స్మిత్సోనియన్ మ్యాగజైన్ నిర్వహించే పోటీ కోసం ఎంపికైన టాప్ 50 ఫొటోల్లో ఇవి కొన్ని. 112 దేశాల నుండి 37,600 ఫొటోలు పోటీ కోసం వచ్చాయట. అందులో 50 ఫొటోలను షార్ట్ లిస్ట్ చేసింది మ్యాగజైన్. ఇంకా చివరి ఫలితాలు వెల్లడి కాలేదట. ఐదు విభాగాల్లో విజేతలు నిర్ణయించి బహుమానం ఇవ్వనున్నారు. పోటీ ఈ రోజు, అంటే మార్చి 29 తో ముగుస్తోంది. ‘రీడర్స్ ఛాయిస్‘ విజేత కోసం ఈ ఫొటోలను స్మిత్సోనియన్ మ్యాగజైన్ తన వెబ్ సైట్ లో ఉంచింది. వేర్వేరు చోట్ల తీసిన ఫొటోలను కలిపి రూపొందించిన చివరి రెండు ఫొటోలను చూడండి, ఎంత తమాషాగా ఉన్నాయో!
- న్యూమెక్సికోలో సూర్యగ్రహణం
- వియత్నాంలో ఉప్పుకొటార్లు
- ఇండోనేషియాలో ఉప్పుకొటార్లు
- తాతకు సాయం, టెక్సాస్
- టైమ్స్ స్క్వేర్, న్యూయార్క్ లో ఓ రాత్రి
- తెల్లారేలోపు నదిని దాటాలి. గ్జియావో డాన్జింగ్, చైనా
- బాక్సన్ లోయలో వరి పొలాలు, వియత్నాం
- అమ్మా, నేనిక్కడ. ఒకటే ఆకలి, మలేషియా
- ఫోజు నేనూ ఇస్తా, ఫొటోకి, నార్త్ కరొలినా
- కూలీ చీమల సాహసం, జావా
- దేవాలయాలు, మియాన్మార్
- ఓ తల్లి మొదటి బిడ్డ, కాంగో
- ప్రార్ధన ఇంకా ఎప్పుడు? నజరేత్ చర్చి, ఇజ్రాయెల్
- మెన్స్ బ్యూటీ పార్లర్, కోల్కతా
- రెండు ఫొటోల తమాషా, నార్వే
- అనేక ఫొటోలు గుదిగుచ్చిన తమాషా, న్యూయార్క్
–
–















