విభిన్న చరిత్ర, సంస్కృతులను గుర్తుకుతెచ్చే దీపావళి -ఫోటోలు


చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటున్నామని హిందూ పండితులు చెబుతారు. నరకాసుర వధకు గుర్తుగా ఆనందంగా జరుపుకునేది దీపావళి పండగ అని కొందరు చెబితే రావణుడిని జయించి రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా జరుపుకునే పండగ దీపావళి అని మరి కొందరు చెబుతున్నారు. సిరులు కురిపించమని కోరుతూ దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మిని కొలిచే సంప్రదాయం కూడా దేశంలో అనేకచోట్ల ఉన్నది. బంది చోర్ దివస్ పేరుతో సిక్కు మతస్ధులు దీపావళి రోజునే స్వర్ణ దేవాలయాన్ని దీపాలతో అలంకరించడం పంజాబ్ లో ఉన్న సంప్రదాయం. నేపాల్ హిందువులు కూడా దీపావళి పండగను తీహార్ పేరుతో జరుపుతారు. లక్ష్మీదేవి ఆవుపై వస్తుందన్న నమ్మకంతో ఆవునూ, భైరవదేవుడి పేరుతో కుక్కకు కూడా నేపాలీయులు తీహార్ సందర్భంగా కొలుస్తారట. దీపావళికి ఇంకా దేశంలోని వివిధ చోట్ల వివిధ కారణాలు వ్యాప్తిలో ఉన్నాయి.

ఏ పేరుతో ఏ దేవతను కొలిచినా భారతీయ పండగలు భారత దేశంలోని వివిధ జాతుల, తెగల సాస్కృతిక పరిణామ క్రమంలోని వివిధ చారిత్రక మజిలీలను సూచిస్తాయని చెప్పవచ్చు. వివిధ ప్రాంతాల మధ్యా, తెగల మధ్య జరిగిన సంఘర్షణలను దేవ దానవ యుద్ధాలుగా సాధారణీకరించడం హిందూ పండగల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. సామాజిక చరిత్రలో విశాల దృష్టితో చూస్తే ఇవి ఆర్య, ద్రవిడ ఘర్షణలుగా కొందరు చరిత్రకారులు సాధారణీకరించడం తెలిసిన విషయమే. ఈ కారణం వల్ల ఒక చోట రాముడు దేవుడయితే మరొకచోట రావణుడు దేవుడు. ఇటీవల గోదావరి జిల్లాల్లో నరకాసురుడి జయంతి/వర్ధంతి రోజు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మతపరమైన భావోద్వేగాలను పక్కనబెట్టి వాస్తవ సామాజిక పరిణామ దృక్పధంలో పరికిస్తే తప్ప ఇటువంటి భిన్నత్వాలను ప్రజలకోణంలో నుండి అంచనా వేయలేము.

దీపావళి ఫోటోలను బోస్టన్ పత్రిక అందించింది.

2 thoughts on “విభిన్న చరిత్ర, సంస్కృతులను గుర్తుకుతెచ్చే దీపావళి -ఫోటోలు

వ్యాఖ్యానించండి