పిచ్ ను బట్టి ఏయే దేశాల వాళ్లు ఆడవలసి ఉంటుందో కెప్టెన్ నిర్ణయించ వలసిన రోజులు వచ్చేసాయి. ఏ దేశం వాళ్లు ఆడగూడదో చెప్పాక, ఏయే దేశాల వాళ్లు ఆడతారో కూడా చెప్పాలి కదా! ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర ఆ విషయమే చెబుతున్నారు, ఈ కార్టూన్ ద్వారా.
లేకపోతే, ఐ.పి.ఎల్ మ్యాచుల్లో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు ఆడగూడదని రాజకీయ నాయకులు నిర్ణయించడం ఎమిటి, విడ్డూరం కాకపోతే. అది కూడా ఒక రాష్ట్రంలో ఆడే మ్యాచ్ లకు నిషేధం పరిమితం చేయడం మరీ వింత. విదేశాంగ విధానం దేశం మొత్తం ఒకటైతే ఒక రాష్ట్రానికి ఇంకొకటి ఎలా ఉంటుంది?
భవిష్యత్తులో శ్రీలంకతో ఆడేటప్పుడు జాతీయ జట్టుల్లో కూడా తమిళనాడు ఆటగాళ్లు ఆడకుండా నిషేధం విచించినా విధించవచ్చు. ఒక్క శ్రీలంక అనే ఏముంది? పాకిస్ధాన్ తో ఆడేటప్పుడు జాతీయ జట్టులో ముస్లింలు లేకుండా చూడాలని కొందరు పట్టు పట్టవచ్చు. బంగ్లాదేశ్ తో నదీ జలాల వివాదం సాకుగా చూపి జాతీయ జట్టులో బెంగాలీయులు ఆడాలో లేదో ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలు నిర్ణయించవచ్చు. ఇలా వివిధ కారణాల వలన వివిధ రాష్ట్రాల వాళ్లు ఆడాలో లేదో ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలు నిర్ణయించే రోజు రావచ్చు.
ప్రజల భావోద్వేగాలు ప్రజల వద్ద లేకుండా రాజకీయ నాయకులు లాక్కుని తమకు నచ్చిన రూపం ఇస్తే పరిణామాలు ఇలా తప్ప వేరే విధంగా ఎలా ఉంటాయి?
—
–
చెన్నై స్టేడియంలో ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్: పిచ్ ని పరీక్షించాక మేము ఏమి నిర్ణయించామంటే, ఫీల్డింగ్ లో ఐదుగురు ఇండియన్లు, ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఇద్దరు ఆంగ్లేయులు, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ల నుండి ఒక్కొక్కరు ఉంటారు. లంకేయులు అందరినీ తొలగించాము.

అరవాళ్లంతే మరి. అదో రకం ‘పిచ్చి’ గోల :-)
ఈ కార్టూన్ నిన్న హిందూలో చూసినప్పుడు చాలాసేపు నవ్వుకున్నాను.
నిజమే…క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. ఏ ఆటైనా అంతే. గెలుపు ఓటములు అనేవి ఆ ఒక్క ఆటకే పరిమితమవ్వాలి తప్ప…. ఇతర అంశాలతో ( ముఖ్యంగా రాజకీయ కారణాలతో ) మెలికపెట్టడం దురదృష్టకరం.
భారత్-పాక్ ల మ్యాచ్ మధ్య మ్యాచ్ జరిగితే అది ఓ యుద్దం లాగే చూసే పరిస్థితి ఇరు దేశాల్లోనూ ఉంది.
ఓడిపోతే టీవీసెట్లు పగలగొట్టినవాళ్లు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఆటగాళ్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ఇళ్లపై దాడులు కూడా జరుగుతాయి.
మీరు చెప్పినట్లే….రేపు ఒక్కో పార్టీ ఒక్కో తరహా డిమాండ్ పెడితే….ప్రపంచం ముంగిట మన పరువు గంగపాలు కాక తప్పదు.
ఇప్పటికే మన క్రీడా రాజకీయాలపై విసుగెత్తిన అంతర్జాతీయ క్రీడా సంఘాలు మన దేశ సంఘాలకు గుర్తింపును రద్దు చేయడంతో అవమానాల పాలయ్యాం.
ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ….వాటితో రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీలు, నేతల వల్లే ఈ సమస్య.
ఇళ్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకునే చందంగా… ఆటను ఆటగా కాక….దాంట్లోనూ రాజకీయ ప్రయోజనాలు చూసుకునే పార్టీల వైఖరిని ప్రతిఒక్కరూ ఖండించాలి.