ఈ వీడియోలో మాట్లాడుతున్న వక్త పేరు సునీతా కృష్ణన్. స్వచ్ఛంధ సంస్ధగా ఎందరో పాపలను, బాబులను, అమ్మాయిలను, మహిళలను కాపాడిన ఈమె స్వయంగా చిన్నతనంలో జరిగిన సామూహిక అత్యాచారానికి బాధితురాలు. పేగులు బైటికి వచ్చే విధంగా అనేకమంది చేత అత్యాచారం చేయబడిన నాలుగేళ్ల పాప గురించీ ఇంకా అనేకమంది గురించీ ఈమె చెబుతుంటే మనుషుల మానవత్వంపై గట్టి అనుమానం రాకతప్పదు. ఫ్లెష్ ట్రేడ్ బాధితులకు ధైర్యం ఇవ్వడానికి టన్నుల కొద్దీ సానుభూతి ఇచ్చినా అది అక్కరకు రాదనీ వారిని మనలో ఒకరిగా స్వీకరించగలిగితే అంతకు మించిన మానవత్వం లేదని చెబుతున్న సునీతగారి మాటలు కాదనలేని వాస్తవాలు. నాగరిక ప్రపంచంలో నివసిస్తున్నామని నమ్ముతున్న మనల్ని నిశ్చేష్టులని చేయగల నిజాలు చెప్పిన సునీత ప్రసంగం పూర్తిగా వినితీరాలి. (ఈ వీడియో రెండేళ్ల క్రితం నాటిదని తెలుస్తోంది.)
–
–