పొదుపు విధానాలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న యూరప్ -ఫోటోలు


గత రెండున్నర సంవత్సరాలుగా యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలు దాదాపు అన్నివర్గాల ప్రజలను వీధుల్లోకి తెస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రవేటీకరణ వల్ల లక్షలాది ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించారు. పెన్షన్లను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. వేతనాలు కోత పెట్టడమే కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమ సదుపాయాలను కూడా రద్దు చేస్తున్నారు. దానితో ఆరోగ్య భద్రత కరువై వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకవైపు వేతనాలు తగ్గిస్తూ మరోవైపు పన్నులు సైతం పెంచేస్తున్నారు. దాదాపు సరుకులన్నింటి ధరలు పెరిగిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫీజులు భారీగా పెరిగాయి.

పొదుపు పేరుతో ఇవన్నీ అమలు చేస్తుండగా ప్రవేటు కంపెనీలు మాత్రం ఎప్పటిలా లాభాలు ప్రకటిస్తున్నాయి. ఆర్ధిక, ఋణ సంక్షోభాలను తెచ్చిన ప్రవేటు బహుళజాతి కంపెనీలు తమ సంక్షోభాన్ని ప్రజలపై రుద్ది ప్రజల వేతనాలు, సదుపాయాలను లాభాలుగా తరలించుకు పోతున్నందునే వారి లాభాలు ఎప్పటిలా కొనసాగుతుండగా, సంక్షోభ భాగాన్ని మాత్రం ప్రజలు భరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో యూరోజోన్ దేశాల్లో సమ్మె పోరాటాలు నిత్యకృత్యంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులతోనూ, మిలట్రీతోనూ తలపడుతున్నారు. సమ్మెలు జరిగినప్పుడల్లా వీధి పోరాటాలు తప్పడం లేదు. గ్రీసు, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ దేశాల నగరాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. యూరప్ నాయకులు జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండ్ దేశాలు కూడా మాంద్యాన్ని ఎదుర్కొంటూ పొదుపు విధానాలు రుద్దడం వలన ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. గత మూడు నెలలుగా యూరో జోన్ దేశాల్లో జరుగుతున్న సమ్మె పోరాటాల ఫోటోలను బోస్టన్ పత్రిక అందించింది.

2 thoughts on “పొదుపు విధానాలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న యూరప్ -ఫోటోలు

  1. ఏ దేశ పరిస్థితి చూసినా ఏమున్నది గర్వకారణం. ప్రతి దేశ పౌరుడూ పోరాటాల్లోనే సతమతం

వ్యాఖ్యానించండి