను ఎవరూ చూడలేదని భావిస్తోంది. ఏం జరిగినా తనకు అనవసరం అని భావిస్తోంది.
ఈ రెండు కార్టూన్స్ హిందూస్ధాన్ టైమ్స్ నుండి సేకరించినవి.

