ఏప్రిల్ 30 తేదీన (ఈ రోజు) ఈనాడు ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం ఇది. అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు రాశారు. తమిళనాడులో నిర్మించబడుతున్న కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి రష్యా నుండి నాసిరకం పరికరాలు సరఫరా అయ్యాయని ఆరోపణలు గుప్పుమన్న నేపధ్యంలో ఈ వ్యాసం వెలువడింది. నాసిరకం ఉక్కుతో తయారు చేసిన విడి పరికరాల వలన అణు విద్యుత్ కర్మాగారానికి ముప్పు పొంచి ఉన్నదని రచయిత చర్చించారు. కూడంకుళం అణు కర్మాగారాన్ని భారత ప్రభుత్వం వదులుకుంటేనే మేలని కూడా రచయిత సూచిస్తున్నారు.
అత్యంత ఖరీదైన అణు విద్యుత్ బదులు జల, సౌర, పవన, తరంగ, భూఉష్ణ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి పూనుకోవాలని ఆయన సూచించారు. కానీ విదేశీ కంపెనీలకు మేలు చేకూర్చేపనిలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేకూర్చే శాస్త్రవేత్తల మాటలు పట్టించుకున్న దాఖలాలు గతంలో లేవు. కొత్తగా పట్టించుకుంటారని ఆశించడం వ్యర్ధమే కావచ్చు. కూడంకుళం ప్రజల పోరాటాలకు దేశం మొత్తం మద్దతు ఇస్తే తప్ప పాలకులు తల ఒగ్గరు.
కింద బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంటులో వ్యాసం చూడవచ్చు.
