ఆ తెల్లోళ్ళు కాదు, వీరే అసలు అమెరికన్లు -ఫోటోలు


అమెరికన్లు అనగానే ఆ కాకసాయిడ్ రూపంలో ఉండే తెల్లవాళ్లే గుర్తుకొస్తారు. తెల్లవాళ్లు వాస్తవానికి ఐరోపా నుండి వలస వచ్చినవారు. ఇండియా కోసం బయలుదేరి ఉత్తర అమెరికా ఖండం చేరుకున్న కొలంబస్, అమెరికానే ఇండియాగా భావించి అక్కడ కనపడినవారిని ‘రెడ్ ఇండియన్లు’ అన్నాడు. స్వల్పంగా మంగోలాయిడ్ రూపంలో ఉండే ఆ రెడ్ ఇండియన్లే అసలు అమెరికన్లు. ఇప్పుడు వారి సంఖ్య చాలా స్వల్పం. నేటివ్ అమెరికన్లను పశ్చిమ తీరానానికి నెట్టుకుంటూ పోయిన యూరోపియన్లు ఆ క్రమంలో అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. స్ధానిక తెగల ప్రజల భూములు సంపదలు లాగేసుకుని ప్రతిఘటించినవారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు.

1900 ప్రారంభంలో సియాటిల్ నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఎడ్వర్డ్ ఎస్.  కర్టిస్ నేటివ్ అమెరికన్ల వివరాలు సేకరించే పనికి బయలుదేరాడు. జె.పి.మోర్గాన్ కంపెనీ అందించిన నిధులతో నేటివ్ అమెరికన్ల జీవితాలను డాక్యుమెంట్ చేసే ప్రాజెక్టు చేపట్టాడు. అమెరికా పశ్చిమ తీరానికి ప్రయాణం కట్టిన కర్టిస్ ఆ తర్వాత 20 సంవత్సరాల కాలంలో దాదాపు 80 రకాల తెగల ప్రజలను కలిశాడు. దాదాపు 40,000 ఫోటోలు తీశాడు. భారీ ప్రమాణంలో నోట్సు రాసుకున్నాడు. స్కెచ్ లు గీసుకున్నాడు. ఆయన కృషి ఫలితంగా నేటివ్ అమెరికన్లపై 2,000 ఫోటోలతో కూడిన 20 వాల్యూమ్ ల పుస్తకాలు తయారయ్యాయి. ఈ పుస్తకాలకు ‘ద నార్త్ అమెరికన్ ఇండియన్’ అని పేరు పెట్టారు.

‘ద అట్లాంటిక్’  పత్రిక ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ నుండి ఈ ఫొటోల్లో కొన్ని సేకరించి ప్రచురించింది. ఆ ఫొటోల్లో ఇవి కొన్ని.

One thought on “ఆ తెల్లోళ్ళు కాదు, వీరే అసలు అమెరికన్లు -ఫోటోలు

  1. ఇది ప్రపంచంలో అన్ని చోట్లా జరిగిన చరిత్రే. బలవంతులు బలహీనులను ఓడించి వాళ్ళ భూమిని ఆస్తిపాస్తులను లాక్కుంటారు. ఐదు వేల సంవత్సరాల ఘన చరిత్రగల భారతదేశంలో ఇప్పటికి ఆర్యుల ద్రవిడుల పేర్లు వినబడుతున్నాయి. రెడ్ ఇండియన్స్ లాగా ఎన్ని వేల లక్షల భారతీయ జాతులు కాలగర్భంలో కలసిపోయాయో ఎవరికి తెలుసు?

వ్యాఖ్యానించండి