కర్ణాటకలో బి.జె.పి సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయింది. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్నట్లు ఫోజు పెడుతున్న బి.జె.పి పార్టీకి కర్ణాటకలో సొంత నాయకుల అవినీతిని నెత్తిన పెట్టుకోలేకపోయింది. జాతీయ స్ధాయిలో పరువు ప్రతిష్టలు నిలుపుకోవాలంటే కార్ణాటకలో అవినీతి నాయకుడు యెడ్యూరప్పను దూరం పెట్టక తప్పని పరిస్ధితి. ఫలితంగా బి.జె.పి ఓటు బ్యాంకు చీలిపోవడంతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది.
సొంత కుంపటి పెట్టుకుని తగిన సీట్లు తెచ్కుకుని ప్రభుత్వాల్ని శాసించవచ్చు అనుకున్న కర్ణాటక జనతా పార్టీ నేత యెడ్యూరప్ప ఆశలు కూడా గల్లంతయ్యాయి. అవినీతి రాజు గాలి జనార్ధన రెడ్డితో అంట కాగుతున్న బి.శ్రీరాములు పార్టీది అదే పరిస్ధితి. రెండు ముఠాలను దూరం చేసుకున్న బి.జె.పి అధికార కిరీటాన్ని స్వయంగా కాంగ్రెస్ కు అప్పగించింది. డెబ్భైల్లో కేంద్రంలో జనతా కుమ్ములాటలతో తిరిగి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నట్లే నేడు భారతీయ జనతా కుమ్ములాటల్లో కాంగ్రెస్ కర్ణాటక అధికార పీఠాన్ని అధిష్టిస్తోంది.
evaru gelichinaa mallee ganulu tavvaalsinde kadaa sekhar garu naa paapam bhaavam gurinch ??????