ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా రైతు కూలీలకి తెలిసిన భాష ‘శ్రమ’ ఒక్కటే. కొండలనుండి గడ్డిమోపులు దింపే స్విస్ రైతయినా, జొన్న చేలో కలుపు తీసే సత్నాపూర్ పేద రైతయినా వొళ్ళు వంచి రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించవలసిందే. ఇండియానాలో బ్లూ బెర్రీ ని తుంచి పోగు చేసే పెద్దా పిన్నా అయినా, బోర్డీక్స్ (ఫ్రాన్స్) లో ద్రాక్ష గుత్తుల్ని తెంచే ఆడా మగా అయినా సిగలు ముడేసి, నడుం బిగించి చెమట చుక్కలతో పుడమితల్లిని పునీతం కావించవలసిందే.
పోలండ్ నుండి వలసొచ్చి ఫ్రాంక్ ఫర్ట్ లో యాపిల్ కాయలు తెంచే కూలీ అమ్మ ఒకరైతే, అమెరికాలో పని వెతుక్కుంటూ ఆ మూలనుండి ఈ మూలకి వచ్చి పుచ్చకాయాల్ని ట్రక్కుల్లోకి ఎగరేసే దృఢకాయుడు మరొకరు.
ఆలమందల కాసే ఘనా బాలలు, పంటకోతల్లో చిందులేసే బోస్నియా ముదుసళ్ళు, పండు మిర్చిని మాలలల్లి ఎండబెట్టే నేపాల్ కూలి అవ్వ, నేర్రెలిచ్చిన నేలపై దిగులు చూపుల సాగే జమ్మూ రైతూ, మొక్కజొన్నల గుట్టల్లో బేరగాళ్ళకోసం చూస్తున్న లాహోర్ శ్రామికులు, అమ్మకానికి ముందు కూరగాయలను శుభ్రం చేస్తున్న హైతీ మహిళలూ ఈ ఫొటోల్లో దర్శనమిస్తున్నారు.
వీరంతా రైతులూ, కూలీలు; పెద్దలూ, పిల్లలూ; ఆడా, మగా; నల్ల జాతీ, తెల్ల జాతీ; పొట్టివారూ, పొడుగువారూ… రకరకాల ఈ జనాన్ని కలిపే ఒకే ఒక భాష, శ్రమ భాష. ప్రపంచ శ్రామికునికి వేన వేల దండాలు!
(బోస్టన్ డాట్ కామ్ ఈ ఫోటోల్ని అందించింది)
- స్విట్జర్లాండ్
- మైనె, అమెరికా
- వియన్నా, ఆస్ట్రియా
- బోర్డీస్, ఫ్రాన్స్
- ఫ్రాంక్ ఫర్ట్, జర్మనీ
- సత్నపూర్, ఇండియా
- సెకీరే, ఘనా
- ఇండియానా, అమెరికా
- బెర్మో, నైగర్
- హెర్గోవి, బోస్నియా
- ఖొకానా, నేపాల్
- జమ్ము, ఇండియా
- ఖొకానా, నేపాల్
- లాహోర్, పాకిస్తాన్
- పోర్ట్-ఔ-ప్రిన్స్, హైతీ
- రొకోవ్, చెక్
















మనిషిని జంతువు నుంచి వేరు చేసింది శ్రమే కదా! దేశదేశాల్లో రైతుల శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిఫలించిన ఈ ఛాయాచిత్రాలు కనువిందుగా ఉన్నాయి. వీటికి మీ వివరణ కూడా చాలా బాగుంది!