“ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు” శీర్షికన, “ఆశలు రేకెత్తిస్తున్న బ్రిక్స్ బ్యాంకు” ఉప శీర్షికన ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ఈ రోజు ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ప్రచురించబడింది. ఎడిటోరియల్ పేజిలో ప్రచురితం కావడం ఈ బ్లాగర్ కి ఇదే మొదటిసారి. పత్రిక జతచేసిన బ్రిక్స్ దేశాధినేతల ఫొటో, బ్రిక్స్ సభ్య దేశాలతో భారత దేశ వాణిజ్యాన్ని వివరించె గ్రాఫు ఆర్టికల్ కు మరింత పరిపుష్టతను చేకూర్చాయి. ఈ సందర్భంగా ఈనాడు, మిత్రులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పడం సముచితం.
పశ్చిమ దేశాల పెత్తనం కొనసాగుతున్న నేటి ప్రపంచం బహుళ ధృవ ప్రపంచంగా ఆవర్భవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బహుళ ధృవత అనేది ప్రపంచ దేశాల పైన ఒకటి రెండు దేశాల పెత్తనం సాగే బదులు వివిధ దేశాల మధ్య సాపేక్షికంగా ప్రజాస్వామిక సంబంధాలు అభివృద్ధి కావడానికి బాటలు పరుస్తుంది. ఈ లక్ష్యం దిశలో బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు ఒక మలుపుగా చెప్పవచ్చు. బ్రిక్స్ బ్యాంకు ఎంత త్వరగా అభివృద్ధి చెంది స్ధిరపడితే పశ్చిమ దేశాల పెత్తనం అంత త్వరగా వెనకపట్టు పడుతుంది. ఈ అంశాన్ని ఆర్టికల్ లో చర్చించాను.
ప్రకటిత లక్ష్యాన్ని బ్రిక్స్ కూటమి సాధించగలదా అనేది సభ్య దేశాల నిబద్ధత పైన ఆధారపడి ఉంటుంది. భారత దేశ పాలకులు ఈ లక్ష్య దిశలో ఎంతవరకు కృషి చేసేదీ అనుమానమే. బ్రిక్స్ పునాదిగా పశ్చిమ దేశాలతో మరిన్ని బేరసారాలు జరపడానికే భారత పాలకులు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికైతే చెప్పక తప్పదు.
ఈనాడు ఆర్టికల్ ను నేరుగా పత్రిక వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. (ఈ లింక్ ఈ ఒక్కరోజే పని చేస్తుంది.) పి.డి.ఎఫ్ డాక్యుమెంటులో చదవాలనుకుంటే కింద బొమ్మపై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.
–
–