గుట్టు రట్టు: భాగ్యలక్ష్మి ఆలయం ఐదు దశాబ్దాల నాటిది మాత్రమే -ఫోటోలు


ఫొటో: ది హిందూ

ఛార్మినార్ కట్టడానికి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ కట్టడం గుట్టుని ‘ది హిందూ’ పత్రిక రట్టు చేసింది. హిందూ సంస్ధలు, గ్రూపులు చెబుతున్నట్లుగా భాగ్యలక్ష్మి ఆలయం ఛార్మినార్ కట్టడమంత పాతదేమీ కాదనీ, అది కేవలం 50 సంవత్సరాల క్రితం నాటిదేననీ తెలియజేసింది. బాగ్యలక్ష్మి ఆలయం కట్టడానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేని ఫోటోను పత్రిక బుధవారం ప్రచురించింది. ఫోటో పైన తేదీ ఏమీ లేనప్పటికీ ఫోటోలో ఉన్న కార్లను బట్టి అది ఆరు శతాబ్దాల క్రితం తీసిన ఫోటో అని చెప్పవచ్చని తెలిపింది.

గత కొద్ది రోజులుగా భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా అనేక రాజకీయ ప్రకటనలు, బెదిరింపులు, అలకలు సాగుతున్నాయి. ఈ ఆలయాన్ని సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ‘మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (ఎం.ఐ.ఎం) పార్టీ ప్రకటించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్, రాష్ట్రపతి లకు లేఖలు ఇచ్చినట్లు కూడా ఆ పార్టీ ప్రకటించింది. ఎం.ఐ.ఎం నాయకుడు, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చానెళ్లలో ప్రత్యక్షమై పదేళ్లనాటి రాజకీయ మిత్రత్వాన్ని తెంచుకుంటున్నట్లు ఉన్నపళంగా ప్రకటించి పత్రికల ఊహాగానాలకు పని పెట్టాడు. లౌకిక పార్టీగా తామే కొనియాడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా మతతత్వ పార్టీగా మారిపోయిందనీ, మతతత్వ శక్తులతో కుమ్మక్కయిందనీ ఆరోపించాడు.

ఏదో పండగ పేరుచెప్పి ఆ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయాన్ని అలంకరిస్తున్నామన్న పేరుతో కట్టడాన్ని మరింత ముందుకు జరిపి విస్తరిస్తున్నారని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నదనీ ఎం.ఐ.ఎం ఆరోపించింది. సదరు ప్రకటన నిజమేనేమో అన్నట్లుగా ఛార్మినార్ ప్రాంతంలో ఘర్షణలు, దాడులు జరిగాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. నిత్యం వ్యాపారంతో రద్దీగా ఉండే షాపులు కూడా మూతపడ్డాయి. ఒక కారణం అంటూ లేకుండా పాదాచారులపైనా, పనిమీద బైటికి వచ్చినవారిపైనా మారణాయుధాలతో ప్రాణాంతక దాడులు జరిగాయి. పరిస్ధుతులను చక్కబెట్టేందుకు యధావిధిగా పోలీసులు రంగంలోకి దిగి కర్ఫ్యూ, 144 సెక్షన్ విధింపు తదితర చర్యలు చేపట్టారు.

పనిలోపనిగా ఒక ఆనందస్వాములు కూడా రంగంలోకి దిగి పూజకు ప్రయత్నం చేశాడు. ఆయనని పోలీసులు అడ్డుకోవడం, స్వాములవారు అరెస్టు కావడం, పోలీసు స్టేషన్ లోనే స్వాములు ధర్నాకు దిగడం అన్నీ జరిగిపోయాయి. ‘పండగనాడు కూడా అమ్మవారిని దర్శించుకోనివ్వరా?’ అంటూ స్వాములవారు ఆవేదనతో ప్రశ్నిస్తున్న దృశ్యాలు చానెళ్లలో ప్రత్యక్షం అయ్యాయి. బి.జె.పి నాయకులు కిషన్ రెడ్డి, వెంకయ్యనాయుడు తదితరులు కూడా మతపరమైన సెంటిమెంటును రంగరించి రాజకీయ ప్రకటనలు జారీ చేయడం కూడా జరిగిపోయింది. భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోకపోతే ఇక రాష్ట్రమో, దేశమో నాశనం అవడం గ్యారంటీ అన్నట్లుగా జనం కూడా తండోపతండాలుగా ఆస్తిలక్ష్మిని సందర్శించుకుని తరించిపోయారు. రానున్న ఒక పెను విపత్తును నిరోధించినట్లుగా కొందరు సంబరపడ్డారు.

ఇంతా చేసి భాగ్యలక్ష్మి ఆలయానికి నాలుగైదు దశకాల రాజకీయ చరిత్ర తప్ప హిందూ గ్రూపులు చెబుతున్నట్లు శతాబ్దాల సంస్కృతి చరిత్ర లేదు. ఆ విషయం ‘ది హిందూ’ ప్రచురించిన ఫోటోల ద్వారా స్పష్టంగా రుజువయింది. మంగళవారం, నవంబరు 20 తేదీన ‘ది హిందూ’ రంగుల ఫోటోను మొదటి పేజీలో ప్రచురించింది. ఈ ఫోటో పెయింటింగ్ లా ఉంది తప్ప ఫోటోలా లేదనీ, నిజమైన ఫోటో ఉంటే తమకు చూపాలనీ అనేకమంది పత్రికను కోరారు. దానితో పత్రిక మరికొన్ని ఫోటోలను తన ఆర్కీవ్స్ నుండి వెతికి బుధవారం ప్రచురించింది.

కలర్ ఫోటో టెక్నాలజీ లేని రోజుల్లో నలుపు-తెలుపు ఫోటోలకు రంగులు అద్దేవారనీ, అలా రంగులు అద్దిన నలుపు-తెలుపు ఫోటోని తాము ప్రచురించామని పత్రిక తెలిపింది. స్టూడియో వారు ఇచ్చిన నలుపు-తెలుపు ఫోటోని ప్రచురించడానికి పత్రికకు హక్కులు లేనందున తమ ఆర్కీవ్స్ నుండి మరికొన్ని నలుపు-తెలుపు ఫోటోలను ది హిందూ ప్రచురించింది. 1957 నాటి ఫోటోలో గానీ 1962 నాటి ఫోటోలో గానీ ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం లేదు. అమెరికాలోని ఎం.ఐ.టి లైబ్రరీలో ఉన్న 1986 నాటి ఫోటోలో భాగ్యలక్ష్మి గుడి ఉన్నట్లు ఫొటోలో చూడవచ్చు. ఆ తర్వాత ది హిందూ ప్రచురించిన 1990, 1992 ల నాటి ఫొటోల్లోనూ భాగ్యలక్ష్మి గుడి ఉన్నది. ఈ లెక్కన కనీసం 1962 వరకూ, అంటే 50 సంవత్సరాల క్రితం వరకూ ఛార్మినార్ కి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి గుడి అక్కడ లేదు. ఆ తర్వాత మాత్రమే ఆ గుడిని అక్కడ కట్టారు. చిన్నపాటి నిర్మాణంగా మొదలయిన భాగ్యలక్ష్మి గుడి క్రమక్రమంగా ప్రమాదకర రీతిలో పూర్తి స్ధాయి కట్టడంగా రూపుమార్చుకుందని పత్రికలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. కనుక ఈ తప్పులో హిందూ సంస్ధల పాత్ర ఎంత ఉందో సెక్యులర్ పార్టీ గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తప్పు కూడా అంతే ఉన్నది.

తాజా మత ఘర్షణలకు కారణం ఏమిటో పత్రికలు ఇప్పటికే చెప్పేసాయి. 1990 లో చెన్నారెడ్డి నుండి ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కోవడానికి మతం పేరుతో అత్యంత ఘోరమైన హత్యాకాండకి పాల్పడ్డారన్నది జగమెరిగిన సత్యం. వై.ఎస్.రాజశేఖర రెడ్డి సి.ఎం పదవి కోసం రాయలసీమ నుండి ఫ్యాక్షనిస్టు గూండాలను రప్పించి అమానుషమైన హత్యాకాండకు పాల్పడ్డాడని ఇపుడు దాదాపు అందరూ అంగీకరిస్తారు. ఒక మతం అంటూ తేడా లేకుండా దొరినివారిని దొరినట్లు హద్రాబాదీయులను కొట్టి, నరికి చంపేస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం లొంగి చెన్నారెడ్డిని సి.ఎం పదవినుండి తప్పించింది. కాంగ్రెస్ పార్టీ కింద కూడిన భూస్వామ్య, పెట్టుబడిదారీ పాలకవర్గాలు ఆస్తులు, ఆదాయాల పంపకంలో తమ మధ్య వచ్చిన తగాదాను ఆ విధంగా మతకల్లోలాలను రెచ్చగొట్టడం ద్వారా, అమాయక జనాన్ని ఊచకోత కోయడం ద్వారా పరిష్కరించుకున్నారు.

ఇప్పుడూ అదే పరిస్ధితి కొనసాగుతోంది. ఢిల్లీ సుల్తానుల నీడలో చేరి ఇప్పటికే దేశంలోని జల, ఖనిజ వనరులను గుప్పిట్లో పెట్టుకున్న పాలకవర్గాలకు వివిధ రాష్ట్రాల్లో కొత్తగా అభివృద్ధి చెందిన వర్గాలు పోటీకి వస్తున్నారు. అంబానీ, టాటా, బిర్లా… ఇత్యాదిగా గల  పేర్లతో చెలామణిలో ఉన్న జాతీయ స్ధాయి ధనికవర్గాలకు సీమాంధ్ర ధనికవర్గాలు పోటీగా ఎదిగాయి. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న వివిధ ఖనిజ, ఆయిల్, గ్యాస్ వనరుల్లో తగిన వాటా కోసం వారు డిమాండ్ చేస్తున్నారు. సో కాల్డ్ స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ నీడలో ఒక అలిఖిత, అప్రకటిత ఒప్పందం మేరకు దేశ వనరులను భోంచేయడానికి వాటాలు పంచుకున్న తర్వాత పంపిణీలో తిరిగి విభేదాలు తలెత్తిన ఫలితమే ఈ తన్నులాట. వివిధ ప్రాంతాల్లో సరికొత్త ధనికవర్గాలు అవతరించి అంతకంతకూ ఎక్కువ వాటాను డిమాండ్ చేస్తుండడం వల్ల కూడా పాలకవర్గాల మధ్య సరికొత్త తగాదాలు ఆవిర్భవిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో వస్తున్న చీలికలు… వీటన్నింటినీ ఈ పాలకవర్గ తగాదాల నేపధ్యంలోనే చూడాలి.

రాష్ట్రానికి సంబంధించినంతవరకూ ఈ పోటీలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జాతీయ స్ధాయి ధనికవర్గాలకు, జాతీయ స్ధాయిలో పలుకుబడి కలిగి స్ధిరపడిన రాష్ట్రీయ ధనికవర్గాలకు కొమ్ము కాస్తుండగా సీమాంద్రలో మరింత వాటాను డిమాండ్ చేస్తున్న ధనికులకు వై.ఎస్.రాజశేఖర రెడ్డి నమ్మకమైన ప్రతినిధిగా అవతరించాడు. దానికి తగిన ఫలితాన్ని కూడా రాజశేఖర రెడ్డి పొంది తన కుటుంబానికి వేల కోట్ల ఆస్తులను సమకూర్చాడు. అయితే ఆయన చనిపోవడంతో ఆయనను నమ్ముకున్న ధనికవర్గాలకు రాజకీయ ఆలంబన లేకుండా పోయింది. ఆ ఖాళీని పూడ్చుకునే ప్రయత్నంలో వై.ఎస్.ఆర్ తనయుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డిని వారు రంగం మీదికి తెచ్చారు. జగన్ కి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాన్ని చట్టబద్ధ సంస్ధలు ఇంతవరకూ సంపాదించలేకపోయారంటే దానికి కారణం నిమ్మగడ్డ లాంటి ధనికులు తమ ఆస్తుల ప్రయోజనాలు నిలబెట్టుకోవడానికి దృఢంగా నిలబడడమే కారణం.

అయితే ఈ దృఢత్వం ఇంకా బలపడుతోందా లేక నీరుగారుతోందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కోర్టుల ద్వారా జగన్ ని లొంగదీసుకోవడానికి కాంగ్రెస్ వెనుక ఉన్న వర్గాలు ప్రయత్నిస్తుండగా, జగన్ వెనుక ఉన్న వర్గాలు ప్రజా బలంతో వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఓదార్పు యాత్రలు, ఆపరేషన్ ఆకర్ష్ లు, మరో మహా ప్రస్ధానాలు, ఇపుడేమో భాగ్యలక్ష్మి గుడి చుట్టూ అల్లుకున్న మతకల్లోలాలు. పైకి కనపడే ఘర్షణలు, కల్లోలాలు, పార్టీల మార్పిడులు అన్నీ అప్పటికప్పుడు పుట్టుకొచ్చేవి కాదు. విశాల దృష్టిలో వీటికి తగిన ప్రణాళిక తగినంత ముందుగానే రచించబడుతుంది. వీటికి అనుబంధంగా కొన్ని పరిణామాలు అప్పటికప్పుడు జరిగితే జరగవచ్చు గానీ, ప్రధాన ప్రణాలిక ముందే తయారవుతుంది. కొన్నిసార్లు అనుబంధ పరిణామాల వల్ల ప్రధాన ప్రణాళికకు ఆటంకాలు ఏర్పడి అందులో మార్పులు జరగవచ్చు కూడా.

1990 నాటి మత ఘర్షణల్లో వై.ఎస్.ఆర్ సాగించిన అఘాయిత్యాలకి, హత్యాకాండకి ఎం.ఐ.ఎం పార్టీ సహకరించిందని ఒక అవగాహనగా పత్రికలు చెబుతాయి. ఈ నేపధ్యంలో చూసినట్లయితే ఎం.ఐ.ఎం పార్టీకి హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ హిందూ మతతత్వ పార్టీగా ఎందుకు కనపడిందో ఇట్టే అర్ధం అవుతుంది. తమ దివంగత మిత్రుడి తనయుడు జగన్ ప్రజా బలం నిరూపితం కావాలంటే ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఎన్నికలు జరగాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతకు 1990 లాగానే మతఘర్షణలకు ఒక సాకుగా భాగ్యలక్ష్మి గుడిని వినియోగించగల అవకాశం కుట్రదారులకు చక్కగా కనిపించింది. ఫలితంగా ఎం.ఐ.ఎం దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మతతత్వ పార్టీగా కనిపించడం, మతతత్వ పార్టీ కనుక మద్దతు ఉపసంహరించుకోవడం సాధ్యమయింది.

ఈ విశ్లేషణలో హైద్రాబాద్ మత ఘర్షణలకు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత జైలు పక్షి దోషులుగా కనిపిస్తున్నప్పటికీ వారికి మద్దతు ఇచ్చి కాపాడినవారిలో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. ఇలాంటి అఘాయిత్యాలు కాంగ్రెస్ కే పరిమితం కాదనేందుకు గత, వర్తమాన చరిత్రలే సాక్ష్యం. బి.జె.పి నేత నరేంద్రమోడి 2002 లో గోధ్రా రైలు దహనాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన హత్యాకాండ ఆయనకి పదేళ్ళ ముఖ్యమంత్రిత్వం ఖాయం చేసింది. ఎం.ఐ.ఎం – వై.ఎస్.ఆర్.సి.పి ల పధకం సరిగ్గా పారితే మరికొద్ది నెలల్లో రాష్ట్ర ఎన్నికలు జరగాలి. పధకం పారకపోయినా ఫర్వాలేదు. మరో ప్రజా ప్రాణాంతక పధకం ఏదో ఒకటి సిద్ధాంగానే ఉంటుంది. అవేమీ పారకపోతే, ప్రజాబలం నిరూపించుకునే అవకాశం జగన్ కి దక్కకపోతే జాతీయస్ధాయి ధనికవర్గాలకు స్ధానిక ధనికవర్గాలు లొంగిపోయి తమ ఆర్ధిక ప్రయోజనాలకు పరిమితి విధించుకుంటారు. అంటే, జగన్ రాజీకి రావడం, సరైన సాక్ష్యాలు లేక జైలు నుండి విడుదల కావడం, కాంగ్రెస్ లో మళ్ళీ పిల్ల పార్టీ కలిసిపోవడం జరిగే అవకాశం ఉంటుంది.

ఇక్కడ మొత్తంగా అర్ధం చేసుకోవలసిన విషయం: మత ఘర్షణలు అనేవి అల్లా, భాగ్యలక్ష్మి కోసమో, దేవుళ్ళ మెప్పు కోసమో లేక మతం కోసమో కాదు. సమాజంలో పై స్ధానంలో ఉన్న ధనికవర్గాలు తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం, తమ మధ్య ఉన్న తగాదాలు పరిష్కారం చేసుకోవడం కోసం, కొత్తగా వాటాలు సాధించుకోవడం కోసం… ఇలాంటి కారణాల కోసం జరిగేవి. ఇందులో ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం ఉండవు. ప్రజల సెంటిమెంట్లు మరింతగా ఛిద్రమవుతాయే తప్ప పరిరక్షించబడవు. పదులు, వందలకొద్దీ అమాయకులు ప్రాణాలు, ఆస్తులు కోల్పోవడం ద్వారా తగిన మూల్యం చెల్లించాక తగువులాడుకున్న వర్గాలు ఎక్కడో ఒక చోట ఆస్తుల పంపిణీలోనూ, దోపిడీలోనూ రాజీలు పడి యధావిధిగా ప్రజలను అణచివేయడం, దోపిడీ చేయడం కొనసాగిస్తాయి. సో కాల్డ్ స్వతంత్ర భారతంలో మత కల్లోలాల చరిత్రలు నిగ్గు తేల్చిన సత్యం ఇదే.

12 thoughts on “గుట్టు రట్టు: భాగ్యలక్ష్మి ఆలయం ఐదు దశాబ్దాల నాటిది మాత్రమే -ఫోటోలు

 1. >>>సో కాల్డ్ స్వతంత్ర భారతంలో మత కల్లోలాల చరిత్రలు నిగ్గు తేల్చిన సత్యం ఇదే.>>>
  చాలా బాగా చెప్పారండీ! మీ పోస్టులు చాలా చాలా బాగుంటాయి. వీటి వల్లనే ప్రస్తుతం జరుగుతున్న విషయాలు తెలుసుకోగలుతున్నాను. మీకు వీలుంటే, వీలు లేకపోయినా వీలు చేసుకుని రిజర్వేషన్ ల గురించి వివరంగా వీలైనన్ని పోస్టులు ఇవ్వండి ప్లీజ్.నాకు ఎక్కడా దొరకటం లేదు.

  కృతజ్ఞతలు.

 2. ప్రభాకర్ గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు.

  మీరు కోరిన అంశంపై బ్లాగ్ లో ఇప్పటికే కొన్ని టపాలు ఉన్నాయి. కింద సెర్చ్ బాక్స్ లో “రిజర్వేషన్లు” అని టైప్ చేసి వెతికితే అవి కనిపిస్తాయి. అవి చదివాక ఇంకా వివరాలు కావాలనుకుంటే, లేదా అనుమానాలు, అభిప్రాయాలు కలిగితే వ్యాఖ్యల ద్వారా తెలియజేయగలరు.

 3. నేను బాగా ఆలొచించి ఒక నిర్నయానిఒచ్చాను ఏ వ్యాపారం పెట్టినా నస్టపొతున్నాను నా జీవితంలొ విజయమనేదే తెలియదు అపజయాలు తప్ప. శిరొమండలం చేయించుకుని కాషాయ వస్రాలు ధన్రించి ఓ నలుగురిని వెంటేసుకుని ఏదైనా ఒక ఆశ్రమ స్తాపించి దాని ద్వారా ఫీఠాధిఫధినైపొవాలని ఫధకం రచించా దానికి కుడా రాజకీయ అండదండలు అవసరమేననుకొండి సర్పంచి లాంటివాళ్ళైతే తెలుసు పెద్దనాయకులు తెలియదు.నేను మీ బ్లాగ్ ద్వారా కొరుకుంటున్నను బడారాజకీయ నాయకులు తెలిసిన వాళ్ళు యవరైనా వుంటె నన్ను కలవండి. మిగతా కథ నేను నడిపిస్తాను వచ్చిన దాంట్లొ అర్దం అర్దం పంచుకుందాం గత రెండు మూడు సంవత్సరాలుగా వుంగరాలు, రుద్రక్ష మాలలు ఇంకా రకరకాలైన యంత్రమహిమలు.ద్వారా ఆర్దికపరమైన, లేక జబ్బులకూ, పొకొడతమని ఇండియా మొత్తం TVలలొ వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. దాని ద్వారా కొట్ల తర్నొవర్ చేశారు. తాయత్తులూ, మంత్ర తంత్రాలూ, లాంటి వాటికి బిన్నంగా మనం ధరించే దుస్తులపైన వాస్తు ప్రాకారం దేవతల ప్రతిమలు వేస్తం.ఆ దేవతల ఆపొజెట్లొ శెనేస్వరుడి ప్రతిమ కుడ వుంటుంది. దానర్దం వళ్ళయిద్దరిమద్య యడతెగని యుద్దం నడుస్తుంది. చివరికి మనం చెప్పిన టయానికి శనేస్వరుడు ఓడిపొతాడు. అలగే మనం చెప్పిన దారుల్లొ మాత్రమే నడవాలి కొన్ని రొజులు మాత్రమే. వాస్తుప్రాకారం.రొశయ్య సి.యం గా వున్నప్పుడు చానా కస్టాలొచ్చాయి ఆయనకు .ఆయనున్న బిల్డింగ్ కు చుట్టుపక్కలా నీళ్ళు పారేటట్టు చెయ్యమన్నను. ఆ దెబ్బతొ సి.యం పొస్టు వూడి యెకంగా గవర్నరు అయ్యారు. దీన్ని మనం యాడ్ గా ఇచ్చి నలుదిక్కులా మనగురించి తెలిసేతట్టు చేయాలి. వేరకాల వ్యాపార ప్రకటల్ని పెద్ద పెద్ద సినిమా వాళ్ళ దగ్గిర చేయిద్దాం. గతంలొ వాళ్ళ సినిమాలు హిట్ అయినవాటికి మన యంత్ర తంత్రలే కారణమని చెప్పిద్దాం.అలాగే తన్నుల బాబాల గురించి మనవాళ్ళకు తెలిసిందే కాబట్టి.ఒక మంచి కథానాయకిని తీసుకుని దాన్ని(ఆమె) దగ్గిర తన్నిద్దాం.యువకులు మనకు ముఖ్యం. వాళ్ళకు గాళం వెయ్యాలంటె ఇలంటి త్రిక్కులు ఉపయొగించాలి. ఇలాంటివి నాదగ్గర చాలా వున్నాయి. సాయిబాబా సామ్రాజ్యాన్ని లాగ ఒక సామ్రాజ్యాన్ని స్తాపించాలని కొరిక.వ్యపార బాగస్వములూ త్వర త్వరపడండి.

 4. రామ్మోహన్ గారూ.. ఈ దేశంలో మంచి వాళ్లకూ, నీతి నిజాయతీని నమ్ముకున్న వాళ్లు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో మీ పోస్టులోని ఆవేదన తెలియజేసింది. మీరు రాసింది వ్యంగ్యంగానే ఐనా…నాకు ఒక నిమిషం పాటూ కళ్లలో నీళ్లు తిరిగాయంటే నమ్మండి. ఏమిటి ఈ దేశం.? ఎటు పోతోంది.?
  కుక్కలు శవాలమీద పడి పీక్కుతింటున్నట్లుగా కొందరు ఈ దేశ ప్రజల సొత్తును క్రూరంగా, హీనంగా, ఘోరంగా దోచుకుతింటున్నారు.
  అరాచకవాది అకృత్యాల కన్నా, మేధాని మౌనం మరింత ప్రమాదకరమన్న సంగతి తెలిసి కూడా ఈ దేశంలో ఎందరో అర్హత కలిగిన వారు, సమర్థత ఉన్న వారు మౌనంగా, చేతులు ముడుచుకొని చోద్యం చూస్తున్నారు. ఒకరిద్దరు ఆవేశపడి హింసామార్గంలో పయనిస్తే…..గ్రీన్ హంట్ పేరుతో ఏరిపారేస్తున్నారు. పోనీ ప్రజాస్వామ్య మార్గంలోనే అవినీతి నిర్మూలనకు ప్రయత్నిస్తుంటే జనాల్లో పెద్దగా స్పందన లేదు.

  ఒకప్పుడు అవినీతి పరుడంటే వెలివేసినట్లు చూసేవారు. కానీ ఇవాళ అదే అవినీతిపరుడ్ని ఆదర్శంగా తీసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. అసలు అవినీతి అనేది పెద్ద వార్తగా కూడా మన జనం చూడడం మానేశారు. ఇవన్నీ చూసి ఒకరిద్ధరి రక్తం మరిగినా….చేయడానికి ఏమీ ఉండదు.
  ఏం చేయాలి….ఏం చేయాలి….ఎలా ఈ దేశాన్ని బాగు చేయాలి…..అంతో ఇంతో, సమాజం మీద బాధ్యతగా భావించే వాళ్లను ఎంతోమంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది.

  పైగా ఇలా ఆలోచించే వాళ్లను హేళన చేసే వాళ్లకు కొదవలేదు. సమాజాన్ని ఒకడు బాగు చేయాల్ని అవసరం లేదని….ఎవరికి వారు బాగుపడితే సహజంగానే బాగుపడుతుందని..కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో అనే సలహాలు ఇస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఏ ఒక్కడూ తనంతట తానుగా సమాజంతో ప్రమేయం లేకుండా బాగుపడలేడు. ఎందుకంటే అవకాశాలు అసమానంగా పంపిణీ ఐన అనారోగ్యకరమైన సమాజంలో ఎంత గొప్ప ప్రతిభావంతుడైనా రాణించలేడు.

  చివరగా చెప్పేదేమంటే…ఈ సమాజంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న మీ లాంటి మంచివాళ్లు కూడా ఇలా ఆవేదన చెంది పక్కదోవ పడితే…( మీ ఆవేదనలో నిజమున్నా ) ఎలాగండీ….ఈ దేశం ఏమై పోవాలి రామ్మోహన్ గారూ.

 5. మీరు గాంధేయవాదం గురించి ఒక వ్యాసం వ్రాయండి. మార్క్సిజం కొత్తగా చదివిన ఒక యువకుడు నిన్న మా ఇంటికి వచ్చి గాంధీ గురించి నన్ను అడిగాడు. వివరంగా చెప్పడానికి సమయం లేక ఎం.వి.ఆర్.శాస్త్రి గారు వ్రాసిన “మన మహాత్ముడు” పుస్తకం, రంగనాయకమ్మ గారు వ్రాసిన “దళిత సమస్య పరిష్కారానికి” పుస్తకం చదవమని సూచించాను. అతనికి కొన్ని విషయాలు చెప్పాను. గాంధీ కుల వ్యవస్థ ఉండాలనీ, అంటరానితనం మాత్రమే పోవాలనీ అన్నాడు. ఈ విషయం చెప్పినప్పుడు ఆ యువకుడు నాకు ఓ ప్రశ్న అడిగాడు “కుల వ్యవస్థ ఉండగా అంటరానితనం ఎలా పోతుంది? ఆ రెండూ ఒకదానికొకటి విడదీయలేని సంబంధం ఉన్నవి కదా!” అని. “కులం విషయంలో గాంధీ యొక్క నిలకడ అలాగే ఉండేది” అని చెప్పాను. అహింసావాదం గురించి కూడా ఆ యువకుడు అడిగాడు. “ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవాడు నిజ జీవితంలో ఎవడూ ఉండడు, కావాలంటే గాంధేయవాదినని చెప్పుకునేవాని చెంప మీద మీరు కూడా ఒక దెబ్బ కొట్టి చూడండి” అని అన్నాను. అలా రెండో చెంప చూపించేవాడు నిజ జీవితంలో ఎవడూ ఉండరని అతనికి తెలుసు. కానీ గాంధేయవాదులు తాము నిజ జీవితంలో విశ్వసించని విషయాలని విశ్వసిస్తున్నట్టు ఎందుకు చెప్పుకుంటున్నారు అనేదే అతని సందేహం. సోమవారం నేను ఒరిస్సా వెళ్ళే పని ఉంది. ఈ సమయంలో నేను ఎలాగూ వ్యాసం వ్రాయలేను కానీ మీరు వ్యాసం వ్రాయడానికి ప్రయత్నించండి.

 6. చందుతులసి గారూ. మతాలనూ, దేవుళ్ళను అడ్డం పెట్టుకుని బాబాలుగా అవతారమెత్తి పాలకవర్గం దానికి సహహరాలు అందిస్తూ పెంచి పొసిస్తుంది. వాస్తు బాగాలేదంటూ ప్రజల ఆస్తిని కొట్లలొ కర్చు చేస్తుంది రొశయ్య సి.యం. గా వున్నప్పుడు వాస్తు దొషాలకు గానూ సుమారు కొటిపైనే కర్చుపెట్టెరని వార్తా పేపర్లు చెప్పాయి. అయిన వాళ్ళకు అనేక అడ్డదరుల్లొ దొచిపెట్టడంలొ ఇదీ ఒక దారి.సులువైన దారి. సైన్స్ ఎంత అభివౄద్ది చెందినా ప్రజల జీవిత దౄక్పదంగా మారడం లేదు. దానికి కారణం నిత్యం దారిర్యాన్ని అనుభవిస్తూ అసమనతలు వుండటమే. ఈ మూడత్వానికి కారణమైన పునాదిమీద దెబ్బకొట్టాలి.అప్పుడే ఉపరితలమైన అంశాలు మారతాయి.పిల్లి ఎన్ని శాపనార్దాలు పెట్టినా ఉట్టి తెగనట్టె మూడత్వం పైన ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా ఉపయొగం వుండదు. దాని పునాది మారితే తప్ప. ఒక ఫధకం ప్రకారం పాలకవర్గం ముడత్వాన్ని పెంచి పొషిస్తుంది.దేశ ప్రదాన మంత్రులూ, ముఖ్యమంత్రులూ, బాబాల కాళ్ళు మొక్కడం ద్వరా. అంటటి పెద్దనాయకులే దేవుళ్ళకూ,బాబాలకూ మొక్కుతున్నారు మనమెంతని ప్రజలనుకుంటారు.

  పైన నేనది సరదాగా రాశాను అంతేగాని నేనేదొ అలా మారుతున్నానని కాదు.

 7. “సైన్స్ ఎంత అభివౄద్ది చెందినా ప్రజల జీవిత దౄక్పదంగా మారడం లేదు.”

  ప్రపంచాన్ని బాగా గమనిస్తే పేదా ధనిక తేడాలు విపరీతం గా పెరిగింది, ఈ సో కాల్డ్ సైన్స్ అభివృద్ది అయిన మొదలుకొనే! సైన్స్ అవిష్కరణల వలన ఉపయోగాలను టెక్నాలజి రూపంలో మారిన మొదలుకొని డబ్బులు ఉండేవాడు,దేశాలు దానిని బాగా ఉపయోగించుకొని విపరీతం గా లబ్ది పొందాడు. నేటి ఆధునిక మనిషి దిగజారుడు తనానికి, మానవత్వ పతనానికి అన్నిటికన్నా సైన్సే ఎక్కువ రోల్ ప్లే చేసింది.

 8. Nijam gaaa cheppali ante, MNC’s companies nadipe script mundu emi panicheyalevu…
  Nenu ekkado chadivanu gurthu ledu, but aa real story chala bagundi….Papua Geniua ane deevi(near by indonesia) ni konni oil company’s chala telivigaaa cash chesukuntai….first first vallu(MNC’s) company’s chese pani enti ante, aaa deevi tho vanijya sambamdalu ani cheppi digutaaru….America & Europe elagoo rule pass chesestundi….paaapam vallaki kotta alavatlu nerpu taaru(wester culture & night parties ani muddu muddu perlu pedataaru)….Western culture ani udaragodataaru….Once aaa island antha vella chetiloki vachhaka, chakkaga oil ni pelchestaru….evariki teliyadu….chala diplomatic gaa lagestaru and todestaru….ala aaa island lo oil ipotundi….ipoina tarvataaa antha close…. ee process ki may be 10/15/20 years pattavachhu….

  Iddari human beings madya godavalu pettali ante, chala takkuva time padutundi….
  Ade konni countries madya godavalu petti labam pondali ante chala script kavali….aa scripts ni mana developed countries daggara chala unnai…..

  Nenu enduku chebutunnanu ante evaro “gfyg” temple 50 years ayite charminar 400 years? mari antakumundu? annaru….
  edi mundu edi venakaa kaadu, any matham cheppina andaru kalisi undalane chebutundi….alla/Ram/Chris any books tesukunna ekkada champukomani ledu…..

  politician ade ee game lo ee temples/church/mosque anni kudaa konni coins maatrame….aa nijam mana people grahiste India sagam bagupadutundi…..ee matha garsanalo entha mandi bada bada baabulu business chesukuntaro kudaaa evariki teliyadu….

  nenu evarini vimarisancha ledu….just naa side fact cheppanu….manam anta manusulam….

  plz Sekhar garu, naku telugu lo ela type cheyalo teliyadu….

 9. మీరు రాసింది సరదాకే. కానీ మీ పోస్టులో ప్రస్తుతం వ్యవస్థలోని అసహజ, అశాస్త్త్రీయ పోకడల పట్ల అంతులేని అసంతృప్తి కనిపించింది. అంతర్లీనంగా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న వారిపై ఆక్రోశం కనిపించింది. అందుకే నేను అంతగా స్పందించాను.

  అవును మీరన్నది నూటికి నూరుపాళ్లూ నిజం. సమాజంలోని అన్ని అసమానతలకు కారణమైన మూలాన్ని, దాని పునాదుల్ని కూల్చకుండా ఎన్ని శాపనార్థాలు పెట్టినా దోపిడీదారుల ఉట్టి తెగదు. అందుకే అటువంటి మూలాల్ని ఎండగట్టేందుకు అందరూ ప్రయత్నించాలి. ముఖ్యంగా మేధావులు, ఉద్యమకారులు చేయాల్సింది అదే.

  అవును రామ్మోహన్ గారూ. ఆ మధ్య మీకో బ్లాగు ఉందని చెప్పినట్లు గుర్తు. కానీ మీరు రాస్తున్నట్లు లేదు….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s