కర్ణాటక ఎన్నికలు: బి.జె.పి విచిత్ర పోరాటం


The Hindu

The Hindu

మాకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయేనని కర్ణాటక బి.జె.పి ప్రకటిస్తోంది. తమ నుండి చీలి ‘కర్ణాటక జనతా పార్టీ’ పేరుతో వేరు కుంపటి పెట్టిన యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆ విధంగా తక్కువ చేసి చూపాలని బి.జె.పి ప్రయత్నం. బి.జె.పి పాలనలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ జనతాదళ్ (సెక్యులర్) అని కనుక తామే బి.జె.పి కి ప్రధాన పోటీ అని జె.డి(ఎస్) ప్రకటిస్తోంది. ఆ పార్టీకి ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిన పని లేదని దాని ఓటు బ్యాంకు దానికి ఉందని పోరాట బరి ఒడ్డున దిలాసాగా జె.డి(ఎస్)ని కూర్చోబెట్టడం ద్వారా కార్టూనిస్టు సూచిస్తున్నారు. ప్రధాన పోటీదారు కాంగ్రెస్సే అని బి.జె.పి చెప్పినా అది కె.జె.పి రూపంలో ఓట్ల చీలిక ఎదుర్కొంటోందని కె.జె.పి ప్రత్యేక బరి ద్వారా సూచించబడింది. అంతిమంగా బి.జె.పి పార్టీ ఒక విచిత్ర పోరాటాన్ని కర్ణాటక ఎన్నికల బరిలో సాగిస్తోంది. ఈ కార్టూన్ లో కాంగ్రెస్ వీరుడికి లేబుల్ లేకపోవడానికి అర్ధం ఏమిటి చెప్మా!

2 thoughts on “కర్ణాటక ఎన్నికలు: బి.జె.పి విచిత్ర పోరాటం

వ్యాఖ్యానించండి