‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం


ఫొటో: రీడిఫ్

ఫొటో: రీడిఫ్

గుజరాత్ స్త్రీల పోషకాహార లోపానికి ఎవరూ ఊహించలేని కారణం కనిపెట్టి అటు సామాన్యులను, ఇటు శాస్త్ర పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నరేంద్ర మోడి ఈసారి సెక్యులరిజం కు కొత్త నిర్వచనం కనిపెట్టారు. సెక్యులరిజం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇండియాను మొదటి స్ధానంలో నిలబెట్టడం అనీ, అన్ని మతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తే అదే సెక్యులరిజం అనీ ఆయన నిర్వచించారు.

బిజెపి విదేశీ మిత్రులు (Overseas Friends of BJP) ఏర్పాటు చేసిన వీడియో ప్రసంగం ద్వారా సెక్యులరిజంకు మోడి తనదైన సొంత నిర్వచనం ఇచ్చారు. తన ముస్లిం విద్వేష విధానాలను కప్పిపుచ్చుకోవడానికి శాస్త్రీయ సామాజిక పదజాలానికి సైతం సరికొత్త నిర్వచనాలు ఇవ్వచ్చని మోడి దీని ద్వారా సందేశం ఇస్తున్నారు.

“సెక్యులరిజం కు నా నిర్వచనం చాలా సింపుల్: ఇండియా ఫస్ట్‘. మీరేమి చేసినా, ఎక్కడ పని చేస్తున్నా, భారత పౌరులందరికీ భారత దేశానికే ఉన్నత ప్రాధాన్యత ఉండాలి… అన్ని మతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా దేశాన్ని నిలపాలి… భారతీయుడుగా నేను దీనికి అంగీకరిస్తున్నాను. భారత దేశాన్ని ప్రేమించే పౌరులుగా మీరు కూడా నా నిర్వచనాన్ని అంగీకరిస్తారు… మనం ఏ పనైనా చెయ్యొచ్చు, ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఇండియాయే సుప్రీం గా ఉండాలి” అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తన ప్రసంగంలో పేర్కొన్నాడు.

“భారత దేశ బాగోగుల కంటే ఏ మాత్రం తక్కువగా మన లక్ష్యం ఉండరాదు. ఇదే జరిగినట్లయితే సెక్యులరిజం అనేది ఆటోమేటిక్ గా మన రక్తంలో ప్రవహిస్తుంది” అని మోడి సెలవిచ్చారు.

కాంగ్రెస్ పార్టీని సూడో సెక్యులరిజం అనుసరించే పార్టీగా నిందించే బిజెపి నాయకులు అసలైన సెక్యులరిజం కు మోడి ఇస్తున్న నిర్వచనాన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు. బిజెపికి చెందిన ఇతర నేతలు ఎన్నడూ ఈ విధమైన నిర్వచనాన్ని ఇచ్చినట్లు లేదు.

మోడి నిర్వచనం ప్రకారం సెక్యులరిజం అనేది దేశంలో ప్రజల మధ్య, పాలకుల పాలనలో, ప్రభుత్వాల విధానాల్లో ఉండవలసిన అవసరం లేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని పాడుకుంటూ భారత్ మాతా కి జై అని నినదిస్తూ తామే గొప్ప సెక్యులరిస్టులం అని పొంగిపోవచ్చు. న్యూటన్ మూడో సూత్రం చెప్పి వేలాది ముస్లిం ప్రజలను ఊచకోత కోసినా, మరెంతోమంది ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసినా అది పెద్ద లెక్కలోది కాదు. మతం పేరు చెప్పి ఎంతమందిని చంపినా ఇండియా ఫస్ట్ కోసమే అలా చేశామని చెబితే సరిపోతుంది. ఇక మనం సెక్యులరిస్టులమే.

ఇంతకీ సెక్యులరిజం కి నిర్వచనం ఏమిటి? ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇలా చెబుతోంది.

Definition of secular

adjective

 1. denoting attitudes, activities, or other things that have no religious or spiritual basis:

  secular buildings

  secular moral theory

  Contrasted with SACRED.

 2. Christian Church (of clergy) not subject to or bound by religious rule; not belonging to or living in a monastic or other order. Contrasted with REGULAR.

ఆక్స్‌ఫర్డ్ ప్రకారం సెక్యులరిజం అనేది ఒక దేశంలోని లేదా ఒక సమాజంలోని ప్రజల జీవన విధానానికి సంబంధించినది అని స్పష్టంగా అర్ధం అవుతోంది. ముఖ్యంగా మత సంబంధమైన భావోద్వేగాలు ప్రజల మధ్య సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న పరిస్ధితుల్లో వాటికి విరుగుడుగా లౌకిక విధానం ఉనికిలోకి వచ్చింది.

మత విశ్వాసాలను వ్యక్తిగత జీవనానికి పరిమితం చేయాలని సెక్యులరిజం చెబుతుంది. తన మత విశ్వాసాన్ని తాను నమ్మడానికి ఒక వ్యక్తికి హక్కు ఉన్నట్లే ఇతరులకు కూడా తమ తమ విశ్వాసాలను నమ్ముకునే హక్కు ఉంటుందన్న విషయాన్ని ఆ వ్యక్తి గుర్తించాలని చెబుతుంది. ఇతరుల మత విశ్వాసాలను కూడా గౌరవించాలని లౌకిక విధానానికి అనుబంధంగా అభివృద్ధి అయిన భావజాలం చెబుతుంది. ఇతరులతో సంబంధంలోకి వచ్చేటప్పుడు ఇటువంటి పరస్పర గౌరవభావం మనుషులు తమ మత విశ్వాసాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించడానికి వీలు కల్పిస్తుంది.

రాజ్యం, ప్రభుత్వం మొదలయిన వ్యవస్థల పని విధానంలో లౌకిక విధానం ఉన్నతమైన పాలనా పద్ధతులను ఆచరణలోకి తెచ్చింది. రాజ్యానికి గానీ, రాజ్యం యొక్క ఇతర అంగాలైన ప్రభుత్వం, కోర్టులు, సైన్యం, పోలీసులు, బ్యూరోక్రసీ తదితర వ్యవస్థలు నిర్దిష్టంగా ఏ మతం వైపు మొగ్గు చూపరాదని, ఏ మతాన్నైనా అవలంబించే హక్కుని పౌరులకు కల్పిస్తూనే తాము మాత్రం మత ఆచరణలకు దూరంగా ఉండాలని లౌకిక విధానం చెబుతుంది. కొందరు దీనిని ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఆదరించాలని చెప్పడంగా లౌకిక విధానంకు అర్ధం చెప్పబోతారు. కానీ అది వాస్తవం కాదు. లౌకిక రాజ్యం అనేది తాను నిజంగా లౌకిక విధానాన్ని అవలంబిస్తే అది ఏ మతాన్ని అనుసరించదు; అలాగని ఏ మతాన్ని ద్వేషించదు. లౌకిక రాజ్యం మత విశ్వాసాలకు దూరంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

అయితే ఆచరణలో లౌకిక విధానం అర్ధాన్నే భారత దేశ రాజకీయ పార్టీలు మార్చేశాయి. కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రధాన బాధ్యురాలు. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసిన మోసపూరితమైన లౌకిక విధానాన్ని అనుసరిస్తున్నందున ఇప్పుడు కాంగ్రెస్ ని ప్రత్యేకంగా నిందించి ప్రయోజనం లేదేమో.

నిజానికి ప్రజలను వారి మానాన వారిని బ్రతకనిస్తే వారికంటే మించిన లౌకిక ఆచరణవాదులు మరొకరు ఉండరు. దేశ వనరులను పంచుకుని తినడానికి వీలు కల్పించే రాజకీయ అధికారాన్ని సంపాదించడానికి పార్లమెంటరీ ప్రాతినిధ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఆధిపత్య పాలకవర్గాలు తమ మధ్య తగాదాలను ప్రజల పైన రుద్దే క్రమంలో వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య అనేక రకాల తగవులను రేపారు. ఫలితంగా ప్రజల సహజ లౌకిక జీవనం చిన్నాభిన్నం అయిపోయింది.

ఆ పాలకులే ఇప్పుడు మానవ నాగరికత అభివృద్ధి చేసుకున్న లౌకిక జీవన విధానానికి సరికొత్త నిర్వచనాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలోకి, పాలనా వ్యవస్థలలోకి చివరికి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఫలితమైన ఉపగ్రహ ప్రయోగాల లోకి కూడా మతపరమైన ఆచరణలను ప్రవేశపెట్టి తద్వారా లౌకికవాదాన్ని అపహాస్యం చేసిన పాలకులు ఇపుడు అర్ధాలు కూడా మార్చడానికి సిద్ధపడడం అత్యంత విషాదం. అప్రమత్తంగా ఉండి వీరి మాయోపాయాలను తిరస్కరించడం ప్రజల కర్తవ్యం.

13 thoughts on “‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం

 1. పింగ్‌బ్యాక్: ‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం

 2. ప్రస్తుతం ఈయన టైం నడుస్తుంది కాబట్టి, ఏం వాగినా చెల్లుతుంది. నిన్నటి దాకా గుజరాత్ ఫస్ట్ అనే వాడు, ఇప్పుడు ప్రధానమంత్రి పదవిపై కన్నేసి ఇండియా ఫస్ట్ అంటున్నాడు. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక వాదానికి తూట్లుపొడిచి దేశాన్ని ఇంకేం ఉద్దరిస్తాడో. సుప్రీంకోర్టు ద్వారా అత్యధికంగా తిట్లు తిన్న వారి లిస్టు తయారుచేస్తే మొట్టమొదటి పేరు ఈ ప్రబుద్ధుడిదే ఉంటుంది. చూద్దాం.. ఈ శిషుపాలిడి హవా ఎన్నాల్లు నడుస్తుందో..

 3. nijamgaa india lo secularism undaa?loukika vaadam ante hindu mataaniki vyatirekamgaa,itara mataalaku anukoolamgaa undatamenaa?modi thappemi undi?sikhs meeda daadulu jaripina congress maatram loukikavaada party?

 4. ధరణిజ గారు, మీ ప్రశ్నలకు సమాధానాలు ఆర్టికల్ లోనే ఉన్నాయి కదా! కాంగ్రెస్ ది మోసపూరిత లౌకిక వాదం అని కూడా చెప్పాను. మీరు గమనించినట్లు లేదు.

 5. డౌట్ లేదు, మోడ్ నే మన నెక్స్ట్ ప్రధాన మంత్రి.
  అత్యంత క్రమ శిక్షణ కలిగిన అర్ ఎస్ ఎస్ నుండి వచ్చి, పెళ్లి కూడా చేసుకోకుండా దేశసేవ కి అంకితమైన అలంటి నాయకుడు కన్నా వేరే ఎవరు ఉన్నారు. ఏ ఒక్క నాయకుడు కుడా అవినీతి మచ్చ లేకుండా లేదు ఈ రాజకీయాలలో.
  ఇప్పుడు మనకి ఉన్న ఒకే ఒక్క ఆశ మోడీ మాత్రమే.
  కులం, మతం కన్నా, దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పడం లో తప్పేం ఉంది.
  ఇంకా ఎన్నాళ్ళు ఈ బుజ్జగింపులు రాజకీయాలు, అవినీతి నాయకులు.
  రౌతు మెత్తనిదైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుందని ఒక సామెత ఉంది, అలా, ఎవడు ఎంత కావాలంటే అంత బొక్కడమే గా మన గొప్ప. ఇరవై నాలుగు గంటలు కరెంటు , ప్రతీ పని లో పారదర్సకత , అవినీతి తక్కువ . ఇంకేం కావాలి, ఇవన్ని ఉంటె, ఉచితంగా ఇవ్వకపొయినా ఒక వ్యక్తీ అభివృద్ధి చెందుతాడు. ఉచితంగా ఇచ్చి సోమరిపోతులు గా చేయడం కన్నా , కష్టపడితే ఎదగచ్చు అన్న నమ్మకం కలగజేయడమే ముఖ్యం.
  ఈ మధ్యన లోకల్ ఎన్నికల్లో , ముస్లిం లు ఉన్న స్థానాల్లో bjp విజయం సాధించింది. ఇప్పటి వరకు జరగని అభివృద్ధి అక్కడ జరిగిందని వాళ్ళే స్వయంగా చెప్పారు కుడా. ( పేరు గుర్తు లేదు ).

 6. “కులం, మతం కన్నా, దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పడం లో తప్పేం ఉంది.”

  సురేష్ గారు, అసలు తప్పు లేదు. కాని సెక్యులరిజం కు అర్ధం మార్చెయ్యడంలో మీకు తప్పు కనపడలేదా? కరసేవకులను తగలబెట్టిన దోషులను పట్టుకుని శిక్షించగల అధికారం చేతుల్లో ఉంచుకుని వందలమంది అమాయక ప్రజలను ఊచకోత కోయించడంలో తప్పు లేదంటారా? మత విద్వేష రాజకీయాలు నెరుపుతూ ఆ రాజకీయాల ఆధారంగానే అధికారంలో కొనసాగుతూ ఇప్పుడు ప్రధాన మంత్రి పదవి కోసం ‘నేను కుల మతాలకి అతీతం’ అని కబుర్లు చెప్పడం మోసం కాదా?

  మోడీ అండతోనే గుజరాత్ లో మూకలు ఊచకోతకు తెగబడ్డాయని చెబుతున్న ముస్లింల హృదయవిదారక కధనాలు ఎన్ని పత్రికలు చెప్పలేదు. స్వయంగా ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్ధల నాయకులే తాము ఎలా ముస్లిం ప్రజలను ఊచకోసిందీ, కోయించిందీ తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ లో చెప్పినా నమ్మరా? మోడి అభయహస్తం తోటే తాము హత్యలకు తెగబడ్డామని చెప్పిన వీడియోలు బైటికి వచ్చినా ఇంకా అదే భ్రమల్లో కొనసాగుతామంటే చేసేదేముంటుంది?

  మసీదు కూల్చి రాముడికి గుడి కట్టాలంటే హిందువుల విశ్వాసాలు చెబుతారు. మోడి గొప్పతనం చెప్పాలంటే ముస్లింల సాక్ష్యాలు కూడా తెస్తారు. కాని మోడి దోషిత్వం గురించి దిక్కులు పిక్కటిల్లేలా సామాన్య ముస్లిం జనం అరుస్తున్నా ఆ కేకలు ఇంకేవో అవుతాయి తప్ప సాక్ష్యాలు మాత్రం కావేమి?

 7. modi gujarat ni eraga choopi dheshanni kabalinchali ani choostunnaru,modi tharaha develepment partiality tho kudukunnadhi. gujarat muslim students ki central govt ichhe scholorship ni kuda aapalani chusaru..mari veeru samajanni ye model ga develep cheyyalanukunnaru,dhalithulanu ,muslims ni cristians ni ee dhesham lo antaraanivariga cheyyalanu kuntunnaru. modi lo leader ledu , vichinnakarudu vunnadu.

 8. మోడీకి పెళ్ళైంది, కాని భార్యని వదిలేశాడు. ఆవిడ భార్య గుజరాత్లోనే ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. ఆవిడకి అటు విడాకులు ఇవ్వకుండా, ఇటు దగ్గర తీయకుండా వదిలేయడం ఏ రకం శాడిజమో మరి. ఈవిషయం తెలీకుండా, అతను పెళ్ళి చేసుకోకుండా దేశ సేవ చేస్తున్నాడహో అని చాటింపు వేసే వారిని ఎవరూ బాగు చేయలేరు..
  సరే, ఇక విషయానికి వస్తే, దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి… మహిళల హక్కులు మరియు, సమానత్వం పై మీ అభిప్రాయం ఏంటని అడిగితే -India first అంటే ఎలా ఉంటుంది. దళితులపట్ల వివక్ష గురించి అడిగితే -“India first” అంటే ఎలా ఉంటుంది. ఆ పక్క నీటి కోసం కర్నాటక,తమిల్నాడు కొట్టుకుంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే -“India first” అంటే.. సెక్యులరిజం మీద తన అభిప్రాయం చెప్పడానికి ధైర్యం లేకో, మొఖం చెల్లకో అతనొక తలతిక్క సమాధానం ఇస్తే… అబ్బా ఏం చెప్పాడ్రా అని పరవశిస్తున్నారు కొందరు అమాయకులు. సెక్యులరిజం విలువేమిటో పాకిస్తాన్,బంగ్లాదేష్ లలోని హిందువులు,క్రిష్టియన్లకి, భారత్లోని మైనారిటీలకు తెలుస్తుంది. అదేంటో తెలీని వ్యక్తి దేశానికి ప్రధాని ఐతే.. ఇక అంతే సంగతులు..

 9. Development is not the reason for the victory of Modi. Over confidence on secularism made the Congress unable to defeat the Modi. Gujarat is not a developed state. The practice of manual scavenging (cleaning toilets with naked hands) still exists in Gujarat. The Modi model development is just a hype propaganda. But we should remember that neigther religion nor secularism are parts of real life and neither BJP nor Congress gain any thing by those ideals.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s