ఛత్తీస్ ఘర్ లో కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ పై మెరుపు దాడి చేసి సీనియర్ నాయకులు మహేంద్ర కర్మ, నంద కుమార్ పటేల్ లతో సహా 24 మందిని దారుణంగా చంపడం ద్వారా మావోయిస్టులు ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలు ఎదుర్కోనున్న విపరిణామాలతో సంబంధం లేకుండా బస్తర్ లో ఘర్షణను విస్తరించడానికి తమ సంసిద్ధతను చాటుకున్నారు. 2005లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతుతో స్ధానిక పోలీసులు ప్రారంభించిన హింసాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ‘సల్వా జుడుం’ ఉద్యమానికి బహిరంగ ముఖంగా మారిన (మహేంద్ర) కర్మ ఒక వివాదాస్పద వ్యక్తి. నిజానికి, ఈ ఉద్యమం పాల్పడిన దుర్మార్గాలకు ప్రబల సాక్ష్యాలు ఉండడంతో సుప్రీం కోర్టు జుడుమ్ ను రద్దు చేయాలని నొక్కి చెప్పింది. ఆయన హత్య ఊహించనిదేమీ కాదు; అందుకోసమే ఆయనకు Z-ప్లస్ భద్రతను ఇచ్చారు. కానీ అది (హత్య) భద్రతా బలగాల నుండి భారీ ప్రతిదాడికి పురిగొల్పే అవకాశం ఎప్పుడూ పొంచి ఉంది. మావోయిస్టు పోరాటకారులతో పాటు సామాన్య గ్రామీణుల పైన కూడా దాని పర్యవసానం ఉంటుంది. కర్మ వెంటపడడం ద్వారా మావోయిస్టులు తత్ఫలితంగా జరిగే కూంబింగ్ కార్యకలాపాలలో చిక్కుకుపోయే వారి పట్ల పట్టింపు లేదని చాటుకోవడమే కాకుండా, గతంలో చంద్రబాబు నాయుడు, బుద్ధ దేవ్ భట్టాచార్జీ లాంటి రాజకీయ నాయకుల పైన జరిపిన దాడుల నుండి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని చాటుకున్నారు. పాలక వ్యవస్ధలకు భద్రతా బలగాలపై దాడుల కంటే రాజకీయ నాయకులపై దాడులంటేనే ఎప్పుడూ ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాలలోనూ ఈ హత్యా ప్రయత్నాలే మావోయిస్టుల ముగింపుకు ఆరంభంగా నిలిచాయి.
సల్వా జుడుమ్ పై దాడిగా చూసినా లేదూ కాంగ్రెస్ లేదా కేంద్ర, రాష్ట్రాల సంయుక్త శక్తి పై దాడిగా చూసినా, తాజా హత్యలు ఛత్తీస్ ఘర్ లో పరిస్ధితిని మరింత క్షీణింపజేస్తాయి. ఆదివాసీ ప్రాంతాలలో శాంతి మరియు సమానతా అభివృద్ధిల కోసం పని చేస్తున్న ప్రజాస్వామిక శక్తులను శక్తివంతం చేయకపోగా శనివారం నాటి దాడిని రాజకీయ వ్యవస్ధలోని ఒక సెక్షన్, పారామిలట్రీ, పోలీసు బలగాల చేత మరింత (ప్రాణ)హానికరమైన ఆపరేషన్లు జరిపించడానికి అవకాశంగా ఉపయోగించుకుంటుంది. కేవలం ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్ధాయి ప్రతిస్పందన ఇవ్వకుండా సంయమనం పాటించాలి. అచ్చంగా మిలట్రీ ఆపరేషనే అయితే పరాయీకరణను తీవ్రం చేయడమే కాక ఇప్పటికే తగ్గిపోయిన గూఢచార సమాచార సేకరణను మరింతగా తగ్గిస్తుంది. నిజానికి, ఇప్పటివరకు వినియోగించిన డబ్బు, మానవ శక్తి యొక్క ప్రభావ శీలత పైన ఈ దాడి అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. బి.జె.పి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం -పాలక పార్టీ వికాస్ యాత్రల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది- మావోయిస్టు పార్టీ దాడికి ప్రతిపక్ష ర్యాలీయే ఎందుకు గురికావలసి వచ్చిందన్న అసౌకర్యమైన ప్రశ్నలను ఎదుర్కోక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా లేనట్లయితే, ఈ మెరుపు దాడి, ఈ ప్రాంతంలో హింస మరింత పెచ్చరిల్లడానికి దారితీయవచ్చు. హింస ఎల్లప్పుడూ శాంతి కోసం ప్రయత్నించేందుకు అందివచ్చిన అవకాశంగా వినియోగించబడాలి. కానీ మావోయిస్టులు, భద్రతా బలగాలు ఇరువురు వల్లా భయంలో జీవిస్తున్న నిస్సహాయ గ్రామీణుల పైన సాయుధ శక్తిని వినియోగించడానికి రాజ్యం దీనిని ఒక సాకుగా వినియోగించరాదు.
—*—
(నామాట: సంపాదకీయంలో కొన్ని అంశాలతో నాకు విభేదం ఉన్నా మొత్తంగా ఉపయోగకరం. మహేంద్ర కర్మ తన రాజకీయ అభ్యున్నతికి సొంత గిరిజనులనే బలి చేసిన స్వార్ధపరుడు. స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీల సొమ్ము తిని గిరిజనాల భూముల్లో దాగిన ఖనిజ వనరులను కంపెనీలకు అప్పజెప్పడానికి వీలుగా ‘సల్వా జుడుమ్’ పేరుతో అటవీ బిడ్డలను మూకుమ్మడిగా మైదానాలకు తరలించిన పాలకవర్గ సేవకుడు. ఎన్నడూ తగవుపడి ఎరుగని గిరిజనుల మధ్య కుత్తుకలు ఉత్తరించుకునే వైరాన్ని రగిలించిన కపట నీతిజ్ఞుడు. కానీ ఆయనను చంపడానికి మావోయిస్టులు ఎన్నుకున్న మార్గం పట్ల వారు పునరాలోచించుకోవాలి. కనీస ప్రజాస్వామిక ఉద్యమాలకు సైతం మావోయిస్టు ఉద్యమాలుగా ముద్ర వేసి అణచివేసేలా రాజ్య ప్రభువులకు అవకాశం కల్పిస్తున్న వారి వర్గశత్రు నిర్మూలన పంధాను సమీక్షించుకోవాలి. తయారుగా లేని అమాయక జనం పైకి విపరీత నిర్బంధం అమలు చేయించడానికి దారి తీస్తున్న వారి ఆచరణ నుండి గుణపాఠాలు ఎందుకు నేర్వడం లేదో అర్ధం కాని విషయం. విలువైన వారి త్యాగాలు వృధా పోరాదన్నది అశేష శ్రామిక ప్రజల ఆకాంక్ష.)
మహేంద్ర కర్మ హత్యని నేను పూర్తిగా సమర్థిస్తాను. గాంధీలాగ సత్యాగ్రహం చేస్తే పాలకులు భయపడే పరిస్థితి ఏ దేశంలోనూ లేదు. Revolution through the barrel of gunని నమ్ముకోవడం ఒక్కటే మార్గం. పాలక వర్గం విషయానికి వస్తే, వాళ్ళు అధికారం కోసం తమ సొంత వర్గానికి చెందినవాళ్ళనే హత్య చెయ్యగలరు. కాకతీయ విశ్వవిద్యాలయంలో మావోయిస్ట్‌లనే అనుమానంతో విద్యార్థులందరినీ వేధించారు. అలాగని మావోయిస్ట్‌లు తమ అనుబంధ విద్యార్థి సంఘాలని రద్దు చెయ్యలేదు కదా. “మనం ఒక్కణ్ణి చంపితే సామ్రాజ్యవాదులు అందుకు ప్రతిగా పది మందిని చంపుతారు. ఈ ప్రతికూల పరిస్థితిలో కూడా మనమే గెలుస్తాం” అని అన్న హోచిమిన్‌హ్ మాటలు గుర్తొస్తున్నాయి.
Pls see the below links of various versions on Chattisgarh incident for some more understanding. it will be useful and benifit for all of us. The truth will be always complex to take this or that positions as per our conginzence
Sorry for english comment.
A full stop to the Maoists
Kamal Davar, Hindustan Times
May 27, 2013
http://www.hindustantimes.com/News-Feed/ColumnsOthers/A-full-stop-to-the-Maoists/Article1-1066847.aspx
Evicting The Gandhians
Justin Podur Interviews Himanshu Kumar
03 May, 2013
http://www.countercurrents.org/podur0305 13.htm
Friend to foe Activist Himanshu Kumar remembers Mahendra Karma
by FP Staff May 27, 2013
http://www.firstpost.com/india/friend-to-foe-activist-himanshu-kumar-remembers-mahendra-karma-818021.html
Arundhati Roy terms Maoist attacks like Chhattisgarh as counter-violence
http://www.firstpost.com/india/arundhati-roy-terms-maoist-attacks-like-chhattisgarh-as-counter-violence-820173.html
Chhattisgarh attack Is there a lack of clarity on Maoist policy
http://www.ndtv.com/article/india/chhattisgarh-attack-is-there-a-lack-of-clarity-on-maoist-policy-372067
“The mighty Chhattisgarh falters, once again”
http://revolutionaryfrontlines.wordpress.com/2013/05/26/the-mighty-chhattisgarh-falters-once-again/
Chhattisgarh attack: 18th century weapon used for killing
http://www.firstpost.com/india/chhattisgarh-attack-18th-century-weapon-used-for-killing-820157.html
Now i am thinking deeply in line with Himanshu Kumar and Arundhathi Roy’s views in this episode.
One thing is right. This ravana kaashtam is not stopable until this system continue like this….
Read this post: http://politics.teluguwebmedia.in/2013/05/blog-post_1264.html
I will translate Roy’s and Himanshu’s (part) interviews in coming days.
సల్వా జుడుంకి మొదట జగదల్‌పుర్ పట్టణానికి చెందిన వ్యాపారులు నిధులు అందించారు. లోహండిగూడ రైతుల దగ్గర భూములు ఆక్రమించుకుని టాటా కంపెనీ స్టీల్ ప్లాంట్ పెట్టగలిగితే జగదల్‌పుర్‌లో రియల్ ఎస్టేట్స్ ధరలు పెరుగుతాయనుకున్నారు. సల్వా జుడుంకి చత్తీస్‌గఢ్ ప్రభుత్వం & కేంద్ర ప్రభుత్వాలు కూడా నిధులు ఇచ్చాయి. పోలీసుల సంఖ్య పెంచితే జీతాల ఖర్చు పెరుగుతుంది, అదే కిరాయి హంతకులని ఉపయోగిస్తే నెలకి వెయ్యి, రెండు వేల కిరాయికి హత్యలు చెయ్యించొచ్చని అనుకున్నారు. కానీ మహేంద్ర కర్మ చావుతో ఆ ప్లాన్ బెడిసికొట్టింది.
arundato roy and himanshu articles kosam eduru chusthunnam