నగదు బదిలీ పధకం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా ఊదగరగొడుతూ వచ్చాయి. ఈ పధకాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కూడా ప్రకటించాడు. పేదలకు సబ్సిడీ ధరలకు సరుకులను అందించే బదులు సదరు సబ్సిడీని నగదు రూపంలో నేరుగా పేదల ఖాతాల్లోకి తరలించడమే ఈ పధకం లక్ష్యం. అంటే గ్యాస్ సిలిండర్, బియ్యం, రేషన్ సరుకులు తదితర సరుకలకీ ఇచ్చే సబ్సిడీని ఆయా సరుకులు కొనే సమయంలో ఇవ్వకుండా, సదరు సబ్సిడీ మొత్తాన్ని నగదు రూపంలో ఆ తర్వాత ఎప్పుడో కొనుగోలుదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారట. అంటే పేదలు సరుకులు కొనుగోలు చేసేటప్పుడు వాస్తవ ధర పెట్టి చెల్లించాల్సి ఉంటుంది. ‘మొదులుకి లేదు మొగుడా….’ అన్నట్లు ఆ డబ్బే చేతిలో ఉండే పరిస్ధితయితే సబ్సిడీల అవసరం ఎందుకు వస్తుంది?
అవినీతిని అరికట్టడానికి ఈ పద్ధతి ఎంచుకున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి. పేదలకు అందవలసిన సబ్సిడీలను అవినీతిపరులు బొక్కుతున్నారనీ, కనుక ప్రభుత్వానికీ, పేదలకు మధ్య ఉన్న దళారీ వ్యవస్ధను పక్కనబెట్టి సబ్సిడీ నేరుగా పేదలకు అందిస్తే అవినీతికి ఆస్కారం ఉండదనీ అవి చెబుతున్నాయి. పేదలకు ఇవ్వడానికి ఉద్దేశించిన సబ్సిడీ ఇన్నాళ్లూ వారికి చేరలేదని ప్రభుత్వం అంగీకరించిందని ఈ వాదన స్పష్టం చేస్తున్నది. ఈ క్రమంలో లక్షలాది రేషన్ డీలర్ల వ్యవస్ధను ఏంచేయనున్నారో వివరాలు ఇంకా వెలువడలేదు. డీలర్ల అవినీతిని నిర్మూలించే పేరుతో డీలర్లనే నిర్మూలించడానికి ప్రభుత్వం సిద్ధపడిందన్నమాట! ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది కనుక ప్రభుత్వాన్నే నిర్మూలించాలన్నట్లుగా ఉంది ప్రభుత్వ వాదన. అవినీతి నిర్మూలనకి లోక్ పాల్ వ్యవస్ధని తెచ్చే దమ్ములేని ప్రభుత్వాలు చివరికి ప్రజల ఉపాధి సౌకర్యాలనే నిర్మూలించడం వారి చేతకానితనానికి ప్రబల నిదర్శనం.
కాగా కుటుంబాల నిర్వహణ అంతా కుటుంబ యజమాని అయిన మగవాడి చేతుల్లోనే ఉంటుంది. సంపాదనని ఇంటికి తేవడం మాని తాగుడుకీ, పేకాటలకి తగలేసే భర్తలను మద్యం దుకాణాల ద్వారా, పేకాట క్లబ్బుల ద్వారా ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. ఇక కుటుంబానికి సరుకుల రూపంలో అందుతున్న కాస్త సబ్సిడీ సౌకర్యం కూడా నగదు బదిలీ పేరుతో భర్తలకి, తండ్రులకీ అప్పగిస్తే కుటుంబాలు గడుస్తాయా? ఈ విధంగా సబ్సిడీ సొమ్ము కూడా అనేకానేక అప్పులిచ్చి రక్తం పిండుతున్న ఫైనాన్స్ జలగల చేతుల్లోకి వెళ్లడానికే నగదు బదిలీ పధకం ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాపితంగా ప్రజా సామ్యాన్యాన్ని పట్టి పీడిస్తున్న అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్ధలకు మరిన్ని ఫైనాన్స్ వనరులను అప్పజెప్పడానికే నగదు బదిలీ పధకం అంతిమంగా ఉపయోగపడుతుంది. ఈ పధకం తెలుగు పత్రికలు చెబుతున్నట్లు ఏ నారా చంద్రబాబునాయుడు కుమారుడి మానస పుత్రికో లేక అవినీతి నిర్మూలనకో లేక ప్రజల సంక్షేమం కోసమో ఉద్దేశించినదో కాదు. ప్రజల ఆదాయాలు పడిపోయి, ఫైనాన్స్ వనరులు ఎక్కడికక్కడ బహుళజాతి ఫైనాన్స్ కంపెనీల బొక్కసాల్లో బిగదీసుకుపోయిన పరిస్ధితుల్లో సబ్సిడీల సొమ్ముని కూడా ఫైనాన్స్ వనరుల్లోకి తరలించే కుట్రలో భాగమే ఈ పధకం. ఈ కుట్రలను ప్రజలను తిరస్కరించి యధావిధిగా సబ్సిడీలను సరుకుల కోగులోలులోనే వర్తింపజేయాలని డిమాండ్ చేయాలి.

గోదాములలో నిల్వ ఉన్న ఆహారధాన్యాలని ప్రజలకి పంచితే ప్రజలు పని చెయ్యరు అని అన్న కాంగ్రెస్‌వాళ్ళే ఇప్పుడు ప్రజలకి ఉచితంగా డబ్బులు పంచుతామని అంటున్నారు. నమ్మడానికి మనం పంగనామాలు పెట్టుకుని ఉన్నాము.
We all(including the govermental machinery) know what is happening. The govt or executive tries to create a new problem rather than remedying the existing problem.
Eg., 1) The building inspectors allow unauthorized constructions for some time. Then the govt passes a GO to regularize these constructions rather than punishing those responsible for such acts.
2) What happens in contracts ? over quoting and escalating the costs? Then taking the shares a sper the %s. Take any government purchase. Most of the time they purchase at much higher price than the market price.All in the heirarchy knows.
I think severe punishments only can reduce such things.And progressively people may become alright over a period of time.
మనదేశం లో పేదవాడికి కడుపుకు తినటానికి తిండిగింజలు, కట్టుగుడ్డ, తాగునీరు ఉండదు కానీ నిషా ఎక్కించటానికి మందు మాత్రం ఎల్లా వేళల అందుబాటులో ఉంటుంది. ఈ నగదుబదిలీ ( ఒకవేళ వస్తే ) ద్వారా వచ్చిన సొమ్ముతో కడుపునిండా తాగొచ్చు.