12 మిలియన్ల యాపిల్ డివైజ్ లపై ఎఫ్.బి.ఐ నిఘా, హ్యాకర్ల వెల్లడి


Today’s Menu: 1000001 iPhones and someFBI butthurt

1.2 కోట్ల యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుదారులపై అమెరికా ఫెడరల్ పోలీసు సంస్ధ ఎఫ్.బి.ఐ నిఘా పెట్టిన సంగతిని హ్యాకర్లు బట్టబయలు చేశారు. ఎఫ్.బి.ఐ ఉన్నతాధికారికి చెందిన ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అందులో 12,367,232 యాపిల్ డివైజ్ లకు చెందిన యు.డి.ఐ.డి (Unique Device IDentifiers) లను ఎఫ్.బి.ఐ నిలవ చేసిన సంగతిని హ్యాకర్లు వెల్లడి చేశారు. యు.డి.ఐ.డి లు నిజమైనవే అని చెప్పడానికి ఒక మిలియన్ యు.డి.ఐ.డి లను కూడా తమ వెబ్ సైట్ లో ప్రచురించారు. యధావిధిగా ఎఫ్.బి.ఐ తాము నిఘా వేసిన సంగతిని తిరస్కరించారు. తమకేపాపం తెలియదని ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు.

యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినవారి కొనుగోలు ప్రవర్తనలపై నిఘా పెట్టడానికి యాపిల్ కంపెనీయే తమ ఉత్పత్తుల్లో యు.డి.ఐ.డి టెక్నాలజీని ప్రవేశపెట్టింది. యాపిల్ అప్లికేషన్లను తయారు చేసే కంపెనీలకు ఈ యు.డి.ఐ.డి లను యాపిల్ అప్పజెపుతుంది. ఈ టెక్నాలజీయే అమెరికా ప్రభుత్వానికి ప్రజలపై నిఘా పెట్టే సాధనంగా మారిపోయిందని తాజా వెల్లడి స్పష్టం చేసింది. వినియోగదారుల అవసరాలు తీర్చే నిమిత్తం అని చెప్పే ఈ టెక్నాలజీ చివరికి కొనుగోలుదారుల కార్యకలాపాలపైన నిఘా వేయడానికి పోలీసులకు, గూఢచారులకు సాధనంగా మారిపోయింది.

ఎఫ్.పి.ఐ అధికారి ల్యాప్ టాప్ ను తాము ఎలా హ్యాక్ చేసిందీ వివరాలను హ్యాకర్లు ఇలా వివరించారు:

During the second week of March 2012, a Dell Vostro notebook, used by Supervisor Special Agent Christopher K. Stangl from FBI Regional Cyber Action Team and New York FBI Office Evidence Response Team was breached using the AtomicReferenceArray vulnerability on Java, during the shell session some files were downloaded from his Desktop folder one of them with the name of “NCFTA_iOS_devices_intel.csv” turned to be a list of 12,367,232 Apple iOS devices including Unique Device Identifiers (UDID), user names, name of device, type of device, Apple Push Notification Service tokens, zipcodes, cellphone numbers, addresses, etc.

యు.డి.ఐ.డి లతో పాటు వినియోగదారుల పేర్లు, యాపిల్ పరికరం పేరు, ఏ.పి.ఎన్.ఎస్ టోకెన్లు, జిప్ కోడ్లు, సెల్ ఫోన్ నంబర్లు, చిరునామాలు అన్నీ ఎఫ్.బి.ఐ అధికారి కంప్యూటర్ లో భద్రపరిచారని హ్యాకర్లు తెలిపారు. ఏనోనిమస్, లుల్జ్ సెక్ తదితర హ్యాకింగ్ సంస్ధలు ఎఫ్.బి.ఐ అధికారికంగా పాల్పడిన ఈ హ్యాకింగ్ ప్రాజెక్టును బట్టబయలు చేసిన వాటిలో ఉన్నాయి. ఈ సంస్ధలు ఉమ్మడిగా AntiSec అనే పేరు కింద ఎఫ్.బి.ఐ కంప్యూటర్ ను హ్యాక్ చేసినట్లు వారి ప్రకటనను బట్టి తెలుస్తున్నది. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉత్పత్తులు ప్రజా జీవనాన్ని సులభతరం చేయడం ఒక అంశం అయితే, ఉత్పత్తుల వినియోగం కంపెనీలు, ప్రభుత్వాలు నిర్దేశించిన పరిధులమేరకే ఉపయోగించేలా అదృశ్య పరిమితులు విధించడం మరొక అంశం.

ఎఫ్.బి.ఐ సంస్ధ అధికారికంగా చేస్తున్న రహస్య హ్యాకింగ్ పై హ్యాకర్లు చేసిన ప్రకటన పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.

అసలు యు.డి.ఐ.డి అన్న కాన్సెప్ట్ నే తమకు మొదటినుండీ ఇష్టం లేదని హ్యాకర్లు ప్రకటించారు. వారి అయిష్టత ఎంత న్యాయమైనదో ఎఫ్.బి.ఐ హ్యాకింగ్ నిఘా స్పష్టం చేస్తున్నది. ఐఫోన్, ఐపాడ్ లపై నిఘా వేయడం ద్వారా వినియోగదారుల సమస్త కార్యకలాపాలపై ఎఫ్.బి.ఐ నిఘా వేసిందని గ్రహించవచ్చు. ‘వినియోగదారుల యాపిల్ పరికరాలపై ఎఫ్.బి.ఐ నిఘా పెట్టిందని చెప్పి ఊరుకుంటే పట్టించుకునేవారెవరూ లేరనీ, అందువల్లనే తప్పని పరిస్ధితుల్లో ప్రమాదం గురించి హెచ్చరించడానికి మిలియన్ యు.డి.ఐ.డి లను ప్రచురించవలసి వచ్చిందని హ్యాకర్లు ప్రకటించారు.

యాపిల్ వినియోగదారులారా, తస్మాత్ జాగ్రత్త!

వ్యాఖ్యానించండి