భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్


తమిళనాడులో ఓ రైతు

తమిళనాడులో ఓ రైతు

(భారత దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల స్వభావం ఏమిటన్నదీ దేశంలో ఒక చర్చగా ఉంటోంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలలో, ఇంకా ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలలో ఈ అంశం పైన తీవ్రమైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి. భారత దేశ వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం (Capitalist Mode of Production) ప్రవేశించిందని కొంత మంది వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను తిరస్కరిస్తున్నారు. అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధగా నిర్వచించబడిన భారత దేశ సామజిక వ్యవస్ధ దశ, ప్రజలలోని వివిధ వర్గాల విప్లవాత్మక పాత్ర లేకుండా దానంతట అదే క్రమానుగతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధగా ఎలా మారుతుంది అనేది ఒక సమస్య. ఈ అంశాల పైన బెంగాల్ లో డాక్టర్ గా పని చేస్తున్న అమితాబ్ చక్రవర్తి, కారల్ మార్క్స్ రచించిన ‘దాస్ కేపిటల్’ లోని మౌలిక మార్క్సిస్టు బోధనల ఆధారంగా “A NOTE ON TRANSITION IN INDIAN AGRICULTURE” అనే టైటిల్ తో ఒక చిన్నపాటి పుస్తకాన్ని రచించారు. డాక్టర్ అమితాబ్ ఆంగ్ల రచనకు ఇది యధాతధ అనువాదం. ఒకేసారి ఈ పుస్తకాన్ని అనువాదం చేయడం లేదు. వీలును బట్టి అనువాదం చేస్తూ భాగాలుగా ఈ బ్లాగ్ లోనే ప్రచురిస్తాను. మొదటి భాగం ఈ రోజు. -విశేఖర్)

రచన: డాక్టర్ అమితాబ్ చక్రబర్తి

చాప్టర్ I

వ్యవసాయ రంగంలో మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ గురించిన కొన్ని మౌలిక మార్క్సిస్టు సిద్ధాంత అవగాహనలు

వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం గురించి అధ్యయనం చేసే ముందు, నవంబరు 1886లో విడుదలయిన కేపిటల్ I ఆంగ్ల అనువాదానికి ఫ్రెడరిక్స్ ఎంగెల్స్ రాసిన ముందుమాట నుండి కొన్ని మాటలు చూద్దాం. “దాస్ కేపిటల్ ను కార్మిక వర్గానికి బైబిల్ గా ఈ ఖండం పైన (బ్రిటిషేతర యూరప్ –అను) తరచుగా పిలుస్తారు….. కార్మిక వర్గం అంతకంతకూ ఎక్కువగా తమ పరిస్ధితులకు, ఆకాంక్షలకు అత్యంత సముచితమైన వ్యక్తీకరణను ఈ అభిప్రాయాలలో గుర్తిస్తున్నారు.” (Capital I, Page 16) (వక్కాణింపు రచయితదే –అను) కనుక మార్క్సిస్టులు ‘కేపిటల్’ని పక్కన పెట్టి వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం గురించి అధ్యయనం చేయడం, చర్చించడం చేయలేరు. ‘ఎకనమిస్టేతర/అకడమిక్ యేతర’ సామాజిక కార్యకర్త అనే మానసిక ప్రతిబంధకం (mind block) ను అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా ఈ కింది అంశాల పైన ప్రత్యేకంగా కేంద్రీకరించాలి. ‘పెట్టుబడి సంచయం యొక్క సాధారణ సూత్రం’ (The General Law of Capitalist Accumulation – Chapter XXV-Capital I), ‘సో కాల్డ్ ఆదిమ సంచయం’ (The so called Primitive accumulation – Part VIII Ch-XXVI, Capital), ‘పెట్టుబడి సంచయం యొక్క చారిత్రక ధోరణి’ (Historical Tendency of Capital Accumulation –Chapters in Capital II), ‘పెట్టుబడి మరియు దాని మార్గాల మెటా మార్ఫాసిస్’ (The Meta morphosis of capital & their circuits – Part I & Part III Chapter XX), సాధారణ పునరుత్పత్తి (Simple reproduction) మరియు ‘అదనపు మొత్తంలో సంచయం మరియు పునరుత్పత్తి’ (Accumulation & Reproduction on an extended scale – Ch XXI) సరుకు పెట్టుబడి & ద్రవ్య పెట్టుబడి లు వాణిజ్య పెట్టుబడి & ద్రవ్య సంబంధిత పెట్టుడి (Merchants capital) లలోకి మార్పిడి (Conversion of commodity capital & Money Capital into commercial Capital & Money Dealing కాపిటల్ – Capital III part IV), పెట్టుబడిదారీ పూర్వ సంబంధం (Pre capitalist relationship –Ch XXXVI & part VI), అదనపు లాభం భూమి అద్దె లోకి మార్పిడి (Transformation of surplus profit into ground rent).

“పెట్టుబడిదారీ పూర్వ ఆర్ధిక నిర్మాణం” (Pre capitalist Economic formation –Marx, 1858) మరియు ‘కాండ్రేస్సే’ (the Grundresse) లు అత్యంత సంపద్వంతమైనవి, ఆలోచనలు రేకెత్తించేవి. మార్క్స్ వీటిని తన కేపిటల్ (1867) గ్రంధ రచనకు పూనుకుంటున్న క్రమంలో రాశారు. అలాగే, ‘రాజకీయ అర్ధశాస్త్ర విమర్శకు ఒక సమర్పణ’ (Contribution to the critique of Political Economy -1859) కూడా ఉత్పత్తి విధానం (mode of production) పై చర్చను అర్ధం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తుంది.

ఉత్పత్తి విధానం గురించి చర్చించేటప్పుడు, వ్యవసాయ రంగంలో ఆస్తి సంబంధం (Property Relation) మరియు ఉత్పత్తి సంబంధం (Production Relation) ల మధ్య తరచుగా అయోమయానికి గురవుతూ అపార్ధం చేసుకుంటాము. (చర్చలోకి వెళ్ళేముందు) కొన్ని మౌలిక మార్క్సిస్టు అవగాహనాలను క్లుప్తంగా నెమరువేసుకోవడం అవసరం.

వ్యవసాయం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోకి పరివర్తన చెందే క్రమం అనేక ప్రత్యేకతలను (peculiarities) కలిగి ఉంటుంది.

(వ్యవసాయ రంగం పెట్టుబడిదారీ విధానంలోకి ప్రవేశించే) పరివర్తనలో వ్యవసాయంలో శ్రమ ద్వారా కలిసే నూతన విలువ మూడు భాగాలుగా ఉంటుంది. అవి:

  1. శ్రమ శక్తి సొంతదారుకు చెందే భాగం
  2. పెట్టుబడి సొంతదారు
  3. భూమి ఆస్తి సొంతదారు

ఇవి పంపిణీ (distribution) యొక్క మూడు రూపాలు. పంపిణీ సంబంధం ఉత్పత్తి సంబంధాలతో అత్యవసరంగా ఏకీభవిస్తుంది; కానీ అవి విరుద్ధ పక్షాల వైపు ఉంటాయి. ఆ విధంగా అవి రెండూ ఒకే విధమైన చారిత్రక పరివర్తనా స్వభావాన్ని పంచుకుంటాయి. ఉత్పత్తిలోని ఒక భాగం పెట్టుబడిగా పరివర్తన చెందే ప్రక్రియే మిగిలిన భాగం వేతనాలు, లాభం మరియు వడ్డీ (rent)లుగా మార్చుతుందని మార్క్స్ వివరించారు.(Capital III, P: 879) (మొదటిది అనివార్యంగా రెండోదానికి దారితీస్తుంది –అను).

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కేవలం పాదార్ధిక ఉత్పత్తులను (material products) మాత్రమే ఉత్పత్తి చేసి ఊరుకోదు, దానితో పాటు ‘పాదార్ధిక ఉత్పత్తులు మరియు సంబంధిత పంపిణీ సంబంధం కూడా కలిసి ఉండే’ ఉత్పత్తి సంబంధాన్ని అది (పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం) నిరంతరం పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది. (Ibid, P: 879)

ఈ పెట్టుబడిదారీ ఉత్పత్తికి రెండు లక్షణాలుంటాయి:

  1. సరుకు (commodity), దాని ఉత్పత్తుల ఆధిపత్య పూర్వక (dominant) మరియు నిర్ణయాత్మక (determining) లక్షణం;
  2. స్వేచ్ఛాయుత వేతన శ్రామికుడు, శ్రామికుడు సాధారణంగా వేతన శ్రామికుడుగానే కనపడతాడు.

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం, తాను నిరంతరం పునరుత్పత్తి చేసే ఉత్పత్తి సంబంధంలో ‘ఉత్పత్తి సంబంధం’ ఉత్పత్తి అవుతుంది; అంతే కాకుండా పెట్టుబడి మరియు వేతన శ్రామికుడి మధ్య గల సంబంధమే మొత్తం ఉత్పత్తి విధానం యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది. (Ibid, P: 880)

కనుక, వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానాన్ని లేదా వ్యవసాయంలో ఉత్పత్తి విధానాన్ని అర్ధం చేసుకునేటప్పుడు ఉత్పత్తి సంబంధం & పంపిణీ సంబంధాలను (distribution relations) విశ్లేషించాల్సి ఉంటుంది. (వక్కాణింపు రచయితది. గమనిక: ఇక నుండి ప్రత్యేకంగా చెబితే తప్ప వక్కాణింపు రచయితదే అని గ్రహించగలరు. –అను)

పెట్టుబడిదారీ వ్యవసాయంలో ఉత్పత్తి సరుకుగానూ మరియు సరుకు పెట్టుబడి యొక్క ఉత్పత్తి గానూ మనం చూడగలం – ఇది చెలామణి సంబంధాన్ని (circulation relation) వివరిస్తుంది. చెలామణి సంబంధాన్ని ఉత్పత్తి సంబంధం నుండి వేరుగా చూడాలి. అవి ఒకదానితో ఒకటి అంతఃసంబంధం (interlinked) కలిగి ఉంటాయి, కానీ రెండూ ఒకటి కాదు.

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో ఉత్పత్తికి, అదనపు విలువే ప్రత్యక్ష లక్ష్యంగానూ, ఉత్పత్తి యొక్క నిర్ణయాత్మక ఉద్దేశం (motive) గానూ ఉండడాన్ని మనం గమనించగలం. వేతన శ్రమ రూపంలో శ్రమా మరియు ఉత్పత్తి సాధనాల రూపంలో పెట్టుబడీ (ఉత్పత్తికి) ముందే ఉనికిలో ఉండడమే దీనికి గల కేవల కారణం. కేవలం ఈ అత్యవసర ఉత్పత్తి కారకాల (essential production factors) సామాజిక రూపం వల్లనే, విలువ (ఉత్పత్తి) లోని ఒక భాగం అదనపు విలువగా మరియు ఈ అదనపు విలువ లాభంగా, వడ్డీ (rent)గా, పెట్టుబడిదారుడి సంపాదన (gain) గా కనిపిస్తుంది. (Ibid, P: 881)

మొత్తం (ఉత్పత్తి) క్రమం యొక్క మరియు నిర్దిష్ట ఉత్పత్తి విధానం యొక్క నిర్ణయాత్మక రూపం, ‘శ్రమ అనేది వేతన శ్రమ’గా ఉండడమే, కానీ వేతన శ్రమ ఒక్కటే విలువను నిర్ణయించదు. (Ibid, P: 882)

ఉత్పత్తి విధానం (mode of production) గురించి చర్చించేటప్పుడు పంపిణీ సంబంధం మరియు ఉత్పత్తి సంబంధంల అంతఃసంబంధాన్ని అర్ధం చేసుకోవాలి. నిర్దిష్ట పంపిణీ సంబంధాలనేవి కేవలం నిర్దిష్ట చారిత్రక ఉత్పత్తి సంబంధానికి వ్యక్తీకరణగానే ఉంటాయి. (Ibid, P: 882)

కానీ పంపిణీ సంబంధం యొక్క చారిత్రక స్వభావం (historical character) కేవలం చారిత్రక ఉత్పత్తి సంబంధపు స్వభావం యొక్క ఒక కోణాన్ని (one aspect) మాత్రమే వ్యక్తీకరిస్తుంది.

ప్రతి పంపిణీ రూపం కూడా తాను ఉద్భవించే నిర్దిష్ట ఉత్పత్తి రూపం నుండీ, తాను ప్రవేశించే నిర్దిష్ట ఉత్పత్తి రూపంలోకీ అంతర్ధానం అవుతుంది. ఇతర పంపిణీ రూపాల నుండి పెట్టుబడిదారీ పంపిణీ రూపం విభేదిస్తుంది. ఒక నిశ్చయాత్మక పరిపక్వ దశను చేరుకున్నాక ఒక నిర్దిష్ట చారిత్రక రూపం అంతర్ధానం చెంది మరొక ఉన్నత రూపం ఆవిర్భవిస్తుంది. (Ibid, P: 883)

పంపిణీ సంబంధాలు మరియు తత్సంబంధిత నిర్దిష్ట ఉత్పత్తి సంబంధం యొక్క చారిత్రక రూపానికి మధ్య తలెత్తే ‘వైరుధ్యము మరియు శతృత్వాలు’ సంతరించుకునే లోతు, వ్యాప్తిలు (depth and breadth) అటువంటి సంక్షోభపు క్షణాల రాకను తెలియజేస్తాయి. (అప్పుడు) ఉత్పత్తి యొక్క భౌతిక అభివృద్ధి మరియు దాని సామాజిక రూపంల మధ్య ఒక ఘర్షణ అనివార్యం అవుతుంది.

                                                                                         … … … ఇంకా ఉంది.

6 thoughts on “భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్

  1. శేఖర్ గారు ఓ మంచి పుస్తకాన్ని తెలుగు వారికోసం అందిస్తున్న మీకు ధన్యవాదాలు.

    ఆ పుస్తకం హైదరాబాద్ లో ఎక్కడ లభిస్తుందో చెప్పగలరు.

    చివరగా ఒక్క విజ్ఞప్తి. ఆర్థికశాస్త్ర్ర పరిభాష, పదబంధాలు కొంత సంక్లిష్టంగానే ఉంటాయని తెలుసు.

    ఐనా అనువాదం ఇంకొంచెం సరళంగా చేయడానికి ప్రయత్నించకూడదూ.

  2. చందుతులసి గారూ, మీరు విజ్ఞప్తి చేయకముందే నేనా ఆలోచనలో ఉన్నాను. కాని చాప్టర్ I ప్రధానంగా సిద్ధాంతం. కారల్ మార్క్స్ నుండి ఉటంకనలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని సరళం చేయడం అంటే అదనంగా సొంత పదాలను వాడవలసి ఉంటుంది. అప్పుడు అది నా రచన అవుతుంది తప్ప మార్క్స్ ఉటంకనలు అవవు. మీరు చెప్పినట్లు అసలు సబ్జెక్టు స్వభావమే క్లిష్టం. ఒకటికి పదిసార్లు చదవవలసినది. అనువాదం కూడా ఒకటికి పదిసార్లు చదివి చేస్తున్నాను.

    బహుశా ముందు ముందు కొంత తేలిక కావచ్చు.

    డా. అమర్, మీరు స్పందించడమే నాకు ఆనందగా ఉంది. ఈ అనువాదానికి ఎవరైనా వ్యాఖ్యలు రాస్తారనే ఊహించలేదు. అందునా అభినందిస్తూ….!

    ఏమైనా మీ సూచనను గమనంలో ఉంచుకుంటాను.

    మరిచాను. ఈ పుస్తకం నాకు ఒక ఫ్రెండ్ ద్వారా అందింది. షాపుల్లో దొరుకుతుందో లేదో తెలియదు.

  3. మంచి ప్రయత్నం. ఇటువంటి రచనలు ఎలాగూ ఆ రంగంలో ఆసక్తి ఉన్నవారే చదువుతారు. కాబట్టి కొంచెం స్వేచ్ఛ తీసుకుంటే బాగుంటుంది. బ్రాకెట్లు మరీ ఎక్కువైతే చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది.

  4. జి.ఎస్.రామ్మోహన్ గారూ, మీ సూచనను దృష్టిలో ఉంచుకుంటాను. పాఠకులకు ఉపయోగపడతాయని బ్రాకెట్లలో ఆంగ్ల పదాలు ఇచ్చాను. కొన్నిసార్లు తెలుగు అనువాద పదాల కంటే ఆంగ్లపదాలే ఎక్కువ అవగాహన ఇస్తాయి. అడ్డం కూడా కావచ్చని మీ సూచన ద్వారా తెలుస్తోంది. తగ్గిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s