పన్ను ఎగవేతకు ఆప్! -కార్టూన్


App for evasionఆమె: యాపిల్ కంపెనీ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగవేయగలిగింది తెలుసా!

అతడు: భలే, దాని కోసం ఆప్ ఏమన్నా ఉందా ఏమిటి?

అప్లికేషన్ అనే పదానికి ‘ఆప్’ అనే పొట్టి మాటను బహుళ ప్రచారంలోకి తెచ్చింది బహుశా మొదట యాపిల్ కంపెనీయే అనుకుంటా. యాపిల్ ఫోన్ల పైన నిలువు అడ్డ వరుసల్లో కనిపించే విధంగా స్టీవ్ జాబ్స్ కంపెనీ వివిధ అప్లికేషన్ల ఐకాన్లను డిజైన్ చేసిన తరువాత అది విపరీతంగా క్లిక్ అయింది. దానితో ఇతర సెల్ కంపెనీలు కూడా అనివార్యంగా ఆ డిజైన్ ను అనుసరించవలసి వచ్చింది. వాటిలో సామ్ సంగ్ కంపెనీ ముందు వరుసలో నిలబడి డిజైన్ కి సంబంధించిన కాపీ రైట్ కేసులను కూడా యాపిల్ నుండి ఎదుర్కొంది.

బహుళ ప్రజాదరణ పొందిన యాపిల్ ‘ఆప్స్’ అనేకమంది ఛోటా, మోటా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు కూడా పెద్ద ఎత్తున పని కల్పించింది. గూగుల్ కంపెనీ విడుదల చేసిన యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఇపుడు ప్రపంచవ్యాపితంగా అనేకమంది ఆప్స్ తయారు చేసి సంపాదనలో పడిపోయారు. ఈ మధ్య ఒక స్కూల్ అమ్మాయి కూడా తనదైన గూగుల్ ఆప్ అభివృద్ధి చేసి వార్తల కెక్కింది. మరొకరెవరో మహిళల రక్షణ కోసం ఆప్ తయారు చేసామంటూ ముందుకు వచ్చారు. ఈ వరుసలో పన్ను ఎగవేయడానికి కూడా యాపిల్ కంపెనీ ఆప్ తయారు చేసిందా?

One thought on “పన్ను ఎగవేతకు ఆప్! -కార్టూన్

వ్యాఖ్యానించండి