ప్రధానికి సోనియా అభయ హస్తం -కార్టూన్


The Hindu

The Hindu

“ఏమీ పట్టించుకోవద్దు, అలా వెళ్తూనే ఉండండి!”

2జి కుంభకోణంలో తన పాత్రపై మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన ఆరోపణలకు బదులివ్వాలని ప్రతిపక్షాలు అరిచి గీపెడుతున్నా ప్రధాన మంత్రి నోరు విప్పడం లేదు. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సిన్హా ముచ్చటగా మూడోసారి ఈ విషయమై ప్రధానికి లేఖ రాశారు. ‘మీ మౌనం మీ దోషిత్వాన్ని ఎత్తి చూపుతోంది’ అని ఆయన ఘాటుగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మౌనం వహించడం, విదేశీ కంపెనీలకు దోచి పెట్టాల్సి వచ్చినపుడు రాజీనామా చేస్తా అని బెదిరించి అనుకున్నది సాధించడం మన ప్రధాని కనిపెట్టిన సొంత మార్కు ఎత్తుగడలా కనిపిస్తోంది.

తాజాగా బొగ్గు కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కి ప్రత్యక్ష పాత్ర ఉందన్నట్లుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక తేల్చి చెప్పిన విషయంలో కూడా ప్రధాని మౌన మునిలా వ్యవహరిస్తున్నారు. బొగ్గు గనుల కేటాయింపులన్నీ అక్రమం అని, వాటిని వెంటనే రద్దు చేయాలని పార్లమెంటు సభ్యుల కమిటీ నిర్ధారించినా ప్రధాని నోరు విప్పడం లేదు. ఆయన తరపున కాంగ్రెస్ నాయకురాలు నోరు విప్పడమే కాకుండా ప్రతిపక్షాలు కోరుతున్నట్లు ప్రధాని రాజీనామా చేసేది లేదు పొమ్మని కుండ బద్దలు కొట్టారు కూడా. అద్వానీ నేతృత్వంలో బి.జె.పి పార్లమెంటరీ పార్టీ సమావేశమై ప్రధాని రాజీనామా చేయాలని డిమాండు చేస్తే సోనియా గాంధీ దానిని అడ్డంగా కొట్టిపారేసింది.

సోనియమ్మ చెప్పినట్టల్లా ఆడడం మౌన ముని వంటయితే, విమర్శల నుండి మౌన మునిని కాపాడడం, ఆయన తరపున సమాధానం చెప్పడం సోనియమ్మ వంతు అన్నట్లు ఉంది పరిస్ధితి.

వ్యాఖ్యానించండి