నాస్తికులంటే … అదో తిట్టు పదంగా భావించినకాలముంది.
దేవుడూ, భక్తీ, పూజలూ, మొక్కుబడులూ, స్తోత్రాలూ… వీటినిమారుమాటాడకుండా ఆమోదించాలనేమీ లేదనీ; వాటి ఉనికినీ, ప్రయోజనాన్నీ ప్రశ్నించొచ్చనీ, అలా చేసే నాస్తికులు అనేవారు కూడా ఉంటారనీ- ఇదేమీతెలియని తరం ప్రస్తుతం ఉంది!
ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ‘ఈనాడు’లో వచ్చిన ఒక వార్త విశేషంగా అనిపించింది!
దీన్ని ఎంతమంది గమనించారో గానీ, దాని ముఖ్య విషయాలను ఇక్కడ ఇస్తున్నాను.
”ప్రపంచంలో ఏ మతాన్నీ ఆచరించని వారు ఉన్నారు. ఏ మతాన్నీ ఆచరించనివారు ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది. వీరిని నాస్తికులనుకుంటే… వీరు-ప్రతి ఆరుగురిలో ఒకరు!
పీఈడబ్ల్యూ అధ్యయనం తెలిపిన సారాంశమిది.
క్రైస్తవ, ఇస్లాం మతస్థుల సంఖ్య తర్వాత వీరే మూడో అతిపెద్ద సమూహం.
వీరి తర్వాత స్థానం హిందూ మతస్థులది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 కోట్ల మంది హిందువులు ఉన్నారని అధ్యయనం వివరించింది. వీరిలో 97 శాతం భారత్, నేపాల్, మారిషస్‌లలోనే నివసిస్తున్నారు! ”
-Venu Ch (ఫేస్ బుక్; డిసెంబర్ 21, 2012 నాటి పోస్టు నుండి)

ఆలోచించగలిగేవారు 16.3% అన్నమాట. “Intellectual అత్యాచార్”కి గురికానివారి సంఖ్య ఇంత తక్కువగా ఉన్నందుకు విచారంగా ఉంది. :(
మంచి ఆసక్తికరమైన వార్త. ఇక్కడ నాకొక సందేహం. కంచె ఐలయ్య గారు గతంలో ఓ ప్రశ్న వేశారు కదా..? దళితులు, బహుజన వర్గాలు హిందువులు కాదని.
వాస్తవానికి గిరిజనులు, ఆదివాసీలు కూడా లెక్కలోకి రాకూడదు. వాళ్లకి వేరే సంప్రదాయులు ఉంటాయి. ఆ ప్రకారం లెక్కిస్తే ఈ సంఖ్య ఇంకా కొంచెం తగ్గొచ్చు అనుకుంటా.
Though I am an atheist, I disagree with Kancha Ilaiah’s thesis that dalits are not Hindus. Most of the people who sacrifice cows and buffaloes in temples of Koraput district are dalits and tribal. They are also Hindus but their traditions differ from orthodox Hindu practices.