ఆదాయపన్ను ఎగవేయడం కోసం మత విశ్వాసాలను కూడా కాలదన్నుకుంటున్న విచిత్ర పరిస్ధితి! ఆ ట్రస్టు కార్యక్రమాలన్నీ మతపరమైనవే. కానీ ఆదాయపన్ను మినహాయింపు కోసం హిందూమతాన్ని మతం కాదనీ, హిందువులు మతావలంబకులు కాదని వాదిస్తోంది. శివుడు అసలు దేవుడే కాదని, ఆ మాటకొస్తే దేవుడి శిల్పాలు ఉన్నంత మాత్రాన అది దేవాలయం కాదని కూడా ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఐ.టి. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ వాదనను అంగీకరించి ఆదాయపన్ను శాఖ అధికారుల వాదనలు కొట్టిపారేయడం.
ఈ విచిత్రమైన కేసు మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని ‘శివ మందిర్ దేవస్ధాన్ పంచ్ కమిటీ సంస్ధాన్‘ వారు తమ ఖర్చులకు ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఇవ్వడానికి నాగపూర్ ఆదాయపన్ను శాఖ కమిషనర్ అంగీకరించకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా ఐ.టి. అప్పిలేట్ ట్రిబ్యునల్ కి వెళ్లారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ట్రస్టుకి అనుకూలంగా తీర్పు ప్రకటించి సంచలనం సృష్టించింది. ట్రిబ్యూనల్ తీర్పు ఆర్ఎస్ఎస్ లాంటి హిందూ మత సంస్థల ‘విశ్వాస సిద్ధాంతానికి‘ విరుద్ధంగా ఉండడం గమనార్హం.
ట్రస్టు పెడుతున్న ఖర్చుల్లో 5 శాతం కంటే ఎక్కువగా మతపరమైన ఖర్చుల కిందికి వస్తాయని ‘ఆదాయ పన్ను చట్టం, 1961, సెక్షన్ 80G(5)(vi) ప్రకారం కేవలం ధార్మిక సంబంధమైన ఖర్చులకు మాత్రమే ఆదాయపన్ను నుండి మినహాయింపు వర్తిస్తుందని, మతపరమైన ఖర్చులకు కాదని, నాగపూర్ కమిషనర్ చెబుతూ పన్ను నుండి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించాడు.
భవన నిర్వహణ ఖర్చులు, ఉచిత భోజన ఖర్చులు, పండగలప్పుడు ఉచితంగా పూజలు చేయడం మొదలైన ఖర్చులను మతపరమైన ఖర్చులుగా ఆదాయపన్ను శాఖ కమిషనర్ లెక్కించాడు. ట్రస్టు తరపున టైలరింగ్ శిక్షణ, యోగా శిక్షణ ఇవ్వడం, కళ్ళద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం తదితర ఖర్చుల కోసం ట్రస్టు చేసిన రు. 82,977 ల ఖర్చు కూడా మతపరమైన ఖర్చుగా ఆయన లెక్కించాడు. కేవలం రు. 6,700 మాత్రమే మతేతర ఖర్చుగా లెక్కించి మతపరమైన ఖర్చుకి పన్ను నుండి మినహాయింపు లేనందున పన్ను కట్టాలని డిమాండ్ పుట్టించాడు.
ఆదాయపన్ను కమిషనర్ వాదనను అప్పిలేట్ ట్రిబ్యునల్ తిరస్కరిస్తూ ఇలా పేర్కొంది. “సాంకేతికంగా చూస్తే, హిందూయిజం మతం కాదు. హిందువులు కూడా ఒక మతాన్ని పాటిస్తున్న సమూహం కిందికి రారు. కాబట్టి శివుడు, హనుమాన్, దుర్గ తదితరులను పూజించడానికి పెట్టే ఖర్చులు గానీ, దేవాలయాల నిర్వహణ కోసం అయ్యే ఖర్చులు గానీ మతపరమైన ఖర్చుల కిందికి రావు. వారంతా (ఆ దేవుళ్లు, దేవతలంతా) ప్రపంచానికి అధినేతలైన అతీత శక్తులుగా (superpower of the universe) మాత్రమే పరిగణించబడుతున్నారు”
ఐ.టి. అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులైన పి.కె.బన్సాల్ (అకౌంటెంట్ సభ్యుడు), డి.టి.గరాసియా (జ్యుడిషియల్ సభ్యుడు) ఈ తీర్పు ప్రకటించారు. వాళ్ళు ఇంకా ఇలా అంటున్నారు, “హిందువులు వివిధ దేవుళ్లను వివిధ రకాలుగా పూజించే అనేక కులాలకు (కమ్యూనిటీలకు) చెందినవారని ఐ.టి. కమిషనర్ తెలుసుకోవాలి. వారు భిన్న రకాలైన ఆచారాలను, నీతి శాస్త్రాలను పాటిస్తారు. (ఆ మాటకొస్తే) హిందూయిజాన్ని తన జీవిత విధానంగా స్వీకరించిన వ్యక్తి అసలు దేవుడిని పూజించవలసిన అగత్యం (not essential) కూడా లేదు.”
ట్రిబ్యునల్ తీర్పులోని కొంత భాగాన్ని itatonline వెబ్ సైట్ అందించింది. దాన్ని కింద చూడవచ్చు.
The objects of the assessee is not for advancement, support or propagation of a particular religion. Worshipping Lord Shiva, Hanumanji, Goddess Durga and maintaining the temple is not advancement, support or propagation of a particular religion. Lord Shiva, Hanumanji & Goddess Durga do not represent any particular religion. They are merely regarded to be the super power of the universe. Further, there is no religion like “Hinduism”. The word “Hindu” is not defined in any of the texts nor in judge made law. The word was given by British administrators to inhabitants of India, who were not Christians, Muslims, Parsis or Jews. Hinduism is a way of life. It consists of a number of communities having different gods who are being worshipped in a different manner, different rituals, different ethical codes. The worship of god is not essential for a person who has adopted Hinduism way of life. Therefore, expenses incurred for worshipping of Lord Shiva, Hanuman, Goddess Durga and for maintenance of temple cannot be regarded to be for religious purpose
(Emphasis is not mine –Visekhar)
అసలు భారత దేశంలో, అందునా శివ సైనికులు తాండవమాడే మహారాష్ట్రలో, అది కూడా ‘మాతో శ్రీ‘ (బాల్ ధాకరే నివసించిన ఇల్లు) గోడలు నిలిచిన ముంబై గడ్డ పైన హిందూమతం గురించి ఇలాంటి వాస్తవిక(!) తీర్పు ఎవరైనా ప్రకటించగలరా? ఆదాయపన్ను ఎగవేయడానికి ఉద్దేశించింది కాబట్టి, అది కూడా ఒకానొక హిందూ మత ట్రస్టే స్వయంగా ఈ తీర్పును కోరుకున్నది కాబట్టి ఐ.టి. అప్పిలేట్ ట్రిబ్యూనల్ సభ్యులు ఇద్దరు ఇంకా బతికి బట్ట కట్టారు గాని, మరొక సందర్భంలోనైతే, అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ పాటికి వారి కార్యాలయం శివ సైనికుల చేతుల్లో ఆనవాలు అనేది లేకుండా ధ్వంసం అయి ఉండేది కాదా?
ప్రస్తుత సందర్భంలోని శివ మందిర్ దేవస్ధాన్ పంచ్ కమిటీ ట్రస్టు వారు తాము మత సంబంధమైన కార్యక్రమాలలో ఉన్నామని తమ పేరు ద్వారానే చెబుతున్నారు. శైవులు హిందూయిజంలో ఒక ప్రబలమైన శక్తిగా, శాఖగా వైరి మతస్థులయిన వైష్ణవులతో జగడాలాడి పీకలు తెగ్గోసుకున్న చరిత్ర కలిగినవారే కదా. అలాంటివారు మతావలంబకులు కాకుండా ఎలా పోయారు? పన్ను కట్టాల్సి వస్తే దేవుళ్లు, దేవుళ్లు కారు, మతము మతమూ కాదా? ఊహాజనిత విశ్వాసాల ఆధారంగా అధికారం కావాల్సి వస్తే మాత్రం ప్రపంచంలోనే గొప్పది హిందూ మతం అంటూ వీరాలాపాలా?
ఇంతకీ ఐ.టి.ఎ.టి (Income Tax Appellate Tribunal) ఇచ్చిన తీర్పుకు ఆర్ఎస్ఎస్ పరివారం అంగీకరిస్తుందా? హిందూమతం అసలు వాస్తవానికి మతమే కాదని వారు అంగీకరిస్తారా? అనేక కులాల వారు, తెగల వారు తమకు మాత్రమే ప్రత్యేకమైన సాంప్రదాయాలలో తమకు నచ్చిన, తాము మెచ్చిన దేవుళ్లను, దేవతలను పూజించే భిన్న సమూహాల కలయికే హిందూమతం, కాదు, కాదు…, హిందూయిజం అని వారు అంగీకరిస్తారా? అంగీకరిస్తే గనుక ఇక బాబరీ మసీదుని పునర్నిర్మించడమే తరువాయి!

మన దేశంలో ఉన్నవి న్రిటిష్‌వాళ్ళు వ్రాసిన చట్టాలే కానీ మత చట్టాలు కాదు. మతం గురించి ఏ న్యాయమూర్తైనా నోటికొచ్చిన తీర్పు చెప్పగలడు.
hinduism matam kaadu,endukante idi e okka vyakthi tho aarambhinchabadaledu.idi oka dharmam,ante.ee matam lo e devudinainaa poojinchukovachchu.poojinchakapoyinaa nashtam ledu.vaidika dharmam ane peru correct gaa suit avuthundi.
Even ancient Greeks wirshipped many gods. If Hinduism is not a religion, then Hindus should agree to have exogamous marriages with muslims.
This is not a new judgement. In past a court declared that Shirdi Saibaba was not a Hindu and permitted Shirdi Sai Trust to evade taxes. Now an another court judged that Hinduism is not a religion to permit Siva devotees to evade taxes.
My latest audio on religion: http://ubuntuone.com/1Ped6OMwguZq8md00tEviu
It is difficult to type Telugu on phone. So I had recorded the audio:
http://ubuntuone.com/1UNmJNQRZ9WOWeJD6cMbTL
hinduvulu muslims ni marrage cheskovadaniki evariki abyantaram undadu kani vaallu muslims loki convert avvakunda maradaniki accept chestara… cheyyaru… vaalla devudini tappa evarini poojinchakudadu ani object chestaru… so it is not possible to marry a muslim….
Islamic shariah permits to marry a Christian or Jew but not to marry a person who belongs to non-Abrahamic religion. Vaishnava Hindus do not even marry Saiva Hindus. Both of those sects claim themselves as different religions. But the court declared that Hinduism is not at all a religion and permitted to do business in the name of it.
1. హిందూయిజం మతమా ధర్మమా అని తేల్చేపని ఆదాయప్పన్నుశాఖవారిది కాదు.
2. మతం అనేది ‘నీయబ్బ’ లాంటి పదమైతే, ధర్మం అనేది ‘మీనాన్నగారు’ లాంటి పదం. హిందూయిజాన్ని ధర్మమనుకున్నా, మతమనుకున్నా వచ్చేది, పోయేది ఏమీఉండదు. అదేదో హిందూయిజం మాత్రమే ధర్మమని, మిగతావి ధర్మాలుకావనీ (అధర్మమనీ) కొందరు చేసే “ఒక ప్రామాణిక గ్రంధంలేదు”, “ఒక సాంప్రదాయంనుండీ పుట్టిందికాదు” తరహా వాదనలనుండీ జాగ్రత్తగా ఉండాలి. ఇది హిందూమతానికి కొత్తరంగుపూయడంతప్ప మరింకోటికాదు.
3. ఇక దేవాలయాలపై పన్ను విషయానికొస్తే, ముస్లిములదేవాలయాలకీ, క్రైస్తవులదేవాలయాలకీ లెని పన్ను హిందువుల దేవాలయాలకి మాత్రం ఉండాల్సిన అవసరంలేదని నా అభిప్రాయం. ఏ మతస్తులైనా తాము పంగనామాలు పెట్టించుకోవాలని నిర్ణయించేసుకుంటే ప్రభుత్వం వాళ్ళని బాగుపరచాల్సిన అవసరంలేదు. అది ఆయామతస్తుల ఖర్మం. ప్రభుత్వం అవన్నీ అనవసరం, చవకబారుతనం, మూర్ఖత్వం, దేవుడిదగ్గర ముష్టెత్తుకోవడంతో సమానం అన్నభావన కలిగించాలేతప్ప ప్రభుత్వమే ఆడబ్బుకోసం అంగలార్చే పరిస్థితి రాకూడదు.
మన పాలక వర్గంవాళ్ళు తయారు చేసిన చట్టాల ప్రకారం హిందూ మత సంస్థలైనా, క్రైస్తవ మత సంస్థలైనా టాక్స్‌లు కట్టాల్సిందే. కానీ కంటికి కనిపించే నిజాన్ని కూడా నమ్మనట్టు నటించే అధికారం కోర్ట్‌కి ఉంది కనుక షిర్డీ సాయిబాబా హిందువు కాదనీ, శివుడు దేవుడు కాదనీ, ఇలా నోటికొచ్చిన తీర్పులు చెప్పడం జరుగుతోంది.
మూఢ నమ్మకాలకి కొత్త భాష్యం చెప్పడం ప్రతి చోటా ఉంది. ముప్పై ఏళ్ళ క్రితం డా. కొమ్మూరి వేణు గోపాలరావు అనే MBBS డాక్టర్ చేతబడులు ఉన్నాయని నిరూపించడానికి ప్రయత్నించాడు. మంత్రాలు చదివినప్పుడు గాలిలో తరంగాలు ప్రసరితమవుతాయనీ, ఆ ప్రసరణ వల్ల చేతబడి జరుగుతుందనీ వాదించాడు. ఆయన్ని రంగనాయకమ్మ గారు తీవ్రంగా విమర్శించారని ఆయన ఆవిడ మీద కోర్ట్‌లో కేస్ వేశాడు. రంగనాయకమ్మ గారు ఆయనకి 20 వేలు నష్టపరిహారం కట్టాలని కోర్ట్ తీర్పు చెప్పింది. తాను హైకోర్ట్‌కి వెళ్తానని ఆవిడ అంటే పది వేలు ముందు కట్టి తరువాత హైకోర్ట్‌కి వెళ్ళమని తీర్పు వెలువడింది. “ఇండియాలో ఉన్నవి మత చట్టాలు కావనీ, అవి బ్రిటిష్‌వాళ్ళు వ్రాసిన చట్టాలనీ, కనుక మతాన్ని విమర్శించడం తప్పు కాదనీ” రంగనాయకమ్మ గారి తరపు లాయర్ వాదించాడు. ఆవిడ మీద వెయ్యబడిన క్రిమినల్ కేస్‌నైతే రద్దు చేశారు కానీ నష్ట పరిహారం కేస్ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. పెండింగ్ కాలంలోనే ఆ కేస్ వేసిన వేణుగోపాలరావు చనిపోవడం కూడా జరిగింది.
హిందూ మతం ఒక మతం కాదనీ, అది ఒక జీవన విధానమనీ సుప్రీమ్ కోర్ట్ అందమైన భాష్యం చెప్పిన తరువాత హిందూ చాంధసవాదులకి కొత్త రక్తం ఎక్కినట్టు అయ్యింది. హిందూ భావజాలం అనేది పాతదే. వాళ్ళకి కలిగిన ఉత్సాహం మాత్రం కొత్తది.
It is not the duty of the supreme court to judge whether Hinduism is the religion or the way of life. These are just individual beliefs and these opinions do not depend on laws or court judgements.
మూర్ఖునితో వాదిస్తే చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది కనుక ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌వాళ్ళు కోర్ట్‌లో ప్రతివాదులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన ఆ డిపార్ట్‌మెంట్‌వాళ్ళు ఓడిపోయినట్టు కాదు. అయినా హిందూ మతం ఒక మతం అని నిరూపించడం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌వాళ్ళ బాధ్యత కాదు. అటువంటప్పుడు ఆ పని మీద ఆ డిపార్ట్‌మెంట్‌వాళ్ళు ఎలా శ్రద్ధ్ర పెడతారు? మూడు కాళ్ళ కుందేళ్ళు ఉన్నాయని నమ్మే న్యాయమూర్తులు కూడా ఉన్నప్పుడు ఆ శ్రద్ధ ఉన్నా ప్రయోజనం ఉండదు. ఏనుగుకి దంతాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ కోర్ట్‌లో మన ప్రతివాది అవి దంతాలు కావనీ, కొమ్ములనీ అంటాడు. అవి కొమ్ములు కావని నిరూపించుకోవలసిన బాధ్యత మనదేనని అంటాడు. అలాంటి వాళ్ళతో వాదనలకి దిగితే కోర్ట్ ఉద్యోగులకి టికెట్ లేని కామెడీ సినిమా చూపించినట్టు ఉంటుంది కానీ మనకేమీ రాదు. హిందూ మతం ఒక మతం కాదనీ, అది ఒక జీవన విధానమనీ, ఇలా సాధారణ ప్రజలకి అర్థం కాని నాన్ సెన్స్ ఏదో ప్రతివాదులు మాట్లాడుతోంటే ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు సమాధానం చెప్పకుండా నోరుమూసుకున్నది ఇందుకే.
సోషియాలజీ చదివిన వ్యక్తిగా నేను చెప్పేది ఏమిటంటే “మెక్సికోలోని గ్రామీణ ప్రాంతాలలో పేరు లేని మతానికి చెందిన వాళ్ళు చేస్తున్న విగ్రహారాధన కూడా లాజికల్‌గా మత వ్యవహారమే అవుతుంది. అసలు మతమే లేని ఆటవిక సమాజాలు కొన్ని ఉన్నాయి. మతంతో సంబంధం లేని జీవన విధానం అనేది ఉంటే అక్కడ ఉంటుంది. వేదాలు వ్రాయగలిగేంతగా చదువు నేర్చినవాళ్ళు నమ్మేది మతమే కానీ అది మతంతో సంబంధం లేని జీవన విధానం మాత్రం కాదు” అని.
జోక్ కాదు, సీరియస్‌గా చెపుతున్నాను. కోర్ట్‌లో నేనైనా ఈ నిజాలు మాట్లాడితే కేస్‌తో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నానంటూ నన్ను కోర్ట్ నుంచి బయటకి గెంటేస్తారు. నిజంగా అసంగతమైన విషయాలు మాట్లాడేవాళ్ళకి మాత్రం అనుకూలంగా తీర్పులు చెపుతారు. మన దేశంలో న్యాయస్థానాల వ్యవహారం ఇలాగే ఉంది.