అక్కు, లీల అనే ఇద్దరు దళిత మహిళలు 42 సంవత్సరాలుగా లెట్రిన్ లు కడుగుతున్నారు. వీరి నెల వేతనం అప్పుడూ, ఇప్పుడూ 15 రూపాయలే. కోర్టుకి వెళ్ళినందుకు ఆ 15 రూపాయలు కూడా చెల్లించడం మానేశారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హై కోర్టు, చివరికి సుప్రీం కోర్టు కూడా మహిళలకు అనుకూలంగా తీర్పులిచ్చి వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించాయి. కోర్టు ధిక్కారం నోటీసులు అందుకున్నాక కూడా, తీర్పులను అమలు చేయకపోగా, రిటైర్ మెంట్ వయసుకి చేరారు గనక సర్వీసులను రెగ్యులరైజ్ చెయ్యలేమని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం తమదని జబ్బలు చరుచుకునే భారతీయులకి సిగ్గుపడే అర్హత కూడా ఇక లేదని చెబితే కోపం రావచ్చు గానీ వాస్తవం అదే.
గవర్న్ మెంట్ వుమెన్ టీచర్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో 42 యేళ్ళుగా మురికి పని చేస్తున్న అక్కు, లీలల పరిస్ధితి ఒక మానవ హక్కుల సంస్ధ ద్వారా పదేళ్లక్రితం కోర్టు దృష్టికి వచ్చింది. ఉడుపిలోని ‘హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫౌండేషన్’ ప్రతినిధి రవీంద్రనాధ్ షాన్ బాగ్ సాయంతో మహిళలిద్దరూ 2001 లో ‘కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్’ (కె.ఎ.టి)ని ఆశ్రయించారు. దానితో కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖాధికారులకి కోపం వచ్చింది. లెట్రిన్ లు కడిగేవాళ్లు, అందునా ఆడోళ్ళు, మమ్ములను కోర్టులకు లాగుటయా అన్న ఆగ్రహం ముంచుకొచ్చింది కాబోలు, 15/- వేతనం కూడా చెల్లించడం మానేశారు.
“మహిళల సర్వీసులను 90 రోజుల్లోగా క్రమబద్ధీకరించాలని 2003 లో కె.ఎ.టి ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహిళలకి వేతనాలు చెల్లించాలని 2004 లో కర్ణాటక హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలని అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కార నోటీసులు కూడా విద్యాశాఖ అధికారులకి అందాయి. వాళ్ళకి వేతనాలు చెల్లించడానికి బదులుగా ప్రభుత్వం 2005 లో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది” అని రవీంద్రనాధ్ గురువారం పత్రికలకు తెలిపాడు.
“సుప్రీం కోర్టు 2010లో మహిళలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇంత జరిగినా మహిళలు తమ బెనిఫిట్స్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధికారులు ఏమంటారంటే మహిళలు పదవీ విరమణ వయసుకి చేరుకున్నారు గనక వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదని. వేతనాలు చెల్లించడం కంటే, ఈ నిస్సహాయ మహిళలపైన కేసుల్లో పోరాడడానికి లక్షలు ఖర్చు పెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపడం ఆశ్చర్యకరం” అని రవీంద్రనాధ్ విలేఖరులకు తెలిపాడు.
పదేళ్లుగా వేతనాలు చెల్లించని విద్యా శాఖాధికారులు అక్కు, లీల చేత టీచర్ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న 21 లెట్రిన్ లని కడిగిస్తూనే ఉన్నారు. కొంతమంది అధికారుల అహంభావం, బ్యూరోక్రసీ లోని రెడ్ టేపిజమ్ ఈ మహిళల పరిస్ధితికి కారణమని ‘ది హిందూ’ పత్రిక చెబుతోంది. అది నిజమే అయితే అసలు కారణంలో అదొక భాగం మాత్రమే. అసలు కారణం వ్యవస్ధాగతమైనది. కోర్టుల తీర్పులు ఉల్లంఘించడానికో, లొసుగుల్ని వినియోగించి సంవత్సరాల తరబడి సాగదీయడానికో పనికొస్తాయి తప్ప న్యాయం కోరే పేద దళితులకి అవి ఎన్నడూ అక్కరకు వచ్చిన దాఖలాలు లేవు.
అదే డబ్బున్న వ్యక్తులకైతే అనేక సెక్షన్లు, చట్టాలు అందుబాటులోకి వస్తాయి. అవినీతి సమస్య దేశ రాజకీయాలని ప్రభావితం చేస్తున్న పరిస్ధితులు ఉన్నాయి కాబట్టి గాలి, జగన్ లాంటివారిని జైల్లో ఉంచవలసి వచ్చింది గానీ, అన్నా గోల లేకపోతే ఆ మాత్రం నీతి ని కూడా ప్రభుత్వాలు చూపించవు. కింది కోర్టు జడ్జి డబ్బుకి లొంగకపోతే పై కోర్టులు ఎలాగూ సిద్ధంగా ఉంటాయి. వ్యవస్ధలపైన ప్రజలకి నమ్మకం పోయే పరిస్ధితి దాపురించినపుడు కనిపించే కోర్టుల క్రియాశీలత ఎప్పటికీ శాశ్వతం కాదు. భరించలేని స్ధాయికి చేరుకుని పచ్చిగా సాగుతున్న అనైతిక దోపిడీ మేడిపండు నాగరికతలో కూడా పోసగదు కాబట్టి కోర్టుల క్రియాశీలత అనివార్యంగా ముందుకు వస్తున్నది వ్యవస్ధలు పనిచేయడం వలన కాదు.
వ్యవస్ధ మారాలి, డబ్బున్నోడిదే న్యాయం, దోపిడి రాజ్యం, చట్టానికి కళ్ళు లేవు…. ఇలాంటి పదబంధాల వాస్తవ అర్ధం ప్రజానీకానికి తెలిసేలోపే రొటీన్ మాటలుగా మారిపోయాయి. ఆదర్శమూర్తుల ఉపన్యాసాలకు అలంకారాలుగా, అభ్యుదయ రాతలకు ముడిసరుకుగా అవి స్ధిరపడిపోయాయి. ఈ పరిస్ధితుల్లో, “ఈ మహిళలకి న్యాయం చేకూర్చే కోర్టు సుప్రీం కోర్టు కంటే పైన ఇంకేమన్నా ఉందా?” అని అడుగుతున్న రవీంద్రనాధ్ ప్రశ్నకి ధైర్యంగా, నమ్మకంగా సమాధానం ఇవ్వగలవారెవ్వరు?

కరీంనగర్ జిల్లా పరిషత్ పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 400 మంది దాకా ఇదేవిధమైన వెట్టిచాకిరీ చేస్తున్నారు. మొదట్లో వీరికి ఇచ్చింది నెలకు 250 రూపాయలే. ఇప్పుడు నెలకు రు.3000 లు ఇస్తున్నారు. గత 20 సంవత్సరాలనుండి పనిచేస్తున్నా రెగ్యులరైజ్ చేసే నాధుడు లేడు.
ఈ లింక్ చదవండి: http://4proletarianrevolution.mlmedia.net.in/70909611
Many thanks for bringing to light online, the most touching news item.
Normally, we tend to see many such articles but do not do any thing.
But after reading this article, I felt I need to donate a small amount to these to ladies.
Please initiate to collect a fund to donate to them via your site. Alternatively , let us know the address. I am sure many more will join me.
These ladies definitely deserve all our support, and not just consoling words.
ఇంత కంటే జుగుప్సాకరంగా పిల్లల చేత కూడా scavenging చెయ్యించేవాళ్ళు ఉన్నారు: http://4proletarianrevolution.mlmedia.net.in/20-25
In response to several readers’ offers of help for Akku and Leela, Ravindranath Shanbhag, the human rights activist who has been campaigning for their cause, says these women do not want any charity. All they want is for the government to pay them their due..
( I tracked the original article in the Hindu, and am disappointed to note the above ).
సుధాకర్ గారూ, మీరు విచారించవలసిన అవసరం లేదనుకుంటా.
నిజం చెప్పాలంటే సహాయం ఇస్తామన్నా తీసుకోవడానికి నిరాకరించిన అక్కు, లీలలను చూసి గర్వపడాలి. దయనీయ పరిస్ధితుల్లో సైతం వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికే నిర్ణయించుకున్నందుకు అభినందించాలి. ‘కడజాతి వాళ్ళు’ అని ఈసడించుకునే దళిత మహిళలకి ఒక వ్యక్తిత్వం ఉంటుందనీ, వారు తమ శ్రమ ఫలితాన్ని తప్ప బిక్షాన్ని ముట్టుకోరనీ అక్కు, లీలలు చాటి చెప్పారు. కోట్లాది ప్రజల డబ్బుని అవినీతి మార్గాల్లో బొక్కుతున్న నాయకులు, అధికారులు ఉన్న దేశంలో పరుల సొమ్ము అవసరం లేదని చెప్పినందుకు వారిద్దరినీ అభినందిద్దాం!
బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ కూడా ఈ వార్తను కవర్ చేసింది. ఆ వార్తను కింద లింక్ లో చూడవచ్చు.
Indian ‘untouchables’ paid 17p a month for life by authorities to clean lavatories