పోలీసుల చేతుల్లోకి వెళ్ళిన ఫేస్ బుక్ అసభ్య సంభాషణల కేసు


ఫేస్ బుక్ లో తెలుగు వ్యాఖ్యాతలు మహిళలకు వ్యతిరేకంగా, వారి గుణ గుణాలను కించపరుస్తూ సాగించిన సంభాషణ పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసభ్య వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణించిన మహిళలు విషయాన్ని శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కనీసం 10 మంది మహిళలు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కమిషనర్ గారెని కలిసిన అనంతరం వనిత టి.వి లో సాయంత్రం 7 గంటలకు లైవ్ ప్రోగ్రాంలో ఫేస్ బుక్ వ్యాఖ్యల వ్యవహారంపై చర్చ జరిపినట్లు ‘వీళ్ళకి తల్లి చెల్లి లేరా” అనే పేరుతో ఏర్పాటు చేసిన పేజీ తెలియజేసింది.

‘వీళ్ళకి తల్లి చెల్లి లేరా’ పేజీలో పోస్ట్ చేసిన సమాచారం ఇలా ఉంది:

ఫేస్ బుక్ లో స్త్రీలపై అసభ్య రాతలు రాసిన వ్యక్తులపై ఒక టీంగా కలిసి కమిషనర్ అనురాగ్ శర్మగారిని కలిసి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ చాలా బాగా స్పందించారు. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునేలా సైబర్ సెల్ కు కంప్లయింట్ ను ఫార్వర్డ్ చేశారు. తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం మరియు కృష్ణ మోహన ని ముఖ్య నిందితులుగా మిగతా భజన మండలిని కో-అక్యూజ్డ్ గా పేర్కొన్న ఈ కంప్లయింట్ కేసురూపం దాల్చితే మూడు నుంచీ నాలుగు సంవత్సరాల కారాగారం ఖాయం. ఈ కేసు నుంచీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరిన్ని పరిణామాల్ని వీళ్ళు ఎదుర్కొనేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

కంప్లయింట్ అనంతరం వనిత టి.విలో లైవ్ గా జరిగిన చర్చ రేపు మధ్యాహ్నం 3.30 – 5.00 పున:ప్రసారం చేస్తారు. అందులో మరిన్ని వివరాలు మీకు అవగతమౌతాయి.

తాడేపల్లి లలితా బాల సుభ్రమణ్యం, కృష్ణమోహన్ లను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ చేసిన ఫిర్యాదుకు పోలీసులు అనుకూలంగా స్పందించారంటే కేసు దాదాపు నమోదు అయినట్లే. కేసు పెట్టాలని పోలీసులు నిర్ణయిస్తే దాన్నిక ఎవరూ ఆపలేరు. ఇద్దరూ రాజీపడినట్లు చెప్పినా పోలీసులు పరిగణించకపోవచ్చు.

మరిన్ని స్క్రీన్ షాట్స్

మరిన్ని స్క్రీన్ షాట్స్ కింద చూడవచ్చు. జన విజ్ఞాన వేదిక పామిడిలో ఈ సంఘటనపై ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన మూడు పత్రికల్లో వచ్చినట్లు కింద స్క్రీన్ షాట్స్ లో చూడవచ్చు. అసభ్య సంభాషణలు చేసిన వారి ఫొటోలను ‘వీళ్లకి తల్లి చెల్లి లేరా’ పేజి అందజేసింది. ఆ ఫొటోలు కూడా కింద చూడవచ్చు.

వ్యాఖ్యాతలు వీరే:

శనివారం మహిళలు కమిషనర్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ ను కలిసిన కార్యక్రమాన్ని టి.వి చానెళ్లు ప్రసారం చేశాయి. సదరు దృశ్యాలను కలిగి ఉన్న వీడియోను కింద చూడవచ్చు. ఈ ప్రసారం ఏ చానెల్ చేసిందీ తెలియలేదు.

ఫేస్ బుక్ అసభ్య రాతలపై పోలీస్ కమిషనర్ ను కలిసిన హైద్రాబాద్ మహిళలు

శనివారం వనిత టి.వి లో వచ్చిన చర్చ కార్యక్రమాన్ని ఆదివారం పునః ప్రసారం చేస్తారని పైన ఉటంకించిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. పేజీని ప్రారంభించిన వారు టి.వి చానెళ్లలో పని చేసే మహిళలా జర్నలిస్టులేనని తెలుస్తున్నది. చొరవ తీసుకుని అసభ్య సంభాషణలకు వ్యతిరేకంగా ప్రత్యేక పేజీ సృష్టించి చైతన్యాన్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చిన వారికి ఈ బ్లాగ్ ముఖంగా అభినందనలు.

7 thoughts on “పోలీసుల చేతుల్లోకి వెళ్ళిన ఫేస్ బుక్ అసభ్య సంభాషణల కేసు

  1. ఎవరి యుద్దం వాళ్లే చేసుకోవాలనే భావన ఎంతమేరకు సరైందో, కాదో ఇక్కడ అప్రస్తుతం. కానీ బూతు పలకటమే జీవిత పరమార్థంగా, తమలోని మకిలి,వెకిలి మర్కట చేష్టలనే హీరోయిజంగా భావిస్తూ గత కొన్నేళ్లుగా బ్లాగుల్లో విర్రవీగుతున్నవాళ్లను ఎవరు ఎదుర్కోవాలో వాళ్లే ఎదుర్కున్నారివ్వాళ.

    ఇన్నాళ్లుగా ఇది మంచిదికాదని, కనీస మానవ సంస్కారానికి కూడా ఇవి వ్యతిరేకమని చేసిన సూచనలను అపహాస్యం చేస్తున్న చోటే, ఆ కొద్ది మంది మహిళల సాహస చర్య ఇలాంటి ఘటనలను అడ్డుకోవడానికి ఒక పునాదిరాయిని వేసింది. కొద్దిమందే కావచ్చు. కాని ఈ మహిళల ఐక్యత ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను.

    కేసులు పెట్టడం ద్వారా, జైళ్లకు పంపడం ద్వారా ఇలాంటి సంస్కార రాహిత్యం మారకపోవచ్చు.

    కాని మనం మాట్లాడే ప్రతి మాటకూ, వాడే ప్రతి పదానికీ రేపు, భవిష్యత్తులో కూడా సమాజానికీ, శాసనానికీ జవాబు చెప్పవలసివస్తుందనే ఎరుకను ప్రతి బూతురాయుడికీ కలిగించడానికి ఇలాంటి చర్యలు అవసరమనుకుంటాను. బాధాకరమైన విషయం ఏమిటంటే మానవ సంస్కారంలో భాగంగా మనం నేర్చుకోవలసిన నీతి అమలును సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించడమే.

    ఇప్పుడిక ఎవరూ ఏమీ చేయలేరు. ఇది రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకోవడమే కావచ్చు. కాని చైతన్యంలో మార్పు లేని, రాని దశకు మగవాడు ఎదిగిపోయాడు కనుక ఇప్పుడు వాళ్లు శాసనపరంగానే ఎదుర్కోవాలనుకుంటున్నారు.

    బ్లాగుల్లో వీరంగమాడుతున్న ఆధునిక మృగాళ్లందరికీ ఇదొక గుణపాఠమే అవుతుంది. ఆ పిడికెడుమంది మహిళల చర్య అందరికీ మంచి చేస్తుందని, చేయాలని ఆశ. ఆకాంక్ష కూడా.

  2. I remember Tadepalli’s old comments. In a blog, he commented “If father drinks liquor, it may lead to partial downfall of society and if mother drinks, it may lead to total downfall of society”. He wanted to prove that women play leading role in any downfall.

  3. రాజుగారు, నా బ్లాగులో ఈ “మృగాళ్లు” (మగమృగాళ్లు) అనే పదం వాడినందుకే గతంలో తాడేపల్లి ఓ రేంజిలో విరుచుకుపడ్డారనే విషయం మీకు గుర్తుందనే అనుకుంటున్నా… చూడండి – http://goo.gl/hesdL

  4. తాడేపల్లి, మిగతా నలుగురూ చేసిన అభిప్రాయాలనే చాలామంది కలిగి ఉన్నారనిపిస్తుంది ఈమద్య కాలంలొ యునివెర్సిటీలొ పిజీ చేసే స్టుడెంట్స్ మాటల మద్యలొ ప్రతి అమ్మాయీ యవరినొ ఒకరిని కలిగి
    ఉన్నారని చెప్పారు. అది వాస్తవమా కాదా అనేది ఇక్కడ అనవసరం. అలాంటి అభిప్రాయాన్ని కలిగిన వాళ్ళు లక్షల్లొ, వున్నారు. బెంగులూరులొ జాబ్ చేసే ఒకతను “ఈరొజుల్లొ గర్ల్ ప్రెండ్ లేని అబ్బాయి ఉంటాడేమొ గాని బొయ్ ప్రెండ్ లేని అమ్మాయి దొరకడం కస్టం” అన్నాడు. ఇక్కడ గర్ల్ బొయ్ పదాలు ప్రియుడు ప్రియురాలుకు పర్యాయ పదాలు.

    భూస్వమ్య భావజాలం భలంగా వున్న ఇండియాలొ పెరిగిన వాళ్ళకు పురుష అహంకారం మన రక్తంలొ నర నరాన్న జీర్నించుకపొయి ఉంటుంది.అది ఎంత వస్తువినియొగంలొ ఆధునికంగా వున్నా మానసికంగా అభివౄద్ది నిరొదక బావాలనే అంటిపెట్టుకుని వున్నాడు. కుళ్ళి కంపుకొట్టే బావాలతొ. ఒకవిధంగా దాన్ని వదిలించుకొవడం కుడా కస్టంతొ కూడుకున్నపని చలంగారు అన్నట్టు బయట మహిళల గురించి అరగంట ఉపన్యాసం ఇచ్చి ఇంటికి వస్తానే ఎమే కాళ్ళు కడుక్కొవడానికి నీళ్ళు ఇవ్వమని అరుస్తాడు. పురుషుల్లొ అనేక రకాల వాళ్ళు వున్నట్టే స్త్రీల లొనూ అనేక రకాలవాళ్ళు వుంటారు ఎందుకంటే వాళ్ళూ కుడా ఈ భూగ్రహం మీదే పుట్టెరు ఈ భూగ్రహం మీదే పెరిగారు. కార్మికులు శ్రమదొపిడీకి గురౌతున్నారు కదా అని వాళ్ళుచేసిన హత్యలూ, మానబంగాలూ, సమర్దించలేము కదా? అలాగే స్త్రీలు అనిచివేతకు గురౌతున్నారని నైతిక ప్రవర్తనను ప్రశ్నించడం తప్పు కాడు కదా(తాడేపల్లి వాళ్ళగురించి మాట్లాడం లేదు నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. )

    బానిసకు తనదేహంపైన తనకు మాత్రమే సర్వహక్కులూ వుండాలి.బానిస యజమానికి కాదు. అలాగే స్త్రీలకు తమపై తమకు పూర్తి స్వేచ్చ వుండాలి ఎమి చేయడానికైనా మానడానికైనా.ఇతరులెవ్వరు తమకు హద్దులు నిర్నయించటానికి. పురుషుడు ఎపని చేయడానికైనా స్త్రీ అనుమతిని అడుగుతున్నాడా?. ఇక మహిలా సంగాలవాళ్ళు టి,వీల ద్వరా వాళ్ళ ప్రసంగాలు అప్పుడప్పుడూ విన్నాను. సంద్య గారు. ఇకొకరు పేరు గుర్తు లేదు. అలాగే భూమి స్త్రీవాద ప్రత్రికలవాళ్ళు. వీళ్ళు పూర్తిగా బుర్జూవా సంస్కరణ వాదులు.పైపై వైద్యాలు చేస్తారు. సమూల మార్పు గురించి ఎమాత్రం అవగాహన లేదు.

    వాళ్ళు క్షమాపన కొరుకున్నారు కాబట్టి క్షెమించగల మనసు వుంటె క్షెమించడం గొప్పవిషయం, వాళ్ళు ప్రకటించిన అభిప్రయాలు అరుదైన ఘటనలుఎమీకాదు.పురుషుల్లొ చెప్పుకొదగ్గ సంఖ్యలొ అలాంటి భావాలతొనే వున్నారు.

  5. పింగ్‌బ్యాక్: 2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

వ్యాఖ్యానించండి