నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు


భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధాలు తప్పవని అనేకమంది ఇప్పటికే జోస్యం చెప్పేశారు. భూగ్రహం వేడెక్కుతున్న ఫలితంగా ‘నీటి కొరత ఒక చోట, పల్లెలను, నగరాలను తేడా లేకుండా ముంచెత్తే తుఫాను వరదలు మరొక చోట’ నిత్య వాస్తవంగా మారిపోయింది. లాభ దాహాలతో పరితపించి పోతున్న కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను స్వాధీనం చేసుకుంటూ ప్రజలు దాహంతో పరితపించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే కాసింత రంగు కలిపి మిలియన్లు దండుకుంటున్న కూల్ డ్రింకు కంపెనీల కోసం రైతుల పొలాలు ఎలా బీడుపడతాయి?

ఈ పరిస్ధితి ఒక ప్రాంతానికీ, దేశానికీ పరిమితం అయింది కాదు. ఉప సహారా ఎడారి దేశాల నుండి నీరు తప్ప మరొకటి కనపడని కేరళ మీదుగా రెండేళ్ల నుండి నీటి చుక్క కోసం పరితపిస్తున్న మధ్య, పశ్చిమ అమెరికా వరకూ ఇదే పరిస్ధితి. ప్రపంచంలో ఎక్కడ చూసినా నీటి కష్టాలు ఆడపిల్లలు, మహిళలనే అంటిపెట్టుకుని ఉండడం కొట్టవచ్చినట్లు కనిపించే సాపత్యం.

ఇదిలా ఉండగానే ధనికులు ఆటవిడుపు కోరుకుంటే వారి సరదా ఆటల కోసం నీటికి ఎప్పుడూ కొరత ఉండదు. బాత్ టబ్ ల నుండి స్విమ్మింగ్ పూల్స్ వరకూ, రోయింగ్ పందేల నుండి గోల్ఫ్ క్రీడల వరకూ కాసులతో కలిసి నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

ఈ ఫొటోలను బోస్టన్ పత్రిక అందించింది.

One thought on “నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు

వ్యాఖ్యానించండి