అణు విద్యుత్ లేకపోయినా విద్యుత్ అవసరాలు గడిచిపోతాయి -అణు శాస్త్రవేత్త


ఇది ఈనాడులో సెప్టెంబర్ 1 తేదీన వచ్చిన ఆర్టికల్. భారత దేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికయినా అణు విద్యుత్ అవసరమా అన్న సమస్యను అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు ఇందులో చర్చించారు. అణు విద్యుత్ విషయమై భారత దేశంలో లోతైన చర్చ జరగలేదని సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులు అవసరమైన అణు విద్యుత్ వల్ల ఇతర ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిధులు మృగ్యం అవుతాయని తెలిపారాయన. అనేక అపోహలను తయారు చేసి ప్రజలను నమ్మిస్తున్నారని వివరించారు.

భారత దేశంలో అణు విద్యుత్ వ్యాపారాన్ని పెంపొందించుకోవాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ భావించారనీ, ఆయన కోరికను భారత ప్రధాని మన్మోహన్ మన్నించాలని భావించడం వల్లనే అణు ఒప్పందం జరిగింది తప్ప దేశం కోసం కాదని ఆయన చెబుతున్నారు. భారత్ పై ఉన్న అణు ఆంక్షలని ఎత్తివేయించుకోవడానికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాల వ్యాపార ప్రయోజనాలను నెరవేరుస్తున్నామని అణు శక్తి విభాగం డైరెక్టర్ డాక్టర్ అనీల్ కకోద్కర్ స్వయంగా చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పాఠకుల అవగాహనకు తోడ్పడుతుందని భావిస్తూ ఆర్టికల్ ను ప్రచురించడమైనది.

ఈనాడు ఆర్టికల్ – సెప్టెంబర్ 1, 2012 (క్లిక్ చేసి పెద్ద సైజు చూడగలరు.)

వ్యాఖ్యానించండి