గిరిజనాల పరిస్ధితికి దర్పణం ఈ పాట -వీడియో


భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ దేశ సహజ మౌలిక ఖనిజ వనరులను దేశ ప్రజలకు వినియోగ పెట్టడం మాని తవ్వి విదేశీ కంపెనీలకు ముడి పదార్ధాలుగా దేశం దాటిస్తున్నారు. ఆ క్రమంలో తరాల తరబడి అడవులు, కొండలను నమ్ముకుని బతుకుతున్న పేద గిరిజన రైతు కూలీలు కొంపా, గోడు దోపిడీదారులకు అప్పజెప్పి తమకు పరిచయం లేని మైదాన ప్రాంతాల్లో పని దొరకని ఆకలి బతుకులు వెళ్లదీస్తున్నారు. వారి ఆడపిల్లలు శరీర వ్యాపారంలో బలి అవుతుండగా, మగ పిల్లలు అత్యంత తక్కువ వేతనాలకు వెట్టి చాకిరీ చేస్తున్నారు. “ఈ అడవి మాది, నీరు మాది, ప్రకృతి మాది” అని చెబుతూ “ప్రకృతిని కాపాడేది మేమయితే, అభివృద్ధి పేరుతో దాన్ని నాశనం చేసేది మీరే” అని నిలదీస్తున్న ఈ గిరిజనుల పాట భారతీయ గిరిజనుల పరిస్ధితికి చక్కటి దర్పణం.

వ్యాఖ్యానించండి