‘కాంగ్రెస్ (యు.పి.ఎ) ప్రభుత్వం మునిగిపోతున్న పడవ’ అని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఉవాచ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని కూడా గడ్కారీ ప్రకటించాడు. బి.జె.పి జాతీయ కార్యవర్గంలో మాట్లాడుతూ గడ్కారీ చెప్పిన ఈ మాటలు వాస్తవంలో నిజం కాదని పత్రికల ఏకాభిప్రాయం. బి.జె.పి నిజంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లయితే కాంగ్రెస్ వరుస ప్రజావ్యతిరేక సంస్కరణలతో బరితెగించేదేనా అన్నది పత్రికల వాదన. ఆ మాట కొంత నిజమే అయినా సంస్కరణల పట్ల బి.జె.పి కి ఉన్న ఏకాభిప్రాయాన్ని విస్మరించడానికి వీలులేదు. కాగా, పార్టీలోనే కాక, ఎన్.డి.ఎ భాగస్వామ్య పక్షాల మధ్య కూడా ప్రధాన మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న పరిస్ధితుల్లో బి.జె.పి ఎన్నికల సంసిద్ధత చింకి తెరచాపల పడవ ప్రయాణంగానే ఉండడం ఒక వాస్తవం.
–
–

ఎదురీత పత్రికలోని వ్యాసాలు చదివాను. 1992లో పివి నరసింహారావు అమలు చేసిన సామ్రాజ్యవాద అనుకూల విధానాలని బిజెపి బహిరంగంగా సమర్థించింది. ఉభయచర వామపక్ష పార్టీలు కేవలం ఒక రోజు బంద్ నిర్వహించి ఆ తరువాత ప్రజల ఒత్తిడి మేరకే బంద్ నిర్వహించామని చెప్పుకున్నాయి. ఈ సంస్కరణలని ప్రజలు వ్యతిరేకించకపోతే వాటిని సమర్థించొచ్చు అని ఉభయచర వామపక్ష పార్టీలు అనుకుంటున్నాయని దాని అర్థం. దేశాన్ని అమ్మివెయ్యడంలో పాలకవర్గ పార్టీలన్నీ ఒకే తాటి మీద నిలుస్తాయి.