ఆఫ్రికా గడ్డ పై ‘ద లాస్ట్ సప్పర్’ -ఫొటో


లియొనార్డో డా-విన్సి గీసిన ఫేమస్ పెయింటింగ్ ‘ద లాస్ట్ సప్పర్’ ను తలపిస్తున్న ఈ ఫొటో ఆఫ్రికా దేశం మొరాకో లో తీసినది. ‘నేషనల్ జాగ్రఫీ ట్రావెలర్ ఫొటో’ పోటీల్లో మెరిట్ బహుమతి పొందిన ఈ ఫోటోని సౌఖియాంగ్ చౌ (SauKhiang Chau) అనే ఫొటోగ్రాఫర్ తీసాడు. మొరాకోతో పాటు మరి కొన్ని ఉత్తర ఆఫ్రికా దేశాల్లోనూ, మరికొన్ని పశ్చిమాసియా దేశాల్లోనూ ధరించే ‘జెల్లాబా’ (djellaba) అనే దుస్తుల వల్ల డా-విన్సి పెయింటింగ్ ని తలపిస్తూ ఫొటో గ్రాఫర్ దృష్టిని ఈ పెద్దవాళ్లు ఆకర్షించారు. ఫొటో గ్రాఫర్ కి బహుమతి కూడా తెచ్చిపెట్టారు. చెఫ్ చౌ (Chefchaouen) అనే పట్టణంలో రోడ్డు పక్క, కబుర్లతో ఇలా సేద తీరుతూ తెలుగు బ్లాగ్ పాఠకుల దాకా నడిచొచ్చారు. (క్లిక్ చేస్తే పెద్ద ఫొటో చూడవచ్చు.)

ఫొటోకి ఫొటోగ్రాఫర్ పెట్టిన కాప్షన్ ఇది:

“The Last Supper Of Da Vinci? No, They are just some old men of Chefchaouen with djellaba, sitting and talking each other”.

వ్యాఖ్యానించండి