నిర్భయానికి మరణం లేదు -కవిత


ఢిల్లీ బస్సులో దారుణానికి గురై మరణించిన అమ్మాయిని పత్రికలు, ప్రజలు, ఆందోళనకారులు అనేక పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆరు మృగాలతో నిర్భయంగా పోరాడింది కనుక ‘నిర్భయ’ అనీ కొందరు, ఒకనాటి వాస్తవ ఘటనకు గుర్తుకు తెచ్చుకుంటూ ‘దామిని’ అని కొందరు పిలుస్తున్నారు. ఎన్.డి.టి.వి చానెల్ బాధితురాలిని ‘అమానత్’ అని సంబోధించింది. ఆకాశంలో సగం ధిక్కరించిన పిడికిళ్ళైనంతకాలం తాను ఏ పేరుతోనైనా నిలిచే ఉంటుందని మరో కవి చిట్టిపాటి.వెంకటేశ్వర్లు తన కవితలో ఇలా స్పందిస్తున్నారు. బొమ్మపై క్లిక్ చేసి పి.డి.ఎఫ్ ఫైల్ రూపంలో కవితను చూడగలరు.

Nirbhaya lyric

3 thoughts on “నిర్భయానికి మరణం లేదు -కవిత

  1. అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఎంత స్పందన వచ్చిందో, ఈ అత్యాచార వ్యతిరేక ఉద్యమానికి కూడా అంతే స్పందన వచ్చింది. ఈ బొమ్మ చూడండి, అర్థమవుతుంది: http://4proletarianrevolution.mlmedia.net.in/173233832
    మొన్న వైజాగ్‌లో నాకు పరిచయమైన జగదీశ్ అనే మార్కిస్ట్ నాతో ఇలా అన్నాడు “కబుర్లు కాదు, కార్యాచరణ ముఖ్యం” అని. అతను చెప్పినది నిజమని నాకు ఇప్పుడు అనిపిస్తోంది.

  2. కబుర్లు కూడా కార్యాచరణే ప్రవీణ్. ఆలోచన అనేది కార్యాచరణే. మీరు ఉంచిన ఫోటో నిజమైనదేనా? మీరు ఈ విషయం పై సరయిన ధోరణిలో ఉన్నట్లు లేరు.

  3. ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో దొరికితే పెట్టాను. https://www.facebook.com/photo.php?fbid=325790894201180&set=a.152616061518665.31691.152401068206831&type=1 అత్యాచారాలపై వ్యతిరేకత కూడా అవినీతి వ్యతిరేకతలాగే వ్యక్తిగత పాప్యులారిటీ కోసం చెప్పుకునే కబురే అయిపోతే ఇక ఈ దేశంలో అత్యాచారాల సంఖ్య తగ్గడం అనేది జరగదు.

వ్యాఖ్యానించండి