హిమాంషు కుమార్ గాంధీయన్ కార్యకర్త. మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు భావించే దంతెవాడ జిల్లాలో ‘వనవాసి చేతన్ ఆశ్రమ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధను 22 సంవత్సరాల పాటు తన భార్యతో కలిసి నిర్వహించారాయన. స్ధానిక ఆదివాసీల భాష ‘గోండి’ నేర్చుకుని చట్టబద్ధంగా ఆదివాసీలకు హక్కులు దక్కేలా చేయడానికి ఆశ్రమ్ ద్వారా ప్రయత్నించారు. 2005 మొదలుకుని ఆదివాసీలకు వ్యతిరేకంగా సల్వాజుడుం పేరుతో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్.పి.ఓ) నిర్వహించిన దారుణ హంతక దాడులతో కకావికలై అడవి వదిలి వెళ్ళిపోయిన గిరిజనులను తిరిగి వారి వారి గ్రామాలకు రప్పించడానికి ప్రయత్నించారు. తప్పుడు కేసులు ఎదుర్కొంటూ జైళ్ళలో ఉన్న గిరిజనులను బైటికి రప్పించడానికి, పోలీసులు, సల్వాజుడుం సంస్ధల వల్ల బాధితులైన గిరిజనులకు న్యాయం దక్కించడానికి ప్రయత్నించారు.
కానీ పోలీసులకు హిమాంషు అహింసా పద్ధతులు కూడా నచ్చలేదు. దంతెవాడ నుండి ఆయన్ని తరిమివేయడానికి చేయాల్సిన పనులన్నీ చేశారు. రెవిన్యూ, పోలీసు యంత్రాంగం అంతా కట్టగట్టుకుని ఆయన ఆశ్రమాన్ని బుల్ డోజర్లతో కూల్చివేశాక చెట్టు కింద ఆశ్రమాన్ని నడపడానికి కూడా ప్రయత్నించారు. చివరికి ప్రాణ భయంతో అక్కడి నుండి ఆశ్రమాన్ని ఎత్తివేసి ఢిల్లీకి మారేంతవరకూ ప్రభుత్వ యంత్రాంగం శాంతించలేదు. హిమాంషు కుమార్ ను జస్టిన్ పొదుర్ ఫిబ్రవరి 2013లో ఇంటర్వ్యూ చేశారు. దంతెవాడలోని తన అనుభవాలను హిమాంషు ఇంటర్వ్యూలో వివరించారు. దేశ సంపదలను ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడానికి కృతనిశ్చయంతో ఉన్న పాలకుల ముందు వారు నల్లవారైనా, తెల్లవారైనా గాంధీయిజం పనికిరాదని ఆయన తెలుసుకోవలసి వచ్చింది. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్య భాగాలు:
—*—
జస్టిన్ పొదుర్ (జె.పి): నేను మొదట ఇక్కడికి వచ్చినపుడు బహుశా ఈ పాటికి మీరు జైలులో ఉంటారని అనుకున్నాను. ఆ కధతో మొదలు పెడితే బాగుంటుందేమో?
హిమాంషు కుమార్ (హెచ్.కె): ఇంకో కధతో నన్ను మొదలుపెట్టనివ్వండి. ఇటీవలి కధే. 2006లో నలుగురు అమ్మాయిలను సల్వాజుడుం నాయకులుగా చెలామణి అవుతున్న ఎస్.పి.ఓ లు అత్యాచారం చేశారు. ఆ అమ్మాయిలను మా ఆశ్రమానికి, మా న్యాయ సహాయ కేంద్రానికి గ్రామానికి చెందిన ఒక యువకుడు తీసుకువచ్చాడు. దంతెవాడలోని పోలీసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ (ఫిర్యాదు) నమోదు చేయడానికి మేము ప్రయత్నించాము. కానీ నేరస్ధులు ఎస్.పి.ఓలు కావడంతో ఆ ఫిర్యాదు ఎప్పటికీ నమోదు కాలేదు. వారి దరఖాస్తును సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి) వద్దకు తీసుకెళ్లాము. ఆయన అసలు బదులు ఇవ్వలేదు. ఆ తర్వాత కొంటా లోని జె.ఎం.ఎఫ్.సి కోర్టుకు వెళ్లాము. జడ్జి బాధితుల వాంగ్మూలాలను, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలను తీసుకుని అరెస్టు వారెంట్లు జారీ చేశాడు. కేసును దంతెవాడ సెషన్ కోర్టుకు బదిలీ చేశాడు.
ఇదిలా జరుగుతుండగానే నేను (అప్పటి) హోమ్ మంత్రి పి.చిదంబరంను కలిశాను. దంతెవాడ వచ్చి సల్వాజుడుం, ఎస్.పి.ఓల బాధితులను స్వయంగా కలవాలని నేను ఆయనని ఆహ్వానించాను. ఆయన స్వయంగా రావడం ముఖ్యమని, అలా జరిగితే రాజ్యం తమపట్ల శ్రద్ధగా ఉన్నదని ప్రజలు నమ్ముతారని ఆయనకు చెప్పాను. రావడం ద్వారా వ్యవస్ధ శ్రద్ధ తీసుకుంటోందన్న సందేశం ఇచ్చినవారవుతారని చెప్పాను. వివిధ డాక్యుమెంట్లు, అమ్మాయిల సాక్ష్యాలతో కూడిన ఒక సి.డి కూడా ఆయనకు ఇచ్చాను. తాను తప్పకుండా వస్తానని చిదంబరం హామీ ఇచ్చారు. కానీ ఎప్పటికీ రానేలేదు.
మూడు సంవత్సరాల తర్వాత డిసెంబర్ 19, 2009 తేదీన అత్యాచార బాధితులకు ఎటువంటి న్యాయము చెయ్యని పోలీసులు అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. సుక్మా జిల్లాలోని డోర్నగల్ పోలీసు స్టేషన్ లో 5 రోజుల పాటు వారిని ఉంచి విడుదల చేశారు. వారిని భ్యభ్రాంతులకు గురి చేశారు. హిమాంషుతో చెప్పడానికి మీకు ఎంత ధైర్యం అని వారు అమ్మాయిలను బెదిరించారు.
ఆ అయిదు రోజుల్లో నేను చిదంబరంను సంప్రదించాను. ‘ఇది నా సమస్య కాదు, అధికారులతో మాట్లాడండి’ అని ఆయన చెప్పేశారు. నేను (కేంద్ర) హోమ్ కార్యదర్శి జి.కె.పిళ్లైతో మాట్లాడాను; ఛత్తీస్ ఘర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) తో మాట్లాడాను; దంతెవాడ ఎస్.పితో మాట్లాడాను; దంతెవాడ కలెక్టర్ తో మాట్లాడాను. ఎవ్వరూ సహాయం చేయలేదు.
అమ్మాయిలు తిరిగి వచ్చాక వారు మాతో మాట్లాడడానికి నిరాకరించారు. వారు భయభ్రాంతులయ్యారు; కోపంతో ఉన్నారు. న్యాయం చేస్తామని వారికి గట్టిగా హామీ ఇచ్చాము. కానీ మేము ఘోరంగా విఫలం అయ్యాము. పైగా వారిని మరింత ప్రమాదంలోకి నెట్టాము. నాకిక వ్యవస్ధ పైన ఉన్న నమ్మకం అంతా పోయింది.
జె.పి: 2010లో మీరొక చర్చలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం గిరిజనుల కోసం పని చేసేలా చెయ్యడమే మీ కోరికగా ఆ సందర్భంగా చెప్పారు. గిరిజనుల కోసం పని చేయలేనట్లయితే భారత ప్రజాస్వామ్యానికి ఎటువంటి విలువా లేదని మీరు చెప్పారు. ఇలాంటి అనుభవాలు ఆ లక్ష్యం గురించి ఏమి చెబుతున్నాయి?
హెచ్.కె: ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, అది అత్యంత బలహీన పౌరుల కోసం కూడా పని చేయాలి. అలా పని చేయకపోతే అదిక ప్రజాస్వామ్యం కాదు.
జె.పి: కనుక, ప్రజాస్వామ్యం పని చేయకపోతే సాయుధ పోరాటాన్ని ఆశ్రయించడం అర్ధం చేసుకోదగ్గదేనా?
హెచ్.కె: నేను చెప్పడం ప్రారంభించాను, ‘ఇప్పుడు నాకు అర్ధం అవుతోంది’ అని. ఎందుకో నేనిప్పుడు చెప్పగలను. నేను హింసకు సానుభూతి చూపిస్తున్నానని అంటోంది. నేనేమన్నానంటే ‘లేదు, నేను సానుభూతి చూపడం లేదు’ అని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నా విశ్లేషణను ఇస్తున్నాను.
జె.పి: ఆదివాసీ అంత బలహీనంగా (vulnerable) ఉండడానికి కారణం చట్టం ప్రకారం తమకు ఏ హక్కులు ఉన్నాయో వారికి తెలియకపోవడమేనని కూడా 2010లో చెప్పారు. కానీ రాజ్యమే చట్టాలను పాటించనప్పుడు చట్టం గురించిన అవగాహన వల్ల ఫలితం ఏముంటుంది?
హెచ్.కె: 2005లో సల్వాజుడుం మొదలయ్యాక పరిస్ధితిలో తీవ్రమైన మార్పు వచ్చింది. అంతకుముందు రాజ్యం చట్టాన్ని పాటించేటట్టు చూసేలా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండింది. సల్వాజుడుం తర్వాత వనరులను కొల్లగొట్టడంలో అదొక ఆధునిక ప్రక్రియగా మారిపోయింది; పాలక వర్గాలకు అదే ప్రధమ కర్తవ్యంగా ముందుకు వచ్చింది; రాజ్యాంగ ప్రక్రియలు, చట్టాలు, ఒప్పందాలు అన్నింటినీ ఉల్లంఘించడం వారు ప్రారంభించారు; హింసాత్మక పద్ధతుల ద్వారా భూముల్ని లాక్కోవడం ప్రారంభించారు. చట్టబద్ధంగా ప్రజల హక్కులను వ్యాపింపజేస్తున్నామన్న మా అవగాహన అంతా అసందర్భం అయిపోయింది.
ఒక ఉదాహరణ చెబుతాను. అంతర్జాతీయ మానవ హక్కుల రోజు (డిసెంబర్ 10, 2009) నాడు మా ఆశ్రమ కార్యకర్తలో ఒకరైన కోపా కుంజంను అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ లో అతన్ని పట్టుకుని చావబాదుతున్నారు. ‘హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్’ కి చెందిన ఒక లాయర్, అల్బన్ టోపో, అతని వెంట ఇంటారాగేషన్ గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. గదిలో తానూ ఉంటానని టోపో చెప్పినపుడు పోలీసులు ఆయన్ని కూడా చావబాదారు. ఆ రోజు రాత్రంతా ఆయన్ని స్టేషన్ లోనే ఉంచారు. ఆ తర్వాత రోజు ఉదయం ‘రాత్రి కావడంతో, చిమ్మ చీకటిగా ఉండడంతో, తాను తన ఇష్టాపూర్వకంగానే పోలీసు స్టేషన్ లో రాత్రంతా గడిపానని’ ఆయన చెప్పినట్లుగా ఒక కాగితం పైన సంతకం తీసుకున్నారు. అనంతరం ఆయన వెళ్లిపోయాడు.
…………………….ఇంకా ఉంది.

తమ దారికి అడ్డొస్తే అహింసావాదులను సైతం ఏమాత్రం సహించరన్నమాట మన ప్రజాస్వామ్య పాలకులూ, అధికారులూ. హిమాంషు అనుభవాలు ఈ వ్యవస్థ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
అహింసావాదం అనేది ఒక పెద్ద అబద్దం. కానీ స్కూల్ పిల్లల మెదళ్ళలోకి దాన్నే indoctrinate చేస్తారు. చిన్నప్పుడు మా టీచర్ మాకు చెప్పేవాడు “ఒకడు నిన్ను బూతులు తిడితే వాణ్ణి నువ్వు కొడతావు కానీ ఎందుకు అలా తిట్టాడో ఆలోచించవు. అదే IAS అధికారిని అయితే అలా ఆలోచిస్తాడు” అని. బూతులు తిట్టినప్పుడు అలా ఆలోచిస్తూ నిలబడేవాడు ఎవడూ ఉండడు. IAS అధికారి కూడా మన లాంటి మనిషే కనుక అతను కూడా అలా ఉండడు. ఓర్పుసహనాల పేరుతో నాలుగు ఆచరణ సాధ్యం కాని నీతులని indoctrinate చెయ్యడానికి అలా అంటారు.
ahimsavaadam ante bootuulu tittichukovatam kaadu adi school lo pillalaki teacher lu nerpite vachedi kaadu ias la ki training lo nerpedi kaadu ahimsavadam nijamga pedda abaddame lekunte gandhi rajakeeya nayakudu ayyevadu ila jati pita ga enduku migilipotadu???????? aacharana saadyam kaani neetulani edo cheyataniki alaa antaru annaru aa ahimsa ane abaddame lekunte ilaa meeru nenu ee blogu llo comments raastu koorchogalamaa……………..?
ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవాడు నిజ జీవితంలో ఎవడున్నాడు? ఆచరణ సాధ్యం కాని నాలుగు నీతులు బోధించి అది బోధించినవాని తప్పు కాదని అంటే ఎలా?
asalu ikkada evaru evariki chempa choopistunnaru ainaa ahimsa ante chempalu choopatam kaadu chempalaki ahimsaki sambandham ento naaku teliyatlaa ahimsa ante chempalu choopatam ani kooda naku ippude telisindi …………… ahimsavadam ante chempalu choopatam ani meku evaru nerparu ?????????????? great thought …………
chempalu choopatalu kottinchkovatam ivannee school pillala maatalu .. …………. aataalu ………….
aacharana saadhyam kaakapote adi cheppina, paatinchina vyakti jaatipita ela ayyadu ???????????? jatipita kuda abaddamena??????????
ahimsa ante chempalu choopatam kottinchukovatam ani evaru cheppaaru sankar dada zindabad cinema lo emanna cheppara ????? gandhi evariki tana chempa kottamani choopinchala naku telisi budhudu kuda choopala chivaraki dalailama kuda alacheppala ee chempala sidhamtham enti???? evaru chepparu ???
paatichatam raaka pote vadileyaali adi asaadhyam abaddam ani elaa antaaru
abaddaalu cheppaka povatam neeti gaa undatam sadhyamainanta varaku maamsaaniki madhyaniki maguvalaki dooranga undantam brahmacharyam, daiva bhakthi ivaanni ahimsa siddantaalu .chempalu pagalakottu kovatam ento???? sankardada cheppadaa??????? evado edo simbolic ga raste danni pattukoni anta abaddam ante evaru emi cheyagalaru???
Gandhism is an old gramophone record. It cannot convince any one by repeat the same phrases again and again.