కాంగ్రెస్ మార్కు అవినీతి వ్యతిరేక పోరాటం -కార్టూన్


అన్నా హజారే, ఆయన బృందం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాక వాళ్ళకి మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీ లేదు. జాతీయ పార్టీలతో పాటు అనేకానేక ప్రాంతీయ పార్టీలు కూడా అన్నా పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు క్యూలు కట్టారు. బి.జె.పి లాంటి పార్టీలు కార్యకర్తలను సరఫరా చేసి తెరవెనుక మద్దతు అందించాయి. అవినీతి సామ్రాట్టులుగా పేరుబడ్డవారు కూడా పత్రికా ప్రకటనలతో యధాశక్తి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా పార్లమెంటులోనే అన్నాకి మద్దతుగా గొప్ప గొప్ప ప్రసంగాలు దంచేసి తాము కూడా అవినీతికి వ్యతిరేకమేనని చాటుకున్నాయి. అన్నా ఆందోళన కోసం ప్రభుత్వమే సోంత ఖర్చులతో ఎర్త్ మూవర్లు తెప్పించి గ్రౌండు చదును చేసి అన్నా ఆందోళనకు సహకరించాయి. రాజకీయ పార్టీలన్నీ అవినీతికి వ్యతిరేకం అయితే అవినీతి చేసేదెవరు?

“యు.పి.ఏ తరహా అవినీతి వ్యతిరేక పోరాటం” అని కార్టూనిస్టు కేశవ్ చెప్పినప్పటికీ ఇది నిజానికి అన్నీ రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది.

Cartoonist: Kesav (The Hindu)

 

 

వ్యాఖ్యానించండి