కాంగ్రెస్ ప్రభుత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వ పని తీరుపై ‘ది హిందు’ పత్రిక మరో కార్టూన్ బాణం విసిరింది. అవినీతి స్కాముల మూటలు మోస్తూ, సోనియమ్మ చేతిలో కళ్ళెం పట్టుకుని అదపు చేస్తుంటే, ‘మిస్టర్ క్లీన్’ భారంగా బండి లాగుతున్న దృశ్యం, పరిస్ధితిని కళ్ళకు కడుతోంది.
కానయితే స్కాములు ప్రధానికి నిజంగా భారమా లేక ఆయనకు తెలిసీ జరుగుతున్నాయా అన్నది చర్చాంశం. 2జి స్కాము మన్మోహన్ కి తెలిసే జరిగిందనీ, జరగబోతున్నది తెలిసినా ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఇటీవల ‘ది హిందు’ పత్రికే ఒక కధనం ప్రచురించింది. ‘కూటమి ధర్మం’ పేరుతో తన చేతల రాహిత్యాన్ని సమర్ధించుకున్న వార్తలు కూడా పత్రికలో ప్రచురితం అయ్యాయి. కాకపోతే చెర్నకోల ఉండవలసిన వారి చేతుల్లో లేకపోవడం వాస్తవం.
