తెనాలిలో తాగుబోతుల దుర్మార్గం ఫలితంగా లారీ కింద పడి చనిపోయిన సునీల కుటుంబం దళితులని తెలిసే వారిపై దుర్మార్గానికి పాల్పడ్డారని గుంటూరు ఎస్.పి జె.సత్యనారాయణ హై కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని ఈనాడు పత్రిక తెలిపింది. బి.టెక్ చదువున్న సునీల కుమార్తెను దుండగులు మొదట కులం పేరుతో దూషించి అనంతరం లైంగికంగా వేధించారని ఎస్.పి తన నివేదికలో పేర్కొన్నారు. ది హిందు రిపోర్టును పిటిషన్ గా సుమోటోగా విచారణకు స్వీకరించిన రాష్ట్ర హై కోర్టు స్వయంగా విచారణను పర్యవేక్షించడానికి నిర్ణయించింది.
బార్ యజమాని కుమారుడు నాగరాజు ప్రధాన నిందితుడని సునీల భర్త ఆరోపించగా మరో వ్యక్తిని ప్రధాన నిందితుడుగా పోలీసులు పేర్కొంటున్నారు. తన కుమారుడికి నేరంలో ప్రమేయం లేదని దుర్ఘటనా స్ధలంలోని బార్ యజమాని చెబుతున్నాడు. పోలీసులు వెంటనే స్పందించలేదన్న ఆరోపణలను పోలీసు శాఖ ఖండించినప్పటికీ తెనాలి ఎస్.ఐ, డి.ఎస్.పి లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈవ్ టీజింగ్ లో సైతం కుల వివక్ష పాటించడం తెనాలి దుర్ఘటనలో కనిపిస్తున్న సరికొత్త కోణం. ఒక మహిళ, అందునా దళితురాలు తమ ఆధిపత్యాన్ని ధిక్కరించడం నిందితులు సహించలేకపోయినందునే ఆమెపై ప్రాణాంతకంగా చేయిచేసుకున్నట్లు ఎస్.పి నివేదిక సూచిస్తోంది.
పత్రిక అందించిన ఇతర వివరాలను కింద చూడవచ్చు. బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు.
–
దుర్ఘటన వివరాలు ఇంకా తెలియనివారు ఈ క్రింది వార్తను చూడగలరు.
–


—*******-******* –*****–****** Vellani kosi kaaram pettali….