‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మ్యాగజైన్ (National Geographic Traveler) వారు 2012 సంవత్సరానికి గాను నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఫొటోలివి. 152 దేశాలకు చెందిన 6,615 మందికి పైగా ఫోటో గ్రాఫర్లు 12,000 కి పైగా సమర్పించిన ఎంట్రీలనుండి విజేతలను నిర్ణయించారరని మ్యాగజైన్ వెబ్ సైట్ తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వియత్నాం వరకూ తీసిన ఈ ఫొటోల్లో ప్రశాంత ల్యాండ్ స్కేప్ దృశ్యాలనుండి యాదృచ్ఛిక సంఘటనల వరకూ అన్ని రకాల దృశ్యాలనూ పరిగణించారట. మొత్తం మీద చూస్తే ప్రయాణ యాత్రలను మరపురానివిగా చేయగల ఆయా ప్రాంతాల సౌందర్యాన్ని ఈ ఫోటోలు వ్యక్తీకరిస్తాయని నిర్వాహకులు అభిభాషించారు. నేషనల్ జాగ్రఫిక్ నిపుణులనుండి వివిధ నిష్ణాతులైన ఫోటోగ్రాఫర్లు ఎంచిన ఈ ఫోటోలు నిర్వాహకుల అంచనాలను అందుకున్నాయనడంలో సందేహం లేదనిపిస్తోంది.
- ఓ పక్క భారీ వర్షం, మరో పక్క భారీ అలలతో విరుచుకుపడుతున్న సముద్ర భీభత్సం. ఫిజీ ఒడ్డున ఓ సర్ఫర్ విన్యాసాలు. ఫొటో: Lucia Griggi
- ఫిన్మార్క్ (నార్వే) లో ఓ ఒంటరి కేబిన్. ఫొటో: Michelle Schantz
- మోక్ చౌ (వియత్నాం) లో హమాంగ్ మైనారిటీ పిల్లల కేరింతలు. ఫొటో: Vo Anh Kiet
- ట్రపని (ఇటలీ) లో ఈస్టర్ రోజున రాత్రంతా క్రీస్తుని వీధుల్లో ఊరేగించడం సంప్రదాయం. ఫొటో: Andrea Guarneri
- Baobab చెట్లు మడగాస్కర్ కి ప్రత్యేకం. వెయ్యేళ్ల వయసు కూడా ఉండే ఈ చెట్లు మలగాసి ప్రజలకు పూజ్యనీయం. ఫొటో: Ken Thorne
- The Last Supper Of Da Vinci? No, they are just some old men of Chefchaouen with djellaba, sitting and talking with each other. Photo: SauKhiang Chau
- చిలీ దక్షిణ తీరాన ఫొటో గ్రాఫర్ చెల్లెలి జలకాలాట. ఫొటో: Camila Massu
- ఫారో ద్వీపకల్పం (డెన్మార్క్) లో 16 మంది మాత్రమే నివసించే గ్రామం. 2004లో వెనక కొండకి సొరంగం తవ్వేదాకా పక్క గ్రామానికి వెళ్లాలంటె 400 మీటర్ల కొండ ఎక్కి దిగడమే మార్గం. ఫొటో: Ken Bower
- పోర్ట్ లాండ్ జపనీస్ గార్డెన్ లోని మేపుల్ చెట్టు. తరచుగా ఫొటోగ్రాఫర్ల దృష్టిలో పడే ఈ చెట్టుని వైవిధ్యమైన దృక్కోణంతో ఈ ఫొటో తీసానంటున్నాడు ఫొటో గ్రాఫర్: Fred An
- ఒకప్పటి పాగన్ సామ్రాజ్య రాజధాని బాగన్ (బర్మాలోని మాండలే ప్రాంతం) లో ప్రాచీన బౌద్ధ దేవాలయల మధ్య ఓ దృశ్యం. ఫొటో గ్రాఫర్: Peter DeMarco









