కొంత బుద్ధి, కొంత జ్ఞానం


బొమ్మలు, సంభాషణల రూపంలో ఉన్న కింది కొటేషన్లను నాకొక మిత్రుడు ఈ మెయిల్ చేశాడు. వీటిని చదివిన వెంటనే నలుగురితో పంచుకోవాలన్న కొరిక బలంగా కలిగింది. “ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విచారం పంచుకుంటే తరుగుతుంది” అంటారు గదా! బహుశా ఆనందం కోవలోకి జ్ఞానం కూడా వస్తుందనుకుంటాను. ఈ బొమ్మలలో వ్యక్తం అవుతున్నది అనుభవజ్ఞులు సమకూర్చిన జ్ఞానం కనుక పంచుకుంటే మరింత ఉపయోగమే కదా!

other side

1)  ఏది నిజం? నిజం అని భావించేవి చాలా వరకు సాపేక్షికమే. ముఖ్యంగా అవి స్ధల, కాలాలకు బంధింపబడి ఉంటాయి. ఆ నిజాన్ని(!) ఈ సంభాషణ చక్కగా వివరిస్తోంది.

అవతలి వైపు

ఇవతలి కోడి: నేను అవతలి వైపుకి ఎలా రాగలను?

అవతలి కోడి: నువ్వున్నది అవతలి వైపే.

understand2) మనం ఒక అర్ధంతో చెబుతున్నపుడు ఎదుటివారు అదే అర్ధంతో స్వీకరిస్తున్నారన్న గ్యారంటీ ఉండదు. ప్రతి వ్యక్తికీ తన చుట్టూ ఉన్న పరిసరాలతో సాపేక్షికమైన తనదైన ఉనికిని కలిగి ఉంటారు. ఆ ఉనికి ద్వారా అతనికి చేకూరిన అవగాహన తోనే అతను పరిస్ధితులను గ్రహిస్తాడు. ఈ కారణం వలన చెప్పేవారికి, వినేవారికి మధ్య ఎంతో కొంత తేడా ఉంటుంది. బ్లాగుల్లో సందేహాలను వెనువెంటనే నివృత్తి చేసుకునే అవకాశం తక్కువ గనుక తరచుగా ఈ తేడా తలెత్తుతూ ఉంటుంది. ఇద్దరికీ ఉన్న స్ధూల మరియు సూక్ష్మ అవగాహనలలో ఏకీభావం ఎంతమేరకు ఉంటే అంత మేరకు వారి మధ్య తేడా తగ్గుతూ ఉంటుంది. ఈ అంశాన్ని ఈ కొటేషన్ క్లుప్తంగా చెబుతోంది.

బాధ్యత

నేను చెప్పేదానికే బాధ్యత వహించగలను కాని దానిని నువ్వు ఎలా అర్ధం చేసుకుంటున్నావు అన్నదానికి నేను బాధ్యత వహించలేను.

fence

3) ఈ బొమ్మలో ఉన్నది చాలా ఆసక్తికరం. బహుశా పర్యావరణ క్షయం కోణంలో కూడా చూడవచ్చు. ప్రకృతి పైన ఆధిపత్యం సాధించిన మనిషి మహా స్వార్ధపూరితంగా వ్యవహరిస్తూ తోటి జీవుల ఉనికికే కాకుండా సొంత ఉనికిని కూడా నాశనం చేసుకుంటున్నాడు. సదరు భావాన్ని ఎంతో ప్రతిభావంతంగా వివరిస్తోంది, సాధారణ గీతలతో కూడిన ఈ బొమ్మ.

కంచె; జంతు రక్షణ

8000 BC: దానిని కంచె అని మనం పిలుస్తాము. జిరాఫీలు, ఇంకా… సింహాలు, ఇంకా…  ఏనుగులు, ఇంకా… వీటన్నింటినీ దూరం పెడుతుంది.

AD 1500: …   …   …

1800: …   …   …

NOW: దానిని ‘జంతు పరిరక్షణ’ అని పిలుస్తాము. జిరాఫీలు, ఇంకా… సింహాలు, ఇంకా… ఏనుగులు, ఇంకా… వీటన్నింటినీ కాపాడుతుంది.

4) మానవుడి దుఃఖానికి కారణం కోరికలే అని బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చుని గ్రహించాడని చిన్నప్పటి పాఠాలు చెప్పాయి. ఈ సంగతినే మరో రకంగా ‘దూరపు కొండలు నునుపు’ అని సామెత రూపంలో కూడా చెబుతారనుకుంటాను. ‘దురాశ దుఃఖానికి చేటు’ అనీ, ‘అందని దానికి ఆశపడవద్దు’ అనీ ఇంకా రక రకాలుగా చెప్పేవాళ్లు ఉన్నారు. ఈ రకాలన్నీ ఒకే విషయాన్ని చెబుతాయని నేనంటే అంగీకరించనివారు బోలెడు మంది. దీనిని ‘దృక్పధంలో తేడాలు’ అనవచ్చా?

boat & land

పడవ; నేల

పడవ ఎక్కేవరకూ: పడవ!

పడవ ఎక్కాక: నేల!

2 thoughts on “కొంత బుద్ధి, కొంత జ్ఞానం

  1. Nice I like the second one
    నేను చెప్పేదానికే బాధ్యత వహించగలను కాని దానిని నువ్వు ఎలా అర్ధం చేసుకుంటున్నావు అన్నదానికి నేను బాధ్యత వహించలేను

వ్యాఖ్యానించండి