యు.పి.ఎ జవాబుదారీతనం ఇలా తగలడింది -కార్టూన్


UPA accountabilityభారత రాజకీయ వ్యవస్ధ ఎన్నడూ లేనంతగా గబ్బు పట్టిపోయింది. రాజకీయానికి, ఆరాచకానికి సరిహద్దులు చెరిగిపోయాయి. ఎన్ని పరిమితులున్నా, ఒకప్పుడు ఎంత నీతిగా ఉంటే అంత గొప్ప. ఇప్పుడు ఎంత దిగజారి అవినీతికి పాల్పడినా అంత సంపాదిస్తే అంత గొప్ప!  కాగ్ ఛీ అంటుంది. సుప్రీం కోర్టు ఛీ ఛీ అంటుంది. అయినా మంత్రులు, ప్రధాన మంత్రి దగ్గర్నుండి రాష్ట్రాల మంత్రుల వరకూ దులుపుకుని పోయేవారే తప్ప జనానికి తాము జవాబు చెప్పాల్సి ఉంటుందన్న ధ్యాసే లేదు. 

జనానికి ఛీ కొట్టే అవకాశం లేకుండా చేశారు గనక వాళ్లేమీ అనలేరు. అదేమంటే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అంటూ ఖాళీ కబుర్లు చెప్పడంలో పత్రికలు కూడా పండిపోయాయి. ‘తాడి తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని’ ఎన్.డి.ఎ అవినీతిని, కార్పొరేట్ స్వామ్యాన్ని మించిపోయింది యు.పి.ఎ.

సుప్రీం కోర్టు తలంటు పోసినా కుర్చీలకు అతుక్కుపోయిన కేంద్ర మంత్రులు ఈ రోజు మనకు పాలకులు. పదవులకు అంటిపెట్టుకోవడానికి సవాలక్షా కారణాలు వెతుకుతారు తప్ప ప్రజలకు జవాబు చెప్పడానికి ఒక్కరూ బాధ్యత తీసుకోరు. వారి వద్ద ఉంటే కదా, జవాబు చెప్పడానికి!

One thought on “యు.పి.ఎ జవాబుదారీతనం ఇలా తగలడింది -కార్టూన్

వ్యాఖ్యానించండి