–
‘Owner’s pride, neighbor’s envy.’ ఒనిడా టి.వి ప్రవేశపెట్టిన ఈ నినాదం దాదాపు సామెతగా మారిపోయింది. రాజకీయ, సామాజిక పరిస్ధితుల గురించి మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇది సామెతగా చొరబడిందంటే అతిశయోక్తి కాదేమో! యు.పి.ఎ-2 ప్రభుత్వ పాలనలో వెల్లివిరుస్తున్న కుంభకోణాల జాతరను ప్రతిపక్ష పాలక వర్గాలు అసూయతో ఎలా వీక్షిస్తున్నదీ ‘ది హిందు’ కార్టూనిస్టు సురేంద్ర ఈ ‘సామెత కానీ సామెత’ ద్వారా ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు.
బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను ఎలా మలుపు తిప్పిందీ అందరికీ తెలిసిన విషయమే. యుపిఎ -2 ప్రభుత్వ పాలనలో వరుసగా కుంభకోణాలు వెల్లడవుతున్నా దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోలేని పరిస్ధితుల్లో బిజెపి ఉసూరుమంటోంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సైతం అవినీతి కుంభకోణాలు వరదలై పారడం, సాక్ష్యాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడినే అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం ఈ పరిస్ధితికి ఒక కారణం. కానీ రాష్ట్రాల్లో అధికారం ఉంటే చేయగల అవినీతికి, కేంద్రంలో అధికారం ఉన్నపుడు చేయగల అవినీతికి మధ్య ఉన్న తేడా స్పష్టమే. బొగ్గు లాంటి వనరులు రాష్ట్రాల చేతుల్లో ఉన్నప్పటికీ యు.పి.ఎ-2 అసమర్థత(!) వలన బొగ్గు కుంభకోణాన్ని సొమ్ము చేసుకోలేని పరిస్ధితి రాజకీయ పార్టీలకు దాపురించింది. మరో పక్క అధికారంలో ఉన్నవారికి రెగ్యులర్ అవినీతి సొమ్ము వచ్చి చేరుతూనే ఉంది.
వెరసి యు.పి.ఎ-2 పాలనలోని భారీ కుంభకోణాలు అధికార పార్టీ యజమానికి గర్వకారణం అయితే ప్రతిపక్ష పార్టీ పొరుగువానికి అసూయ కారకంగా మారిపోయింది.

Haha nice
జెండాల రంగులు తప్ప…విధానాల్లోనూ, సిద్దాంతాల్లోనూ తేడా లేని రాజకీయ పార్టీల వల్లే ఈ దుస్ధితి.