రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం ఇవ్వాలనీ, ఆయనకి ప్రభుత్వంలో కూడా నాయకత్వ పదవి అప్పజెప్పాలనీ కాంగ్రెస్ లో అనేకమంది చాలా కాలంగా శతపోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పుడల్లా ఈసారి రాహుల్ కి సముచిత పదవి తధ్యమని కాంగ్రెస్ పెద్దలతో పాటు, పత్రికలు కూడా ఊహాగానాలు చేయడం ఒక రొటీన్ గా ఉంటూ వచ్చింది. 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తాజా విస్తరణలో కూడా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రివర్గంలో స్ధానం పొందలేదు. ఎప్పటికప్పుడు పత్రికల ఊహాగానాలు విఫలం కావడానికి ఏమిటి కారణం?
రాహుల్ చుట్టూ సృష్టించిన అతి వైభోగమే ఆయన ఎందులోనూ కలవలేని పరిస్ధితిని కల్పించిందని ఈ కార్టూన్ సూచిస్తున్నది. కాంగ్రెస్ లోని యోధాన యోధులందరికీ అతీతమైన వ్యక్తిగా ఆయన్ని నిలబెట్టాలన్న ప్రయత్నాలు, ఆయన మాస్ లీడర్ గా ఫోకస్ కావడానికి అనర్హుడుగా మార్చివేస్తున్నాయి. మరోవైపు సమానుల్లో ప్రధానుడుగా ఉంటాడని చేసిన ప్రచారం అప్రధానుడుగా కూడా పనికిరానివాడిగా మార్చాయి. వెరసి రెంటికి చెడ్డ రేవడిగా రాహుల్ మిగిలినట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామిక పనివిధానం కొరవడిన వ్యక్తికేంద్రక రాజకీయ పార్టీల పని తీరు ఇంతకంటే మెరుగుగా ఉంటుందని ఆశించలేము.

ఇక్కడ ఇంకో టెక్నికల్ సమస్య ఉంది. రాజీవ్ గాంధీ వారసుడు కదా అని రాహుల్‌కి మంత్రి పదవి ఇస్తే అతను తరువాత ప్రధాన మంత్రి అవుతానంటాడు. రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవి ఇస్తే ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్‌లో వారసత్వం బేసిస్ మీద తనకి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని మన నెంబర్ 1 అవినీతి వీరుడు జగన్ అడుగుతాడు.
అంతే కాదు. ఇప్పటికే కుంభకోణాల్లో మునిగిపొయిన యూపిఏ ప్రభుత్వానికి రాహుల్ చివరి అస్త్రం లాగా భావిస్తున్నారు. అందుకే 2014 ఎన్నికల ముందు పూర్తిస్తాయిలో ప్రయోగించాలని అనుకొంటు వుండవచ్చు.