జులై 17, 2010 తేదీన చైనా ఈశాన్య రాష్ట్రం లియావోనింగ్ లో చమురు ప్రమాదం సంభవించి ‘పచ్చ సముద్రం’ ను ముంచెత్తింది. చమురు డాక్ యార్డ్ లో చమురు ట్యాంకులు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం చమురు లీకేజీని అరికట్టడానికి, పొర్లిపోయిన చమురుని తిరిగి ఎత్తి వినియోగంలోకి తేవడానికీ, సముద్ర కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ఆ దృశ్యాలే ఇవి. 1500 తన్నుల క్రూడాయిలు సముద్రంలోకి ఒలికిపోగా అందులో మూడో వంతుని కార్మికులు తిరిగి ఎత్తి పోసారట.
చమురు మండించి ఆ శక్తితో అనేక సౌకర్యాలు పొందే మనం ఆ సౌకర్యం వెనుక శ్రామికుల శ్రమ ఎంత దాగి ఉన్నదీ పెద్దగా పట్టించుకోము. వారి శ్రమ గురించి మనకు చెప్పేవారు కూడా ఎవరూ లేకపోవడం దానికొక కారణం కావచ్చు. ‘ఆయిల్ స్పిల్’ శుభ్రం చేశాక ‘శుభ్రం చేశామహో’ అని ప్రకటించుకుని ప్రశంసలు పొందేది కంపెనీలు, వాటి అధికారులు అయితే వాస్తవంగా శ్రమ చేసి శుభ్రం చేసేది సాధారణ కార్మికులు. ఈ ప్రక్రియలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కద్దు. ఇంకా అనేకమంది ఆరోగ్యాలు చెడగొట్టుకుని తగిన వైద్య సహాయం లేకుండా తీసుకుని చనిపోతుంటారు.
ఈ ఫొటోల్లో సముద్ర గర్భంలో లీకేజీని అరికట్టడానికి దిగి అనూహ్యంగా మునిగిపోయే పరిస్ధితి ఏర్పడడం, మరొక కార్మికుడు ఆదాటున దూకేసి అతనిని కాపాడడానికి ప్రయత్నించడం చూడవచ్చు. లీకయిన చమురుతో నిండిన ఇసుకను బస్తాల్లో నింపి వేరే చోటికి తరలించడం, లీకయిన చమురును పడవల ద్వారా తోడేందుకు ప్రయత్నించడం కూడా ఫొటోల్లో చూడవచ్చు. దాదాపు 1000 పడవలు రోజుల తరబడి శ్రమించి మంటలను, లీకేజీని అదుపులోకి తెచ్చారు. ఎన్.బి.సి న్యూస్ ఈ ఫోటోలను అందించింది.
–
–
వీళ్ళు చాలా శ్రమ పడి చమురు శుధ్ది చేస్త్తున్నారు.